అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న 26 ఏళ్ల యువతి.. నిజంగా గ్రేట్ కదా..!

కరోనా వైరస్ సెకండ్ వేవ్ భారతదేశంలో చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మరి మొదటి దశకంటే వేగంగా వ్యాప్తి చెందుతూ ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు బలికొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కొంత వరకు తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న 26 ఏళ్ల యువతి.. నిజంగా గ్రేట్ కదా..!

భారతదేశంలో వ్యాపిస్తున్న కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. రోజు రోజుకి కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఏర్పడింది. ఈ కారణంగా రోగులందరికి ఆక్సిజన్ అందించడం చాలా కష్టమవుతోంది.

అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న 26 ఏళ్ల యువతి.. నిజంగా గ్రేట్ కదా..!

ఈ క్లిష్ట సమయంలో భారత ప్రభుత్వం ఆక్సిజన్ తయారీకి ఆటోమొబైల్ కంపినీల సహాయం తీసుకుంటోంది. ప్రస్తుతం కరోనా మహమ్మరి వల్ల దాదాపు అన్ని కంపెనీలలో ఉత్పత్తి నిలిపివేయబడింది. అదే సమయంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తూ ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నాయి.

MOST READ:లాక్‌డౌన్ రూల్స్ గాలికొదిలేసిన ముఖ్యమంత్రి కొడుకు.. ఎవరో తెలుసా..?

అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న 26 ఏళ్ల యువతి.. నిజంగా గ్రేట్ కదా..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆక్సిజన్ మరియు హాస్పిటల్స్ బెడ్లు కొరతగా ఉండటం వల్ల చాలామంది యువకులు తమ వాహనాలను అంబులెన్సులుగా మార్చి కరోనా బాధితులకు సేవ చేస్తున్నారు. ఇందులో ఆటో రిక్షా డ్రైవర్లు కూడా తమ ఆటోలను కరోనా రోగులకు ఉపయోగిస్తున్నారు.

అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న 26 ఏళ్ల యువతి.. నిజంగా గ్రేట్ కదా..!

ఇలాంటి నేపథ్యంలో ఒక యువతి కరోనా బాధితుల ఇళ్ళ దగ్గరకే ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేసి పలువురి మన్ననలను పొందుతోంది. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పుడు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యింది.

MOST READ:అలెర్ట్: 2.36 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు వెనక్కి.. కారణం ఏమంటే?

అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న 26 ఏళ్ల యువతి.. నిజంగా గ్రేట్ కదా..!

నివేదికల ప్రకారం ఉత్తర ప్రదేశ్‌లోని షాజహన్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల అర్షి ప్రజలకు తమ ఇంటివద్దకు సిలిండర్లు అందిస్తుంది. ఈ కారణంగా ఆమెను 'డాటర్ ఆఫ్ సిలిండర్' అని మరియు 'సిలిండర్ బిటియా' అని పిలుస్తున్నారు.

అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న 26 ఏళ్ల యువతి.. నిజంగా గ్రేట్ కదా..!

అర్షి తండ్రికి కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ సోకింది. ఈ కారణంగా ఆమె తన తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. కరోనా రోగులు ఎక్కువగా ఉండటం వల్ల బెడ్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఇంట్లోనే ఉండాలని డాక్టర్లు సూచించారు. అయితే ఆ సమయంలో ఆమె తండ్రికి మెడికల్ ఆక్సిజన్ అవసరం, కానీ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆక్సిజన్ దొరకలేదు. అయితే చివరగా ఉత్తరాఖండ్‌లోని ఒక స్వచ్ఛంద సంస్థ అర్షి తండ్రికి ఆక్సిజన్ సిలిండర్‌ను అందించింది.

MOST READ:కరోనా రోగులకోసం తన టయోటా కారు విరాళంగా ఇచ్చేసిన ఎమ్మెల్యే

అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న 26 ఏళ్ల యువతి.. నిజంగా గ్రేట్ కదా..!

అర్షి తండ్రి ఆక్సిజన్ సిలిండర్ల వల్ల ఇంట్లోనే ఉంటూ త్వరగా కోలుకున్నారు. కానీ అర్షి తండ్రికి వచ్చిన దుస్థితి మరెవరికి రాకూడదని భావించి చుట్టుపక్కల ఉన్న ప్రజలకు సేవ చేయడానికి పూనుకుంది. కావున అర్షి అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్‌ను పంపిణీ చేస్తోంది. ఆమె ఈ సేవను పూర్తిగా ఉచితంగా చేయడం గమనార్హం.

అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న 26 ఏళ్ల యువతి.. నిజంగా గ్రేట్ కదా..!

అర్షి తన తండ్రి ప్రాణాలను కాపాడిన ఉత్తరాఖండ్ స్వచ్ఛంద సంస్థతో చేతులు కలిపింది, ఆమె ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆక్సిజన్ సిలిండర్లను తీసుకుని అవసరమైన వారికి ఎంతదూరంలో ఉన్నా సరఫరా చేస్తుంది. ఆమె ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయడానికి తన హోండా యాక్టివా స్కూటర్‌ను ఉపయోగిస్తుంది.

MOST READ:ఈ మినీ క్యాంపర్‌తో మీ క్యాంపింగ్‌ను మరింత సరదాగా మార్చుకోండి!

అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న 26 ఏళ్ల యువతి.. నిజంగా గ్రేట్ కదా..!

హోండా యాక్టివా స్కూటర్‌ మెరుగైన మైలేజీని ఇస్తుందని, ఎప్పుడూ ఎలాంటి సమస్యలు లేవని ఆమె చెప్పింది. ఈ స్కూటర్ యొక్క ముందుభాగంలో ఎక్కువ స్థలం ఉన్నందున స్కూటర్‌లో ఒకేసారి రెండు సిలిండర్లు తీసుకెళ్లవచ్చని కూడా ఆమె తెలిపింది. అర్షి ఇప్పటివరకు 45 సిలిండర్లను అవసరమైన వారికీ సరఫరా చేసింది.

Most Read Articles

English summary
Uttar Pradesh Lady Delivering Oxygen Cylinder On Honda Activa Scooter. Read in Telugu.
Story first published: Friday, May 21, 2021, 10:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X