కార్పెంటర్ అద్భుత సృష్టి.. రోడ్డుపై నడిచే టాటా నానో హెలికాఫ్టర్: ఎవ్వరైనా దీనికి ఫిదా అవ్వాల్సిందే
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. అనే మాట అక్షర సత్యం. ఈ మాటను అప్పుడప్పుడు నిజమే అని నిరూపించడానికి కొన్ని సంఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇటీవల ఒక కార్పెంటర్ 'నానో' కారుని ఏకంగా ఒక హెలికాఫ్టర్‌గా మార్చేశాడు. ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ఉత్తరప్రదేశ్ లోని ఆజంగఢ్ కు చెందిన కార్పెంటర్ 'సల్మాన్' నానో కారును హెలికాప్టర్ మాదిరిగా రూపొందించారు. అయితే ఈ విమానం గాలిలో ఎగరదు, కానీ రోడ్డుపై వెళ్తుంటే విమానంలో వెళ్లే అనుభూతిని ఇస్తుందని సల్మాన్ తెలిపారు. ఇది చూడటానికి నిజమైన హెలికాఫ్టర్ మాదిరిగానే ఉంటుంది. రోడ్డుపైకి వెళ్తే రోడ్డుపై ఉండే జనం మొత్తం దీనినే చూస్తూ ఉంటారు. ఈ హెలికాఫ్టర్ రూపొందించడానికి ఆతనికి నాలుగు నెలల సమయం పట్టింది.

సాధారణ టాటా నానో కారుని అద్భుతమైన హెలికాఫ్టర్ మాదిరిగా మార్చడానికి అతనికి రూ. 3 లక్షలు ఖర్చు అయినట్లు తెలిపాడు. ఈ కారు హెలికాఫ్టర్ గా రూపొందించిన తరువాత దీనిని చూడటానికి చుట్టుపక్కల నుంచి కూడా జనం పెద్ద ఎత్తున వస్తున్నారని, హెలికాప్టర్లలో ప్రయాణించలేని వారికి తప్పకుండా హెలికాఫ్టర్ లో ప్రయాణించిన అనుభూతిని అందిస్తుందని రూపకర్త సల్మాన్ చెప్పారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అందరికీ అందుబాటులో ఉండటానికి టాటా కంపెనీ అతితక్కువ ధరకు నానో కారును తయారు చేస్తే.. సల్మాన్ తక్కువ ధరకే హెలికాఫ్టర్ తయారు చేసాడు. పేరుకు కార్పెంటర్ అయినప్పటికీ సల్మాన్ అద్భుతమైన తెలివితేటలతో ఈ హెలికాఫ్టర్ సృష్టించాడు. భవిష్యత్తులో ఇలాంటి ఆవిష్కరణలు మరిన్ని చేయగలనని దానికి ప్రభుత్వం కానీ.. లేదా ఏదైనా కంపెనీలు కానీ తనకు సహాయం చేస్తే అది సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేసాడు.

టాటా నానో కారుకి చిన్న చిన్న డిజైన్ మార్పులను చేసి మొత్తానికీ హెలికాఫ్టర్ రూపానికి తీసుకొచ్చేసాడు. ఇది చూడటానికి హెలికాఫ్టర్ మాదిరిగా ఉండటమే కాదు దానిపైభాగంలో హెలికాఫ్టర్ వంటి రెక్కలను కూడా చూడవచ్చు. అయితే సాధారణ హెలికాఫ్టర్ కి దీనికి తేడా ఏమిటంటే అది గాలిలో ఎగురుతుంది, ఇది గాలిలో ఎగరదు. తక్కువ ధర వద్ద హెలికాఫ్టర్ లో ప్రయాణించిన అనుభూతిని పొందాలంటే ఈ హెలికాఫ్టర్ సరిగ్గా సరిపోతుంది.
హెలికాఫ్టర్ మాదిరిగా తయారైన నానో కారు రోడ్డు మీద వెళ్తుంటే హెలికాప్టర్ రోడ్డు మీద వెళ్తుందా అనిపిస్తుంది. ఇప్పటికే ఇలాంటి కారును తయారు చేసి ఇవ్వాలంటూ చాలామంది సల్మాన్ కు ఆర్డర్లు ఇస్తున్నట్లు సమాచారం. కార్పెంటర్ సల్మాన్ పెద్దగా చదువుకోలేదు. అయినప్పటికీ అతనిలో ఉన్న సృజనాత్మకతతో ఈ అద్భుతాన్ని రూపొందించాడు. నిజంగానే ఇది ప్రశంసించాల్సిన విషయం. ఇతడు తప్పకుండా చాలా మందికి ఆదర్శం కూడా.
నిజానికి ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాసులలో మనిషి చాలా తెలివైన జీవి. భూమి మీద ఉన్న ప్రతి మనిషి తప్పకుండా గొప్ప సృజనాత్మకతను కలిగి ఉంటాడు. దానిని బయటకు తీసి ఉపయోగిస్తే తప్పకుండా అద్భుతాలు పుట్టుకొస్తాయి. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. కరోనా లాక్డౌన్ సమయంలో చాలామంది తమ తెలివికి పని కల్పించారు. బుర్ర పెట్టి ఆలోచిస్తే అద్భుతమైన ఎన్నో ఆలోచనలు పుట్టుకొస్తాయి అనటానికి ఇది నిలువెత్తు నిదర్శనం.
ఒక కార్పెంటర్ ఇలాంటి అద్భుతం సృష్టించాడు అంటే చాలా మంది నమ్మకపోవచ్చు. కానీ ఏదైనా అద్భుతాలు సృష్టించాలంటే పెద్ద పెద్ద చదువులు అవసరం లేదని సల్మాన్ నిరూపించాడు. ఇది తప్పకుండా అందరూ నమ్మాల్సిందే. ఇలాంటి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు కొత్త బైకుల గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








