మీకు తెలుసా.. రోడ్డుపై ఇలా చేస్తే కూడా తప్పదు భారీ జరిమానా

భారతదేశంలో రోజు రోజుకి కొత్త చట్టాలు, కొత్త నియమాలు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో భాగంగానే పరిశుభ్రతను కాపాడటానికి ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. దీనికోసం ఉత్తర ప్రదేశ్ కేబినెట్ ఒక నియమాన్ని ఆమోదించింది. ఈ నిబంధన ప్రకారం వాహనాల్లో ప్రయాణించే వారు రోడ్డు మీద ఉమ్మివేస్తే భారీ జరిమానా విధించబడుతుంది.

మీకు తెలుసా.. రోడ్డుపై ఇలా చేస్తే కూడా తప్పదు భారీ జరిమానా

దేశవ్యాప్తంగా పరిశుభ్రతను కాపాడుకోవడానికి ఉత్తరప్రదేశ్ తొలి అడుగులు వేసింది. దీని ప్రకారం రహదారుల శుభ్రతను పెంపొందించడానికి ఈ నిబంధనను అమలు చేయడం వెనుక ప్రధాన లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కారు డ్రైవర్లు రోడ్డుపై ఉమ్మివేయడంతో రోడ్ క్లీనప్ మరింత దిగజారిపోతోందని ఒక నివేదిక పేర్కొంది.

మీకు తెలుసా.. రోడ్డుపై ఇలా చేస్తే కూడా తప్పదు భారీ జరిమానా

రోడ్డుపై వాహనదారులు ఉమ్మివేయడం వల్ల మరకలు ఏర్పడుతున్నాయి. వీటిని శుభ్రం చేసిన తరువాత కూడా ఉమ్మి మరకలు అలాగే ఉన్నాయి. ప్రభుత్వం అమలు చేసిన నిబంధనల ప్రకారం రహదారిపై ఉమ్మివేస్తే వారికి 1000 రూపాయల జరిమానా విధించబడుతుందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

MOST READ:కొత్త వెహికల్ స్క్రాపింగ్ పాలసీతో మీ పాత వాహనాలపై పన్నుల బాదుడు ఖాయం!

మీకు తెలుసా.. రోడ్డుపై ఇలా చేస్తే కూడా తప్పదు భారీ జరిమానా

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలను ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయడానికి ఉత్తర భారతదేశంలో కూడా కొన్ని నగరాలు ఆహ్వానించాయి. కాలుష్యాన్ని వీలైనంత వరకు రూపుమాపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుందని, అందుకే ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నామని ఆయన అన్నారు.

మీకు తెలుసా.. రోడ్డుపై ఇలా చేస్తే కూడా తప్పదు భారీ జరిమానా

ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం త్వరలో రాష్ట్రంలో వాహన పరిశోధన మరియు పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఏది ఏమైనా రాబోయే కాలంలో ఎలక్ట్రిక్ వాహన వేడకలు పెరగనున్నాయి. దీనితో కాలుష్య ఉద్గారాలు తగ్గుతాయి, తద్వారా వాతావరణ కాలుష్యం కూడా దెబ్బతినే అవకాశం ఉండదు.

MOST READ:తనకు తానుగా కదిలిన బైక్.. బహుశా ఇది దెయ్యం పనేనా.. అయితే వీడియో చూడండి

మీకు తెలుసా.. రోడ్డుపై ఇలా చేస్తే కూడా తప్పదు భారీ జరిమానా

ఇటీవల 2021 మరియు 2022 కేంద్ర బడ్జెట్ ప్రకటించిన నిర్మల సీతారామన్ ఇందులో వెహికల్ స్క్రాపింగ్ విధానం కూడా చేర్చింది. ఈ విధానం ప్రకారం, ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేసే వాహనాలు రోడ్డుపైకి అనుమతించబడవు.

మీకు తెలుసా.. రోడ్డుపై ఇలా చేస్తే కూడా తప్పదు భారీ జరిమానా

ఈ కొత్త స్క్రాపింగ్ విధానం ప్రకారం 20 సంవత్సరాల వయస్సు గల ప్రైవేట్ వాహనాలు మరియు 15 సంవత్సరాల వాణిజ్య వాహనాలు స్క్రాప్ చేయబడతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకారం, దేశంలో 10 మిలియన్లకు పైగా వాహనాలు స్క్రాప్ చేయబడ్డాయి.

MOST READ:కవాసకి బైక్‌లపై ఊహకందని ఆఫర్లు, దేనిపై ఎంతో ఇప్పుడే చూడండి

మీకు తెలుసా.. రోడ్డుపై ఇలా చేస్తే కూడా తప్పదు భారీ జరిమానా

పాత వాహనాలు కొత్త వాహనాల కంటే 12 నుంచి13 రెట్లు ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. అదనంగా, ఈ వాహనాలు ఎక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తాయని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ వాహనాలను స్క్రాప్ చేస్తే ఇంధన వినియోగం తగ్గుతుంది. అదనంగా, ఇంధన దిగుమతుల మొత్తాన్ని తగ్గించవచ్చు. ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసే పనిలో ఉంది.

Most Read Articles

English summary
Uttar Pradesh Government To impose Fine For Car Drivers For Spitting In Public Road. Read in Telugu.
Story first published: Thursday, February 4, 2021, 10:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X