Right To Repair మారిన రూల్స్.. బైక్/కారుని సొంతంగా రిపేర్ చేసుకున్నా వారంటీ లభిస్తుంది.. ఎలానో తెలుసా..?

ఏవైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఆయా కంపెనీలు వాటిపై వారంటీని అందిస్తాయి. ఆ వస్తువుపై కంపెనీ తరఫున నిర్ణీత గడువు కంపెనీలు నిర్ణయిస్తాయి. సంస్థ పేర్కొన్న నిర్ణీత గడువులో ఆ వస్తువుకి ఏదైనా జరిగితే దానిని కంపెనీనే భరిస్తుంది. దాని స్థానంలో కొత్త వస్తువును అందిస్తుంది. లేదా పూర్తి స్థాయిలో రిపేర్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. అయితే వీటిలో కొన్ని చిక్కులు ఉంటాయి. దానివల్ల వారంటీ ఉన్నకానీ కస్టమర్లు క్లెయిమ్ చేసుకోలేరు.

కంపెనీలు అందించే వారంటీని పొందేందుకు వినియోగదారులు అవి సూచించిన సర్వీస్ సెంటర్లు, ఆథరైజ్డ్ డీలర్లు వద్ద మాత్రమే రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా చేస్తేనే మీ వస్తువు లేదా వాహనం వారంటీ సంస్థ పరిధిలోకి వస్తుంది. లేకుంటే కంపెనీలు వారంటీని అందించవు. ఇప్పటివరకు ఇవే నియమాలు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా కొన్ని కొత్త నియమాలను అందుబాటులోకి వచ్చాయి. ఆ వివరాలు మీకోసం..

Right to Repair

చాలామంది సర్వీస్ సెంటర్లలో తమ బైక్ లేదా కార్లను రిపేర్ కు ఇస్తారు. దీనికోసం లేబర్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వేరే దగ్గర (బయట) సర్వీసింగ్ చేయిస్తే అది వారంటీ పరిధిలోకి రాదు. ఇలాంటి కఠిన నియమాలతో వినియోగదారులపై సంస్థలు భారాన్ని మోపుతున్నాయి. చివరకి చేసేదేమీలేక వినియోగదారులు వారంటీని పొందలేరు. తాజాగా వినియోగదారుల వ్యవహారాల విభాగం 'రైట్ టు రిపేర్' అనే పోర్టల్‌ను ప్రారంభించింది.

ఈ పోర్టల్ ప్రకారం మీరు థర్డ్-పార్టీ వర్క్‌షాప్‌లో లేదా సొంతంగా మరమ్మతులు చేసినప్పటికీ మీ వాహనం వారంటీని పొందే అవకాశం ఉంది. ఈ పోర్టల్ లో హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్స్, ఇతర స్కూటర్ల ద్విచక్ర వాహన తయారీదారులు ఆన్ బోర్డ్ అయ్యాయి. దీని ప్రకారం బైక్ లేదా కారు మరమ్మత్తును నిర్వహణ హక్కు యాజమానికి దక్కనుంది. ఇది బైక్ కొన్న రోజు నుంచే అందుబాటులోకి వస్తుంది. అయితే సదరు రిపేర్ కు సంబంధించిన వివరాలను లేదా మ్యానువల్ ను థర్డ్ పార్టీ వర్క్ షాప్ లతో పంచుకోవాలి.

Right to Repair portal

తమకు నచ్చిన చోట వినియోగదారులు రిపేర్ చేయించుకునే అవకాశం ఉందని ఈ పోర్టల్ తెలుపుతుంది. ఆయా ఉత్పత్తి కంపెనీల కారణంగా మరమ్మత్తు చేయించుకునే హక్కును కస్టమర్లు కోల్పోతున్నారని పోర్టల్ పేర్కొంది. దీంతో ఈ అవకాశాన్ని తీసుకువచ్చినట్లు చెప్పింది. ప్రస్తుతం, వినియోగదారుల వ్యవహారాల శాఖ వీలైనంత ఎక్కువ మంది తయారీదారులను ఆన్‌బోర్డింగ్ చేయడానికి కృషి చేస్తోంది.

మరమ్మత్తు హక్కు అనేది కచ్చితంగా ఉండాలి. దీనివల్ల వినియోగదారుడికి సర్వ హక్కులు పొందనున్నారు . ఈ, రిపేర్ హక్కు ఎలక్ట్రానిక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటోమొబైల్స్ పరికరాలు మరియు వ్యవసాయ పరికరాలు వంటి నాలుగు ప్రధాన రంగాలను కవర్ చేయనుంది. సాధారణ ప్రజల సౌకర్యార్థం ఎన్నో పోర్టల్ లు, న్యాయ పరమైన హక్కులు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగదారులు సరిగ్గా ఉపయోగించుకోవాలి.

Right to Repair

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, April 29, 2023, 16:49 [IST]
English summary
Using right to repair you can repair you bike or car at third party centers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+