ట్రాఫిక్ సమస్య చెప్పిన వ్యక్తిని ట్రాఫిక్ పోలీస్ చేశారు, ఎక్కడో తెలుసా..!

భారతదేశంలో ట్రాఫిక్ అనేది చాలా సర్వసాధారణం. ఎందుకంటే పెరుగుతున్న జనాభాతో పాటు వాహనాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతున్న వాహన రద్దీ కారణంగా ట్రాఫిక్ కూడా పెరుగుతూ ఉంది. ఉత్తరప్రదేశ్ లో ట్రాఫిక్ సమస్య వల్ల జరిగిన ఒక సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంతకీ ఉత్తరప్రదేశ్ లో జరిగిన సంఘటన ఏంటి అనే విషయాన్ని గురించి పూర్తిగా తెలుసుకుందాం!

ట్రాఫిక్ సమస్య చెప్పిన వ్యక్తిని ట్రాఫిక్ పోలీస్ చేశారు, ఎక్కడో తెలుసా..!

ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో సుభాష్ కూడలి వద్ద సోను చౌహాన్ అనే వాహనదారుడు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. ట్రాఫిక్ లో ఉన్న ఈ వాహనదారుడు ఈ ట్రాఫిక్ సమస్య గురించి చెప్పడానికి సమీపంలో ఉన్న ఒక సీనియర్ పోలీస్ అధికారి దగ్గరికి వెళ్ళాడు. ఆ పోలీస్ అధికారి తనకి సహాయం చేయడం మానేసి అక్కడికక్కడే ట్రాఫిక్ నిర్వహించమని కోరాడు.

ట్రాఫిక్ సమస్య చెప్పిన వ్యక్తిని ట్రాఫిక్ పోలీస్ చేశారు, ఎక్కడో తెలుసా..!

సోను చౌహాన్ పోలీస్ అధికారి కోరిక ప్రకారం అక్కడికక్కడే సర్కిల్ ఆఫీసర్ హోదాలో ‘ట్రాఫిక్ వాలంటీర్' గా నియమించారు. సాధారణ ఉద్యోగికి ఉండే రిఫ్లెక్టివ్ హై విజిబిలిటీ జాకెట్ మరియు హెల్మెట్ కూడా ఇచ్చారు. సోను చౌహాన్ దాదాపు 2 గంటల పాటు అక్కడే ట్రాఫిక్ నిర్వహణకు సహాయపడ్డాడు. అంటే కాకుండా పోలీస్ వాహనంలో కూడా ప్రయాణించాడు.

ట్రాఫిక్ సమస్య చెప్పిన వ్యక్తిని ట్రాఫిక్ పోలీస్ చేశారు, ఎక్కడో తెలుసా..!

సోను చౌహాన్ ట్రాఫిక్ ని క్లియర్ చేసే క్రమంలో రోడ్డు నియమాలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు కూడా విధించాడు. నో పార్కింగ్ వారికి, తప్పుడు డ్రైవింగ్ చేసిన వారికి మాత్రమే కాకుండా వివిధ నియమాల ఉల్లంఘనలకు మొత్తం ఎనిమిది జరిమానాలు విధించాడు.

సర్కిల్ ఆఫీసర్ హోదాలో ఉన్న సోను రెండు గంటల వ్యవధిలోనే దాదాపు 1,600 రూపాయల జరిమానాలు జారీ చేసాడు. ఇది మాత్రమే కాకుండా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారి పత్రాలను స్వాధీనం చేసుకుని తరువాత స్టేషన్ లో జరిమాన చెల్లించి, పత్రాలను పొందామని చెప్పాడు.

ట్రాఫిక్ సమస్య చెప్పిన వ్యక్తిని ట్రాఫిక్ పోలీస్ చేశారు, ఎక్కడో తెలుసా..!

ఫిరోజాబాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామ్‌దత్ శర్మ సోను అనుసరిస్తున్నారని, అంతే కాకుండా చాలా మంది ట్రాఫిక్ బృందం కూడా ఇతనిని అనుసరిస్తున్నట్లు సమాచారం తెలిసింది. సమాజంలో పెయోరులకు భాద్యత ఉండాలని అప్పుడప్పుడు ఇలాంటి పనులు భవిష్యత్ లో కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఈ విధంగా చేయడం వల్ల ట్రాఫిక్ బాగా మెరుగుపడుతుందని చెప్పారు.

ట్రాఫిక్ సమస్య చెప్పిన వ్యక్తిని ట్రాఫిక్ పోలీస్ చేశారు, ఎక్కడో తెలుసా..!

ట్రాఫిక్ అధికారిగా రెండు గంటలు విధి నిర్వహించిన సోను చౌహన్ విలేకరులతో మాటాడుతూ, సాధారణ వ్యక్తులమైన మనం ఈ హోదాలో ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు వస్తాయో మనకు అవగతం అవుతాయి. ఒక వాహనదారుడు తప్పుగా ప్రయాణించడం వల్ల ఎంత మంది వాహనదారులకు ఇబందిని కలిగిస్తుందో ప్రత్యక్షంగా చూడవచ్చని చెప్పారు. ఈ విధిని నిర్వహించడం వల్ల ప్రతి పౌరుడు బాద్యతాయుత్తమైన వ్యక్తిగా మారుతాడు అని చెప్పాడు.

సాధారణంగా ఒక పోలీస్ అధికారి సహాయం చేయకుండా సహాయం చేయమనడం అరుదైన సంఘటనలలో ఒకటి. పోలీసులు సోనుతో ఎం మాటాడారో తెలియదు కానీ యితడు ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి ఒప్పుకున్నాడు. చేసిన రెండు గంటల డ్యూటీతోనే అందరి మన్ననలను పొందాడు మన సోను చౌహన్.

Most Read Articles

English summary
Man complains about a traffic jam, UP Police asks him to manage traffic [Video]. Read in Telugu.
Story first published: Saturday, February 22, 2020, 14:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X