ప్రియాంక గాంధీని స్కూటర్‌పై తీసుకెళ్లిన వ్యక్తికి జరిమానా విధించిన పోలీసులు... ఎందుకంటే?

భారతదేశంలో వాహనాలను నడపడానికి కొన్ని నియమ నిభందనలు ఉన్నాయి. కాబట్టి దేశంలో మోటార్ వాహన చట్టం అమలు చేసిన నిబంధనలను పాటించాలి. వాహన నియమాలను పాటించని వారు ఎంతవారైనా వారికి శిక్షలు తప్పవు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వంటి వాటిలో కొంతమంది సెలబ్రేటీలు, ముఖ్యమైన నాయకులు కూడా జరిమానాలు కట్టిన దృశ్యాలు ఎన్నో చూస్తున్నాం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక సంఘటనను చూద్దాం.

ప్రియాంక గాంధీని స్కూటర్‌పై తీసుకెళ్లిన వ్యక్తికి జరిమానా విధించిన పోలీసులు... ఎందుకంటే?

ప్రియాంక గాంధీ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఈ ఆదివారం రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఎస్ఆర్ దారాపురి కుటుంబాన్ని కలవడానికి లక్నోకు చేరుకున్నారు. వివిధ కారణాల వల్ల ఆమె కాన్వాయ్‌ను ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఆపారు. పోలీసులు కాన్వాయ్‌ను ఆపివేసిన తరువాత,కొంత దూరం ఆమె కాలినడకన నడిచి వెళ్లారు. తరువాత ఒక కాంగ్రెస్ కార్యకర్త ఆమెకు లిఫ్ట్ ఇచ్చిన పరిస్థితి వీడియో మరియు చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.

ప్రియాంక గాంధీని స్కూటర్‌పై తీసుకెళ్లిన వ్యక్తికి జరిమానా విధించిన పోలీసులు... ఎందుకంటే?

ప్రియాంక గాంధీపై మహిళా పోలీస్ కొంత కఠినంగా ప్రవర్తించినట్లు మనకు ఈ వీడియో ఆధారంగా తెలుస్తుంది. రిటైర్డ్ ఐపిఎస్ అధికారిని కలవడానికి వెళ్తున్న ఈమెపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని మీడియా ద్వారా తెలిపింది. అయితే తన కాన్వాయ్ ఆపేసిన తరువాత ఒక కార్యకర్త వాహనంలో ఆ ఐపిఎస్ అధికారిని పరామర్శించడానికి వెళ్లినట్లు మనకు సమాచారం.

ప్రియాంక గాంధీని స్కూటర్‌పై తీసుకెళ్లిన వ్యక్తికి జరిమానా విధించిన పోలీసులు... ఎందుకంటే?

ప్రియాంక గాంధీకి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఎందుకంటే రోడ్లపై స్కూటర్‌ను ప్రమాదకరంగా నడిపినందుకు జరిమానా విధించినట్లు యుపి పోలీసులు పూర్నేందు సింగ్ ధృవీకరించారు. ప్రభుత్వ రహదారులపై రైడర్ అనేక ఇతర నిబంధనలను ఉల్లంఘించాడని సీనియర్ ఈ అధికారి తెలిపారు. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘించడం, తప్పు నంబర్ ప్లేట్ ఉన్న వాహనాన్నినడపడం, ప్రమాదకరమైన డ్రైవింగ్ మరియు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం వంటి వాటివల్ల అతనికి చలాన్ అందజేశారు.

ప్రియాంక గాంధీని స్కూటర్‌పై తీసుకెళ్లిన వ్యక్తికి జరిమానా విధించిన పోలీసులు... ఎందుకంటే?

డ్రైవ్ చేసిన వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్త ధీరజ్ గుర్జర్గాగా గుర్తించారు. మరియు పోలీసులు అతనికి 15 రోజులలో జరిమానా చెల్లించడానికి మరియు ఆరోపణలను క్లియర్ చేయడానికి అనుమతించారు. అక్కడికక్కడే లైసెన్స్ మరియు ఇతర పత్రాలను తనిఖీ చేయడానికి రైడర్ అయిన ధీరజ్ ను పోలీసులు ఆపారా అనేది తెలియదు. ప్రియాంక గాంధీని కూడా ఐపిఎస్ అధికారి నివాసానికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు అని మనకు వీడియోలో తెలుస్తుంది.

ప్రియాంక గాంధీని స్కూటర్‌పై తీసుకెళ్లిన వ్యక్తికి జరిమానా విధించిన పోలీసులు... ఎందుకంటే?

కొన్ని నెలల క్రితం భారతదేశం అంతటా అమలు చేసిన కొత్త మోటారు వాహన చట్టానికి అనుగుణంగా స్కూటర్ రైడర్‌కు జరిమానాలు విధించారు. రహదారిపై చేసిన నేరాలను అరికట్టడానికి కొత్తగా సవరించిన మోటారు వాహన చట్టం సహాయపడుతుందని దీనివల్ల ప్రజలు ప్రమాదాల్లో చిక్కుకోకుండా చూడవచ్చని రహదారి రవాణా శాఖ మంత్రి తెలిపారు.

Read More:రాయల్ ఎన్ఫీల్డ్ లో విడుదలకానున్న మరో కొత్త బైక్! ఇప్పుడే చూడండి...?

రహదారి భద్రత విషయానికి వస్తే భారతదేశం ప్రపంచదేశాలలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలలో ఒకటిగా ఉంది. ప్రతిసంవత్సరం అధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల వాళ్ళ వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవన్నీ తగ్గించడానికి భారత ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కొత్త చట్టంవల్ల జరిమానాలు ఎక్కువగా విధించడం కూడా జరుగుతుంది. అందువల్లే ప్రియాంక గాంధీకి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి కొన్ని కారణాలవల్ల 6,100రూపాయలు జరిమానా విధించడం జరిగింది.

Most Read Articles

English summary
Priyanka Gandhi & Congress worker ride scooter without helmet: FINED Rs. 6,100-Read in telugu
Story first published: Monday, December 30, 2019, 18:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X