బార్సెలోనా విమానాశ్రయం: తృటిలో తప్పిన పెను ప్రమాదం
విమాన ప్రమాదం వలన కలిగే నష్టం ఏంత భారీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈనెల 5వ తేదీన స్పెయిన్‌లోని బార్సెలోనా విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఎయిర్‌పోర్ట్ రన్‌వై ఓ విమానం ల్యాండ్ అవుతుండగా అదే సమయంలో మరో విమానం రన్‌వే పైకి దూసుకువచ్చింది. ఈ దృశ్యం కెమెరాకు చిక్కింది.
అయితే, రన్‌వే పైకి మరో విమానం రావటాన్ని గుర్తించిన పైలట్, ల్యాండింగ్ చేయాల్సిన విమానాన్ని హఠాత్తుగా తిరిగి టేకాఫ్ చేశాడు. పైలట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. యూటిఎయిర్ బోయింగ్ 767-300 విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు రన్‌వే పైకి అకోలైనియాస్ అర్జెంటీనాస్ ఎయిర్‌బస్ ఏ340-300 విమానం రన్‌వేను దాటుతోంది.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

యూటిఎయిర్ బోయింగ్ 767-300 విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు రన్‌వే పైకి అకోలైనియాస్ అర్జెంటీనాస్ ఎయిర్‌బస్ ఏ340-300 విమానం రన్‌వేపైకి ఎందుకు వచ్చిందనే విషయంలో స్పష్టత లేదు.

యూటిఎయిర్ బోయింగ్ 767-300 విమానాన్ని నడుపుతున్న పైలట్ అప్రమత్తంగా లేకపోయి ఉంటే, రెండు భారీ ప్యాసింజర్ విమానాలు కాబట్టి ప్రమాద తీవ్రత అంచనాలకు మించి ఉండేది. అదృష్టవశాత్తు ఎవ్వరికీ ఏమి కాలేదు.

యూటిఎయిర్ బోయింగ్ 767-300 విమానం రన్‌వే ల్యాండ్ అయ్యేందుకు దాదాపు చేరువలో ఉండగా, అదే సమయంలో రన్‌వే పైకి కోలైనియాస్ అర్జెంటీనాస్ ఎయిర్‌బస్ ఏ340-300 రావటాన్ని గుర్తించిన పైలట్ ల్యాండింగ్ ప్రక్రియను నిలిపివేసి, తిరిగి తక్షణమే టేకాఫ్ చేసి రెండవ రన్‌పై విమానాన్ని ల్యాండ్ చేశారు.

ల్యాండిగ్ కావల్సిన యూటిఎయిర్ బోయింగ్ 767-300 విమానం తిరిగి టేకాఫ్ కావటంతో ప్రయాణీకులంతా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే, కాసేపటికే విమానం రెండవ రన్‌వే ల్యాండ్ అవ్వటంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
వీడియో
ఈ రెండు విమానాలకు సంబంధించి కెమరాకు చిక్కిన వీడియోని ఈ స్లైడ్‌లో చూడండి.


Click it and Unblock the Notifications








