అమెరికా అధ్యక్షుడి బస్సులో ఏముందో ఓ లుక్కేద్దాం రండి!
అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టే వ్యక్తికి ఆ దేశ ప్రభుత్వం అనేక రకాల వాహనాలను ఆఫర్ చేస్తుంది. కారు, బస్సు, విమానం, హెలికాఫ్టర్ ఇలా అధ్యక్షుడు ఏ వాహనంలో ప్రయాణించాలనుకుంటే ఆ వాహనాన్ని అందిస్తుంది. ఈ వాహనాలన్నింటిన కూడా ఆ దేశ సర్కారు తమ అధ్యక్షుడి కోసం ప్రత్యేకంగా తయారు చేయిస్తుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో, అత్యంత సురక్షితంగా తీర్చిదిద్దితారు. మనం ఇది వరకటి కథనంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వినియోగిస్తున్న అధ్యక్ష వాహనం 'క్యాడిలాక్' కారు గురించి తెలుసుకున్నాం. ఈ కథనంలో బరాక్ ఒబామా ఉపయోగించే బస్సు గురించి తెలుసుకుందా రండి..!
ప్రస్తుతం బరాక్ ఒబామా ఉపయోగిస్తున్న పొడవాటి అధ్యక్ష వాహనం (క్యాడిలాక్) మాదిరగానే ఈ బస్సును కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత సురక్షితంగా ఉండేలా డిజైన్ చేశారు. ఈ బస్సులో ఓ మీటింగ్ రూమ్, మాస్టర్ బెడ్ రూమ్, మాస్టర్ బాత్ రూమ్, సీక్రెట్ సర్వీస్ ఏరియా, గెస్ట్ బాత్ రూమ్, బ్లడ్ బ్యాంక్, ఆహారాన్ని అందించేందుకు చిన్న పాటి ప్యాంట్రీ, మీడియా రూమ్, శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ వంటి అనేక వసతులు ఉన్నాయి. ది బీస్ట్ (ఒబామా వాడే కారు ముద్దు పేరు) మాదిరిగానే ఈ బస్సు కూడా బాంబ్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్, కెమికల్ అటాక్ ప్రూఫ్, పంక్చర్ ప్రూఫ్ టైర్లతో అధ్యక్షుడిని అత్యంత భధ్రంగా కాపాడుతుంది.
అమెరికా అధ్యక్షుడి బస్సును కెనడాకు చెందిన మోటార్ కోచ్ బిల్డర్ ప్రెవోస్ట్ కంపెనీ రూపొందించగా, ఇందులోని ఇంటీరియర్లను నాష్‌విల్లేకు చెందిన హెమ్‌ఫిల్ బ్రదర్స్ కో డిజైన్ చేసింది. మరి ఈ బస్సు ధర ఎంతో తెలుసా కేవలం 1.1 మిలియన్ (11 లక్షలు) అమెరికన్ డాలర్లు మాత్రమే. అంటే మన దేశ కరెన్సీలో సుమారు ఐదు కోట్ల రూపాయాలకు పైమాటే. ఒబామా 2011లో ఎన్నికల ప్రచారం కోసం ఈ బస్సును విస్తృతంగా వినియోగించాడు. అధ్యక్షుడు భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రజల వద్దకు వెళ్లాలనుకుంటే ఈ బస్సును ఉపయోగించుకోవచ్చు.
ఈ బస్సులో 500 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేసే ఇంజన్‌ను ఉపయోగించారు. ఇలాంటిదే మరొక బస్సు అమెరికా సీక్రెట్ సర్వీస్ వద్ద ఉన్నట్లు సమాచారం. దీనిని 2012లో రిపబ్లికన్ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే వారికి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఒబామా ఈ బస్సులో వెళ్తున్నప్పుడు అతని కాన్వాయ్‌లో దాదాపు రెండు డజన్లకు పైగా వాహానాలు ఈ బస్సుకు ముందు మరియు వెనుక ఫాలో అవుతుంటాయి. ఇదే కాకుండా, అమెరికా అధ్యక్షుడి కోసం ఓ ప్రత్యేక బోయింగ్ 747 విమానం (దీని పేరు ఎయిర్ ఫోర్స్ 1), ఓ ప్రత్యేక హెలికాఫ్టర్ (మెరైన్ 1)లను కూడా ఆ దేశ ప్రభుత్వం అధికారిక వాహనాలుగా అందిస్తుంది. మరి ఈ ఒబామా బస్సులో ఏముందో ఓసారి తొంగి చూద్దాం రండి..!

అమెరికా అధ్యక్షుడి అధికారిక లగ్జరీ బస్
ప్రస్తుతం బరాక్ ఒబామా ఉపయోగిస్తున్న పొడవాటి అధ్యక్ష వాహనం (క్యాడిలాక్) మాదిరగానే ఈ బస్సును కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత సురక్షితంగా ఉండేలా డిజైన్ చేశారు.

అమెరికా అధ్యక్షుడి అధికారిక లగ్జరీ బస్
ఈ బస్సులో ఓ మీటింగ్ రూమ్, మాస్టర్ బెడ్ రూమ్, మాస్టర్ బాత్ రూమ్, సీక్రెట్ సర్వీస్ ఏరియా, గెస్ట్ బాత్ రూమ్, బ్లడ్ బ్యాంక్, ఆహారాన్ని అందించేందుకు చిన్న పాటి ప్యాంట్రీ, మీడియా రూమ్, శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ వంటి అనేక వసతులు ఉన్నాయి.

అమెరికా అధ్యక్షుడి అధికారిక లగ్జరీ బస్
ది బీస్ట్ (ఒబామా వాడే కారు ముద్దు పేరు) మాదిరిగానే ఈ బస్సు కూడా బాంబ్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్, కెమికల్ అటాక్ ప్రూఫ్, పంక్చర్ ప్రూఫ్ టైర్లతో అధ్యక్షుడిని అత్యంత భధ్రంగా కాపాడుతుంది.

అమెరికా అధ్యక్షుడి అధికారిక లగ్జరీ బస్
అమెరికా అధ్యక్షుడి బస్సును కెనడాకు చెందిన మోటార్ కోచ్ బిల్డర్ ప్రెవోస్ట్ కంపెనీ రూపొందించగా, ఇందులోని ఇంటీరియర్లను నాష్‌విల్లేకు చెందిన హెమ్‌ఫిల్ బ్రదర్స్ కో డిజైన్ చేసింది.

అమెరికా అధ్యక్షుడి అధికారిక లగ్జరీ బస్
మరి ఈ బస్సు ధర ఎంతో తెలుసా కేవలం 1.1 మిలియన్ (11 లక్షలు) అమెరికన్ డాలర్లు మాత్రమే. అంటే మన దేశ కరెన్సీలో సుమారు ఐదు కోట్ల రూపాయాలకు పైమాటే.

అమెరికా అధ్యక్షుడి అధికారిక లగ్జరీ బస్
ఒబామా 2011లో ఎన్నికల ప్రచారం కోసం ఈ బస్సును విస్తృతంగా వినియోగించాడు.

అమెరికా అధ్యక్షుడి అధికారిక లగ్జరీ బస్
ఈ బస్సులో 500 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేసే ఇంజన్‌ను ఉపయోగించారు. ఇలాంటిదే మరొక బస్సు అమెరికా సీక్రెట్ సర్వీస్ వద్ద ఉన్నట్లు సమాచారం.

అమెరికా అధ్యక్షుడి అధికారిక లగ్జరీ బస్
ఒబామా ఈ బస్సులో వెళ్తున్నప్పుడు అతని కాన్వాయ్‌లో దాదాపు రెండు డజన్లకు పైగా వాహానాలు ఈ బస్సుకు ముందు మరియు వెనుక ఫాలో అవుతుంటాయి.

అమెరికా అధ్యక్షుడి అధికారిక లగ్జరీ బస్
ఇదే కాకుండా, అమెరికా అధ్యక్షుడి కోసం ఓ ప్రత్యేక బోయింగ్ 747 విమానం (దీని పేరు ఎయిర్ ఫోర్స్ 1), ఓ ప్రత్యేక హెలికాఫ్టర్ (మెరైన్ 1)లను కూడా ఆ దేశ ప్రభుత్వం అధికారిక వాహనాలుగా అందిస్తుంది.

అమెరికా అధ్యక్షుడి అధికారిక లగ్జరీ బస్

అమెరికా అధ్యక్షుడి అధికారిక లగ్జరీ బస్

అమెరికా అధ్యక్షుడి అధికారిక లగ్జరీ బస్

అమెరికా అధ్యక్షుడి అధికారిక లగ్జరీ బస్

అమెరికా అధ్యక్షుడి అధికారిక లగ్జరీ బస్

అమెరికా అధ్యక్షుడి అధికారిక లగ్జరీ బస్



Click it and Unblock the Notifications








