పొట్టి దుస్తులతో కారు దిగడానికి ఇబ్బంది పడిన పొడుగు కాళ్ల సుందరి!

లాంబోర్ఘిని, ఫెరారీ వంటి సూపర్ స్పోర్ట్స్ కార్లు చూడటానికి చాలా అందగానే కనిపిస్తాయి. కానీ, పొడవుగా ఉండే వారు అలాంటి కార్లలోకి ఎక్కాలన్నా లేక దిగాలన్నా కాస్తంత ఇబ్బంది పడాల్సిందే. అలాంటి ఓ సంఘటనే మన బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాకు ఎదురైంది.

పొట్టి దుస్తులతో కారు దిగడానికి ఇబ్బంది పడిన పొడుగు కాళ్ల సుందరి!

ఊర్వశి రౌతేలా ఓ ఖరీదైన లాంబోర్ఘిని కారులోనుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడింది. భారీ బడ్జెట్‌తో తమిళంలో నిర్మిస్తున్న 'ది లెజెండ్' అనే సైన్స్-ఫిక్షన్ చిత్రంలో ఆమె నటిస్తోంది. ఆ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌లో భాగంగా ఊర్వశి రౌతేలా చెన్నై నగరంలో ఇలా కనిపించింది.

పొట్టి దుస్తులతో కారు దిగడానికి ఇబ్బంది పడిన పొడుగు కాళ్ల సుందరి!

టాల్ గర్ల్ ప్రాబ్లమ్స్ అంటూ ఊర్వశి రౌతేలా ఈ ఫొటోలోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ సారాంశం ఇలా ఉంది "ఇన్‌స్టాగ్రామ్ వర్సెస్ రియాలిటీ, టాల్ గర్ల్ ప్రాబ్లమ్స్. నేను నా బే లాంబోలో వస్తున్నాను. తమిళంలో నా మొదటి భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ది లెజెండ్'లో నా ప్రయాణం ప్రారంభమైంది" అని ఈ పొడుగు సుందరి పేర్కొంది.

పొట్టి దుస్తులతో కారు దిగడానికి ఇబ్బంది పడిన పొడుగు కాళ్ల సుందరి!

ది లెజెండ్ చిత్రాన్ని కేవలం తమిళంలోనే కాకుండా పలు భారతీయ భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగానే ఊర్వశి రౌతేలా పసుపు రంగు లాంబోర్ఘినీ హురాకన్ సూపర్‌కారు డ్రైవర్ సీటులోనుండి బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కారు ఆమెదా లేక చిత్రంలో ఓ భాగమా అనేది తెలియాల్సి ఉంది.

పొట్టి దుస్తులతో కారు దిగడానికి ఇబ్బంది పడిన పొడుగు కాళ్ల సుందరి!

సూపర్‌కార్లు అత్యధిక వేగంతో ప్రయాణిస్తాయి కాబట్టి, తక్కువ డౌన్‌ఫోర్స్ సృష్టించేందుకు వీలుగా వీటిని ఎత్తు తక్కువ ఉండేలా డిజైన్ చేస్తారు. ఫలితంగా, ఇవి వేగంగా వెళ్తున్నప్పుడు కూడా స్థిరంగా ఉండే ఏరోడైనమిక్ డిజైన్‌ను కలిగి ఉంటాయి.

పొట్టి దుస్తులతో కారు దిగడానికి ఇబ్బంది పడిన పొడుగు కాళ్ల సుందరి!

ఇలాంటి సూపర్ కార్లు ఎత్తు తక్కువగా ఉన్నప్పటికీ, లోపల కూర్చున్న వ్యక్తులకు మాత్రం తగినంత హెడ్‌రూమ్ మరియు లెగ్‌రూమ్ ఉంటుంది. వీటి లో సీటింగ్ పొజిషన్ కారణంగా, కారులోకి ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు డ్రైవర్లు కాస్తంత ఇబ్బంది పడక తప్పదు.

పొట్టి దుస్తులతో కారు దిగడానికి ఇబ్బంది పడిన పొడుగు కాళ్ల సుందరి!

లాంబోర్ఘిని హురాకన్ సూపర్‌కార్ విషయానికి వస్తే.. ఈ కారులో 5.2 లీటర్ వి10 ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8250 ఆర్‌పిఎమ్ వద్ద 610 పిఎస్‌ల శక్తిని, 560 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్‌ఫుల్ ఇంజన్ లాంబోర్గినీ డోపియా ఫ్రిజియోన్ (ఎల్‌డిఎఫ్) సెవన్-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

పొట్టి దుస్తులతో కారు దిగడానికి ఇబ్బంది పడిన పొడుగు కాళ్ల సుందరి!

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ సూపర్‌కారు కేవలం 3.2 సెకండ్ల వ్యవధిలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. మరియు 9.9 సెకండ్ల వ్యవధిలో గంటకు 0-200 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 325 కిలోమీటర్లుగా ఉంటుంది.

లాంబోర్గిని హురాకన్‌కు ఆ పేరు పెట్టడం వెనుక పెద్ద చరిత్రే ఉంది. అప్పట్లో 1879 కాలానికి చెందిన స్పానిష్ ఫైటింగ్ బుల్ నుండి స్ఫూర్తి పొంది లాంబోర్ఘిని హురాకన్‌కు ఈ పేరును పెట్టడం జరిగింది. మనదేశంలో ఈ కారు ధర సుమారు రూ.4 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.

Most Read Articles

English summary
Urvashi Rautela Struggles To Get Out From Lamborghini Huracan. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X