కొత్త జర్మన్ లగ్జరీ కారు కొన్న మెగా కోడలు ఉపాసన.. ధర అక్షరాలా రూ. 1 కోటికి పైమాటే

అపోలో అధినేత మనవరాలు, మెగాస్టార్ చిరంజీవి కోడలు మరియు మెగాపవర్‌ స్టార్‌ 'రామ్‌ చరణ్‌' భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే సెలబ్రెటీకి భార్యగా ఉండి కూడా సామజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎప్పటికప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందుతోంది.

సోషల్ మీడియాలో తరచుగా ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని మెళుకువలను పంచుకుంటూ తానూ కూడా మంచి సంఖ్యలోనే అభిమానులను పెంచుకుంటోంది. అయితే ఇటీవల కొణిదెల ఉపాసన అదిరిపోయే ఒక లగ్జరీ కారు కొన్నట్లు తెలిపింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

కొత్త జర్మన్ లగ్జరీ కారు కొన్న ఉపాసన.. ధర అక్షరాలా రూ. 1 కోటికి పైమాటే

నివేదికల ప్రకారం.. ఉపాసన జర్మన్ లగ్జరీ బ్రాండ్ అయిన 'ఆడి' (Audi) యొక్క 'ఈ-ట్రాన్' (E-Tron) కొనుగోలు చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన సమాచారం ఈమె తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ద్వారా తెలిపింది. ఇందులో 'నా దృష్టిలో భవిష్యత్తు అంటే, సుస్థిరతతో పాటు, ప్రగతిశీల లగ్జరీ కూడా కలిసి వస్తుంది. ఈ విషయంలో ఆడి ఈ రెండింటినీ అందిస్తుంది. అంతే కాకూండా ఇది సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుందని తెలిపింది. ఉపాసన కొనుగోలు చేసిన ఈ లగ్జరి ఆడి ఈ-ట్రాన్‌ ధర దాదాపు రూ. 1.20 కోట్లకు పైగా ఉండవచ్చు.

కొత్త జర్మన్ లగ్జరీ కారు కొన్న ఉపాసన.. ధర అక్షరాలా రూ. 1 కోటికి పైమాటే

ఉపాసన కొనుగోలు చేసిన ఈ ఆడి ఈ-ట్రాన్ కారు రెడ్ కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది. అయితే కంపెనీ దీనిని మొత్తం 9 కలర్స్ లో అందిస్తోంది. అవి 'టైఫూన్ గ్రే, సియామ్ బీజ్, మిథోస్ బ్లాక్, గ్లాసియర్ వైట్, గెలాక్సీ బ్లూ, ఫ్లోరెట్ సిల్వర్, కాటలున్యా రెడ్, నవరా బ్లూ కలర్స్.

కొత్త జర్మన్ లగ్జరీ కారు కొన్న ఉపాసన.. ధర అక్షరాలా రూ. 1 కోటికి పైమాటే

ఆడి కంపెనీ యొక్క ఈ ఎలక్ట్రిక్ కారు డిజైన్ మరియు ఫీచర్స్ లో ఏ మాత్రం ఇతర లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లకు తీసిపోకుండా ఉంది. ఇందులో మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, బూట్-లిడ్ పై ఎల్‌ఈడీ బార్, ఎల్‌ఈడీ టైల్ లాంప్స్, 20-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఇరువైపులా ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉన్నాయి.

కొత్త జర్మన్ లగ్జరీ కారు కొన్న ఉపాసన.. ధర అక్షరాలా రూ. 1 కోటికి పైమాటే

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ మరియు క్లైమేట్ కంట్రోల్ కోసం మూడు స్క్రీన్‌లను కలిగి ఉంది. వీటితో పాటు ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వాయిస్-అసిస్టెంట్, మై ఆడి కనెక్ట్, పనోరమిక్ సన్‌రూఫ్, హెడ్-అప్ డిస్ప్లే, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే మరియు మౌంటెడ్ కంట్రోల్స్‌తో ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటివి ఉన్నాయి.

కొత్త జర్మన్ లగ్జరీ కారు కొన్న ఉపాసన.. ధర అక్షరాలా రూ. 1 కోటికి పైమాటే

ఆడి ఈ-ట్రాన్ రెండు వేరియంట్లలో (ఈ-ట్రాన్50 & ఈ-ట్రాన్55) లభిస్తుంది. కావున ఉపాసన ఇందులో ఏ వేరియంట్ కొనుగోలు చేసింది అనే విషయం స్పష్టంగా తెలియదు. అయితే ఈ రెండు వేరియంట్లు రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉంటాయి. ఆడి ఈ-ట్రాన్50 71kWh కెపాసిటీ కలిగిన బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 308 బిహెచ్‌పి పవర్ మరియు 540 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 6.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఆడి ఈ-ట్రాన్50 యొక్క గరిష్ట వేగం గంటకు 190 కిమీ.

కొత్త జర్మన్ లగ్జరీ కారు కొన్న ఉపాసన.. ధర అక్షరాలా రూ. 1 కోటికి పైమాటే

ఆడి ఈ-ట్రాన్55 95kWh కెపాసిటీ కలిగిన బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 402 బిహెచ్‌పి పవర్ మరియు 664 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 5.7 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఆడి ఈ-ట్రాన్55 యొక్క గరిష్ట వేగం గంటకు 200 కిమీ వరకు ఉంటుంది.

ఆడి ఈ-ట్రాన్ 7 వేర్వేరు డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి డైనమిక్, స్పోర్ట్, ఎఫిషియెన్సీ, కంఫర్ట్, ఆల్-రోడ్, ఆఫ్-రోడ్ & ఇండివిజువల్ మోడ్స్. ఇందులో ఉన్న ప్రతి మోడ్ వాహనదారునికి డ్రైవింగ్ విషయంలో చాలా అనుకూలంగా ఉండి, మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

కొత్త ఆడి అధునాతన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 8 ఎయిర్‌బ్యాగులు, బ్రేక్ అసిస్ట్, ఎబిఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటర్ మరియు ప్రీ-సెన్స్ బేసిక్ వంటివి ఉన్నాయి. ఇది ప్రయాణికుల భద్రతకు చాలా ప్రాముఖ్యతను ఇస్తాయి.

కొత్త జర్మన్ లగ్జరీ కారు కొన్న ఉపాసన.. ధర అక్షరాలా రూ. 1 కోటికి పైమాటే

ఆడి ఈ-ట్రాన్50 గరిష్టంగా 370 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. అదేవిధంగా ఈ-ట్రాన్55 యొక్క పరిధి గరిష్టంగా 480 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే ఈ పరిధి వాస్తవ శ్రేణి గణాంకాల ఆధారంగా కొంత మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ-ట్రాన్ అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ఇప్పుడు మెగా వారి కోడలు కొనుగోలు చేసిన కొత్త కారు మెగా ఫ్యామిలీ గ్యారేజిని అలంకరిస్తోంది.

Most Read Articles

English summary
Upasana buy new audi e tron car detals
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X