విధుల్లో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన తల్లి మరణ వార్త విన్నాడు.. తరువాత ఏం జరిగిందంటే?

భారతదేశంలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్ మొదలైనవి ఉన్నాయి. కరోనా కేసులు ఎక్కువగా నేపథ్యంలో హాస్పిటల్స్ లో బెడ్ల కొరత, ఆక్సిజన్ సిలిండర్ల కొరత మరియు అంబులెన్సులు కొరత ఎక్కువగా ఉంది.

విధుల్లో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన తల్లి మరణ వార్త విన్నాడు.. కానీ..

దేశంలో అంబులెన్సులు కొరత ఎక్కువగా ఉండటం వల్ల, అంబులెన్స్ డ్రైవర్లకు విశ్రాంతి లేకుండా పోయింది. ఇటీవల కాలంలో ఒక అంబులెన్స్ డ్రైవర్ యొక్క తల్లి మరణించిన సంఘటన తెలిసి కూడా కరోనా బాధితులను సకాలంలో హాస్పిటల్ కి చేర్చి అంత్యక్రియలకు వెళ్ళాడు.

విధుల్లో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన తల్లి మరణ వార్త విన్నాడు.. కానీ..

నివేదికల ప్రకారం ఈ సంఘటన 2021 మే 15 న ఉత్తరప్రదేశ్‌లోని మధురలో జరిగింది. ప్రభాత్ యాదవ్ మే 15 రోజున హాఫ్ షిఫ్ట్ పూర్తయిన తరువాత తన తల్లి చనిపోయిందనే వార్త తెలిసింది. కానీ కరోనా బాధితులు ఎక్కువగా ఉన్న సమయంలో ఇక తప్పని పరిస్థితిలో అతడు ఫుల్ షిఫ్ట్ పూర్తి చేసుకుని అతని తల్లి అంత్యక్రియలకు వెళ్ళాడు.

MOST READ:బంపర్ ఆఫర్ ప్రకటించిన కియా మోటార్స్; కారు నచ్చకపోతే 30 రోజుల్లో రిటర్న్ చేయవచ్చు

విధుల్లో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన తల్లి మరణ వార్త విన్నాడు.. కానీ..

ప్రభాత్ యాదవ్ తల్లి అంత్యక్రియలు మధుర నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెయిన్‌పురిలో జరిగాయి. ప్రభాత్ యాదవ్ తన తల్లి అంత్యక్రియలు పూర్తయిన వెంటనే విధుల్లోకి వచ్చాడు. అంటే కేవలం 24 గంటల్లో తిరిగి విధుల్లోకి వచ్చాడు.

విధుల్లో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన తల్లి మరణ వార్త విన్నాడు.. కానీ..

ఈ హృదయ విషాద సంఘటనను గురించి ప్రభాత్ యాదవ్ మాట్లాడుతూ, తన తల్లి మరణ వార్త విన్నప్పుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని, కానీ కరోనా బాధితులు ఎక్కువగా ఉండటం వల్ల తన మనసుని రాయి చేసుకుని తన పనిని కొనసాగించాడు.

MOST READ:ప్రజల కోసం తన కారును అంబులెన్సుగా మార్చిన కాంగ్రెస్ నాయకుడు, ఎవరో తెలుసా?

విధుల్లో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన తల్లి మరణ వార్త విన్నాడు.. కానీ..

ప్రస్తుతం కరోనా మహమ్మారి కమ్ముకుంటున్న సమయంలో తానూ చేస్తున్న పనిని సగంలో వదిలివేయడం సరికాదని అందుకే తన పనిని కొనసాగించానని కూడా తెలిపాడు. రోజు రోజుకి ఎంత మంది మరణిస్తున్నారు. ఇటువంటి సమయంలో కరోనా సోకిన ప్రతి వ్యక్తి జీవితం ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు.

విధుల్లో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన తల్లి మరణ వార్త విన్నాడు.. కానీ..

ప్రభాత్ యాదవ్ గత 9 సంవత్సరాలుగా అంబులెన్స్ డ్రైవ్ చేస్తున్నాడు. అతని వయసు ప్రస్తుతం 33 సంవత్సరాలు. కరోనా సంక్రమణను నివారణ కోసం ఇతన్ని 2020 లో నియమించారు. అప్పటి నుండి గత నవంబర్ వరకు ఈ వీధుల్లోనే ఉన్నాడు. అయితే కరోనా క్షీణించడం ప్రారంభించిన తరువాత తిరిగి అంబులెన్స్ డ్రైవర్ గా విధుల్లోకి వచ్చాడు.

MOST READ:పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

విధుల్లో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన తల్లి మరణ వార్త విన్నాడు.. కానీ..

మళ్ళీ ఇప్పుడు 2021 లో కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరిగిన తరువాత ఏప్రిల్ నుండి కోవిడ్ 19 మంది సోకిన వ్యక్తులను తీసుకెళ్లే పనిలో చేరాడు. తల్లి చనిపోవడంతో కొన్ని రోజులు ఇంట్లో ఉండమని అధికారులు ప్రభాత్ యాదవ్‌కు చెప్పారు. కానీ ప్రభాత్ యాదవ్ తన పనిని కొనసాగించారు.

విధుల్లో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన తల్లి మరణ వార్త విన్నాడు.. కానీ..

ప్రభాత్ యాదవ్ తల్లి మరణించినప్పుడు, ఉత్తర ప్రదేశ్‌లో ప్రజా రవాణా అందుబాటులో లేదు. ఇటువంటి సమయంలో ప్రభాత్ యాదవ్ ఇంటికి తిరిగి వెళ్ళడానికి అధికారులు కావలసిన ఏర్పాట్లు చేశారు. ప్రభాత్ యాదవ్ తండ్రి కూడా గత ఏడాది జూలైలో కరోనావైరస్ సంక్రమణతో మరణించారు.

MOST READ:నదిలో చిక్కుకున్న మహీంద్రా థార్.. బయటకు లాగిన మిత్సుబిషి పజెరో[వీడియో]

విధుల్లో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన తల్లి మరణ వార్త విన్నాడు.. కానీ..

ఆ సమయంలో కూడా తన తండ్రి అంత్యక్రియలు ముగించుకుని అదే రోజు పనికి తిరిగి వచ్చాడు. దీనిపై ప్రభాత్ యాదవ్ మాట్లాడుతూ, "నా తల్లి కన్నుమూసింది. కొంతమంది ప్రాణాలను నేను రక్షించగలిగితే నా తల్లి ఆత్మ కూడా గర్వపడుతుందన్నాడు. ప్రస్తుతం ఇటువంటి కరోనా సంక్షోభ సమయంలో ప్రభాత్ యాదవ్ చేసిన పనికి నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.

Most Read Articles

English summary
Ambulance driver continues his work even after hearing his mother's death news. Read in Telugu.
Story first published: Thursday, May 27, 2021, 13:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X