అమెరికా అధ్యక్షుడి ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం.. ఎంతో శక్తివంతం.. కదిలే శ్వేతసౌధం..!

G20 దేశాలకు ప్రస్తుతం భారత్‌ నాయకత్వం వహిస్తోంది. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్‌ 9,10 రెండు రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, సహా ప్రపంచ దేశాల నేతలు హాజరుకానున్నారు. ఇందుకోసం ఢిల్లీవ్యాప్తంగా వేలాది మంది భద్రతా బలగాలను మోహరించారు.

ఈ సదస్సులో పాల్గొనేందుకు సెప్టెంబర్‌ 8న జో బైడెన్‌ భారత్‌కు చేరుకుంటారు. ఫ్లయింగ్‌ ఫ్రోర్ట్రెస్‌గా పిలిచే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ప్రయాణం చేయనున్నారు. బోయింగ్‌ 747- 200B రకానికి చెందిన 28000, 29000 టెయిల్‌కోడ్‌ విమానాల్లో భారత్‌కు చేరుకుంటారు.

US President AirForce One interesting facts

బైడెన్‌ ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ ఎంతో ప్రత్యేకం. 63 అడుగుల ఎత్తును కలిగి ఉంటుంది. అంటే ఆరు అంతస్తుల భవనం అంత ఎత్తు ఉంటుంది. ఈ విమానం 232 అడుగుల పొడవు, 195 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ విమానంలో మూడు స్థాయిల్లో 4000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. ఇందులో 70 మంది ప్రయాణికులకు వసతి కల్పించవచ్చు.

అమెరికా అధ్యక్షుడి ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో గంట ప్రయాణం చేయాలంటే భారత కరెన్సీలో 1.7 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఈ విమానంలో ప్రెసిడెంట్‌ సూట్‌లో పెద్ద కార్యాలయం, కాన్ఫరెన్స్‌ రూం ఉంటాయి. ఇవి అత్యంత భద్రత, విలాసవంతమైన సౌకర్యాలను కలిగి ఉంటాయి. సీనియర్‌ సలహాదారులు, సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులకు, జర్నలిస్టులు ఇతర అధికారులకు ప్రత్యేక స్లీపింగ్ క్వార్టర్లు ఉంటాయి.

US President AirForce One interesting facts

దీంతోపాటు ఈ విమానంలో మెడికల్‌ సూట్‌ ఉంటుంది. ఆపరేషన్‌ రూం సహా నిత్యం ఒక డాక్టర్‌ అందుబాటులో ఉంటారు. ఒకేసారి 100 మందికి భోజనం అందించే ఏర్పాట్లు ఇందులో ఉంటాయి. అమెరికా అధ్యక్షుడి ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ 965 కి.మీ వేగంతో ప్రయాణం చేయగలదు. గాలిలో ఉండగానే ఇంధనం నింపుకొనే సౌకర్యం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ సొంతం.

ఈ విమానం అణు దాడి వల్ల కలిగే విద్యుతయస్కాంత పేలుళ్లను తట్టుకోలదు. దీంతోపాటు శత్రు క్షిపణులను మళ్లించే ఎలక్ట్రానిక్‌ జామర్‌లు, శత్రు రాడార్‌లను జామ్‌ చేయగల రక్షణ వ్యవస్థలను కలిగి ఉంది. ఈ ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ ఎయిర్‌ టూ ఎయిర్‌, ఎయిర్‌ టూ గ్రౌండ్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థలను కలిగి ఉంటుంది.

US President AirForce One interesting facts

* అలాగే అమెరికా అధ్యక్షుడు ప్రయాణం చేసే కారు కూడా అత్యంత శక్తివంతమైంది. ఈ కారును బీస్ట్‌ అని పిలుస్తారు. ఈ కారు ఇప్పటికే భారత్‌కు వచ్చేసింది. భారీ పేలుడు సహా బుల్లెట్‌లను తట్టుకొనే సామర్థ్యం ఈ కారు సొంతం. ఈ కారు అద్దాలు ఐదు అంగుళాల మందం, డోర్లు 8 అంగుళాల మందంతో ఉంటాయి. గాజు, పాలీ కార్పొనేట్‌తో ఐదు లేయర్లతో అద్దాలను తయారు చేశారు.

ఈ కారు డ్రైవర్ విండో మాత్రమే 3 అంగుళాల మేర తెరుచుకుంటుంది. మిగిలిన అద్దాలు తెరుచుకోవు. ఈ కారు టైర్లు పంక్చర్‌ కావు. ఒకవేళ డ్యామేజ్‌ అయినా స్టీల్‌ రిమ్‌తో ప్రయాణం చేయగలదు. ఈ కారు ఇంధన ట్యాంక్‌ అత్యంత అధునాతనంగా ఉంటుంది. ఏం జరిగినా ట్యాంక్‌ పేలదు. కారులో అధ్యక్షుడు సీట్‌ వద్ద శాటిలైట్‌ ఫోన్‌ ఉంటుంది. నేరుగా అమెరికా అధ్యక్షుడు, పెంటగాన్‌కు ఫోన్‌ చేసి మాట్లాడవచ్చు.

US President AirForce One interesting facts

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Thursday, September 7, 2023, 18:44 [IST]
English summary
Us president airforce one interesting facts ahead of joe biden india tour
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+