అమెరికన్ కార్ డీలర్‌కు భారీ జరిమానా, 5 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే?

అమెరికన్ కోర్టు ఇటీవల ఒక కార్ డీలర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు, ఏకంగా 4 మిలియన్ డాలర్ల జరిమానా విధించారు. ఇంతకీ అమెరికన్ కోర్ట్ ఎందుకు ఈ డీలర్ కి జరిమానా విధించి, జైలు శిక్ష విధించింది, అతడు చేసిన నేరం ఏంటి అనే విషయాలను గురించి క్షుణ్ణంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

అమెరికన్ కార్ డీలర్‌కు భారీ జరిమానా, 5 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే?

నివేదికల ప్రకారం ఈ కారు డీలర్ కారులో ఓడో మీటర్‌ను ట్యాంపరింగ్ చేసిన నేరానికిగాను అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధించి, $ 4 మిలియన్ డాలర్ల జరిమానా విధించారు. అంటే భారత కరెన్సీ ప్రకారం ఇది అక్షరాలా రూ. 30 కోట్లు.

అమెరికన్ కార్ డీలర్‌కు భారీ జరిమానా, 5 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే?

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి కియో ఎ. మాట్సుమోటో ఈ శిక్షను విధించారు. ఓడో మీటర్ కుంభకోణంలో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నట్లు తెలిసింది. ఇందులో ష్ముయెల్ మరియు అతని సోదరుడు సీమ్ ఉన్నారు. ఈ ఇద్దరు సోదరులు సెకండ్ హ్యాండ్ కార్ అమ్మకాలు చేపట్టేవారు.

అమెరికన్ కార్ డీలర్‌కు భారీ జరిమానా, 5 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే?

ఈ సెకండ్ హ్యాండ్ కార్ వ్యాపారంలో మరింత ఎక్కువ లాభాలను సంపాదించడానికి, వారు తక్కువ కిలోమీటర్లు ప్రయాణించినట్లు చూపించే ఓడోమీటర్ ఈ పాత కార్లకు ఫిక్స్ చేసేవారు. అంతే కాకుండా వీటికి సంబంధించి కొన్ని నకిలీ డాక్యుమెంట్స్ కూడా క్రియేట్ చేసి సెకండ్ కార్స్ అమ్మేవారు.

అమెరికన్ కార్ డీలర్‌కు భారీ జరిమానా, 5 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే?

ఈ విధమైన నేరాలకు పాల్పడిన కారణంగా కోర్టు ఈ డీలర్‌కు ఇంత పెద్ద శిక్ష విధించారు. ఈ ఇద్దరు సోదరులు ఈ కుంభకోణంలో దాదాపు 690 వాహనాలను మోసపూరితంగా విక్రయించినట్లు తెలిసింది. వారు 2006 నుండి 2011 వరకు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.

అమెరికన్ కార్ డీలర్‌కు భారీ జరిమానా, 5 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే?

ప్రస్తుతం ఈ కేసులో ఇద్దరూ శిక్షలను అనుభవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెకండ్ హ్యాండ్ అమ్మకందారులు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించిన సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి.

అమెరికన్ కార్ డీలర్‌కు భారీ జరిమానా, 5 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే?

భారతదేశంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. కానీ వీటిని నివారించడానికి భారతదేశంలో కఠినమైన చట్టాలు లేవని ఆటో నిపుణులు అంటున్నారు. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఓడో మీటర్‌కు సంబంధించిన కుంభకోణాలకు దారితీసింది.

అమెరికన్ కార్ డీలర్‌కు భారీ జరిమానా, 5 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే?

అదనంగా, ప్రమాదాలను దాచడం మరియు వాహన డేటాను నాశనం చేయడం వంటి అనేక రకాల మోసాలు పెరుగుతున్నాయి. వీటి గురించి తెలియని వారు సెకండ్ హ్యాండ్ కార్లు కొంటున్నారు. సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసుటప్పుడు కస్టమర్ తప్పకుండా వీటన్నింటిని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి.

అమెరికన్ కార్ డీలర్‌కు భారీ జరిమానా, 5 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే?

భారతదేశంలో ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్లకు అధిక డిమాండ్ ఉంది. అంతే కాకుండా, ఈ రకమైన మోసాలకు సంబంధించిన కేసులు కొన్ని చోట్ల నివేదించబడ్డాయి. కావున దీనికి సంబంధించి ప్రభుత్వాలు దీనిపై కఠినమైన చర్యలు తీసుకుని వాటిని పూర్తిగా రూపుమాపడానికి కంకణం కట్టుకోవాలి. అప్పుడే ఈ తరహా మోసాలు జరగకుండా ఉంటాయి.

Most Read Articles

English summary
Motor Vehicle Dealers Sentenced In Odometer Tampering Scheme. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X