మానవరహిత సంయుక్త యుద్ద నౌకను రూపొందించిన అమెరికా

By Anil

యునైటెడ్ స్టేట్స్‌ ఆఫ్ అమెరికా, ఈ దేశం పేరు మీదు చాలా రికార్డులే ఉన్నాయి. అయితే తాజాగా ప్రపంచ వ్యాప్తంగా మొదటి సారిగా అమెరికా మానవరహిత యుద్దనౌకను రూపొందించింది. దీనిని కేవలం రిమోట్ ద్వారా నియంత్రిస్తూ కదలికలను సృష్టించవచ్చు.

తాజాగా అమెరికా సృష్టించుకున్న ఈ యుద్ద నౌక ద్వారా రష్యా మరియు చైనాలకు పోటిగా నిలిచింది. అమెరికా మానవరహిత యుద్ద నౌక గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

పేరు

పేరు

అమెరికా వారి మానవరహిత యుద్ద నౌక అయిన సముద్రపు హంటర్‌ను సరికొత్త డ్రోన్ స్క్వాడ్రన్ అని నామకరణం చేశారు.

రూపం

రూపం

ఈ నౌకను 132 అడుగులు పొడవు ఉండే విధంగా రూపొందించారు. ఇందులోని వెజల్ శక్తివంతమైన డీజల్ ఇంజన్‌ను కలిగి ఉంది

 జలాంతర్గాముల వేట కోసం

జలాంతర్గాముల వేట కోసం

మానవరహిత యుద్ద నౌకను జలాంతర్గాములను గుర్తించడానికి కోసం తయారు చేసారు. అంతే కాకుండా దీనిని సముద్రంలో వివిధ రకాల కార్య కాలాపాలకు వినియోగించుకోవచ్చు.

 బరువులను మోయగలిగే సామర్థ్యం

బరువులను మోయగలిగే సామర్థ్యం

మానవరహిత యుద్ద నౌక అయిన డ్రోన్ స్క్వాడ్రన్ భారీ స్థాయిలో బరువులను మోయగలదు. ఇందు కోసం దీనిని ప్రత్యేకించి డిజైన్ చేశారు.

 ప్రత్యేక ఫీచర్లు

ప్రత్యేక ఫీచర్లు

ఇందులో నూతన సాంకేతికలను వినియోగించారు, దీని చుట్టూ కెమెరాలను కల్పించారు తద్వారా దీనికి దగ్గరా వచ్చే పడవలను, అడ్డంకులను మరియు ఇతర నౌకలను కొంచెం దూరంలో ఉన్నపుడే గుర్తించి సమచారం ఇస్తుంది. వెంటనే దీనికి సంభందించి ప్రత్యామ్యాయ మార్గాలను అన్వేషిస్తుంది.

 రిమోట్ కంట్రోల్

రిమోట్ కంట్రోల్

ఇప్పటికే చాలా వరకు రిమోట్ కంట్రోల్ యుద్ద వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే అమెరికా వారి మొదటి మానవరహిత యుద్ద నౌకలో రిమోట్ ద్వారా నియంత్రించగలగే వ్యవస్థను కల్పించారు.

 ట్రక్ డిజైన్

ట్రక్ డిజైన్

డ్రోన్ స్క్వాడ్రన్ మానవరహిత యుద్ద నౌకకు చెందిన బాడీని డిఎఆర్‌పిఎ అనే సంస్థ తయారు చేసింది.

 ప్రయోగాలు

ప్రయోగాలు

వచ్చే ఐదేళ్లలోపు అమెరికా దీనికి చెందిన పరీక్షలను పర్షియన్ గల్ఫ్ మరియు పశ్చిమ పసిఫిక్ సముద్రాలలో నిర్వహించనున్నారు. తరువాత దీనిని అమెరికా నావికా దళానికి అందివ్వనున్నారు.

 చైనా నుండి పోటి

చైనా నుండి పోటి

అమెరికా మానవరహిత యుద్ద నౌకను అభివృద్ది చేసుకుంటున్న తరుణంలో చైనా తమకు దక్షిణ ప్రాంతంలో గల సముద్రంలో మానవరహిత యుద్ద నౌకకు పరీక్షలు జరుపుతోంది.

 బెటాలియన్

బెటాలియన్

జపాన్‌కు దగ్గరలో అమెరికాకు చెందిన ఏడవ ఫ్లీటులో ఈ మానవరహిత డ్రోన్ స్క్వాడ్రన్ యుద్ద నౌకను చేర్చింది.

 కొత్త విప్లవం

కొత్త విప్లవం

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అమెరికా మిలిటరీ బలం పరంగా మొదటి స్థానంలో ఉంది. అయితే అమెరికా సమకూర్చుకుంటున్న ఈ సరికొత్త మానవరహిత యుద్ద నౌకల ద్వారా అమెరికా సైన్యానికి మరింత బలం చేకూరుతోంది.

మరిన్ని కథనాల కోసం

జలాంతర్గామిని కోల్పోయిన నార్త్ కొరియా: అమెరికాపై ఆరోపణలు

మానవరహిత బోట్ : ప్రారంభించిన ఇజ్రాయెల్

మరిన్ని కథనాల కోసం.....

శక్తివంతమైన సైనికబలాన్ని కలిగిన దేశాలు: ఇందులో భారత్ ఉందా...

ISIS తీవ్రవాదుల సమూల నాశనానికి ఫ్రాన్స్ పథకం

Article Published On: Wednesday, April 13, 2016, 11:30 [IST]
English summary
Us Navy New Autonomous Warship Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+