కారును కొనడానికి ప్రజల సొమ్ము వాడుకోండి: అఖిలేష్ యాదవ్

వారి నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు ఈ కారును ఉపయోగించాలని ఆయన సలహా ఇచ్చారు. అయితే, ఎమ్ఎల్యేలు కొనుగోలు చేసే కారు ఖరీదు రూ.20 లక్షలకు మించరాదని కండిషన్ పెట్టారు.
రాష్ట్ర అసెంబ్లీలో అఖిలేష్ యాదవ్ ఈ ప్రకటన చేశారు. కానీ, అనేక మంది ఎమ్ఎల్యేలు మాత్రం కారును కొనుగోలు చేసేందుకు ఈ ఆప్షన్ అవసరం లేదని తేల్చి చెప్పేశారు (బహుశా వారికి ఇంకొక ఆప్షన్ ఏదైనా కావాలేమో లేక ఇప్పటికే వారి వద్ద బోలెడు కార్లు ఉన్నాయేమో).
ఎమ్ఎల్యేలు ఇలా కొనుగోలు చేసిన కారును 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి అప్పగించేయాలి లేదా అప్పటి మార్కెట్ వ్యాల్యూ ప్రకారం కారుకు తగ్గ ధరను ప్రభుత్వానికి చెల్లించి ఎమ్‌ఎల్యేలు కారును సొంతం చేసుకోవాలని యాదవ్ మరొక నిబంధన కూడా పెట్టారు (అందుకే కాబోలు ఎమ్ఎల్యేలు ఈ ఆప్షన్ మాకొద్దు బాబోయ్ అన్నట్టున్నారు).
అయితే, యాదవ్ పార్టీలోని కొందరు మంత్రులు మాత్రం ఈ ప్రతిపాదను తిరస్కరించారు. సమాజ్వాదీ పార్టీ ఎమ్ఎల్యే కె. రవి దాస్ మెహ్రోత్రా మాట్లాడుతూ.. ఇది ప్రజల సొమ్మని, దానిని ఉపయోగించి తాను కారును కొనుగోలు చేయనని, కారు కొనుగోలుకు ఉపయోగించే సొమ్మును కూడా తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకే ఉపయోగిస్తాని శెలవిచ్చారు.
ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఎమ్ఎల్యేకు వారి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు గానూ రూ.1.25 కోట్ల 'డెవలప్‌మెంట్ ఫండ్'ను రాష్ట్ర సర్కారు మంజూరు చేస్తుంది. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత సదరు డెవలప్‌మెంట్ ఫండ్‌ను మరో రూ.25 లక్షలు పెంచడం జరిగింది. అంటే ఇకపై ఆ రాష్ట్రంలోని ఎమ్ఎల్యేలు ప్రతి ఏటా రూ.1.5 కోట్ల డెవలప్‌మెంట్ ఫండ్‌ను పొందుతారన్నమాట. మరి ఇందులో ప్రజలకు చేరే సొమ్మ ఎంతో ఆ భగవంతుడికే తెలియాలి.


Click it and Unblock the Notifications








