ఒక్క వీడియోతో 12 మంది యువకులు బుక్కయ్యారు.. ఇంతకు వీరు ఏంచేశారో తెలుసా?

భారతదేశంలో ఇటీవల రోడ్లు చాలా వేగంగా అభివృద్ధిచెందుతున్నాయి. ఇందులో కూడా ఎక్కువ భాగం ఇప్పటికే ఉత్తర భారతదేశంలో దాదాపు రోడ్లు విశాలంగా మరియు మునుపటికంటే చాలా అనుకూలంగా అభివృద్ది చేసారు. దీనికి సంబంధించి సమాచారాన్ని ఇటీవల కాలంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక సమాచారాన్ని కూడా అందించింది. రోడ్లు బాగుంటే దేశం బాగుంటుంది అనేది ఒకప్పటి నుంచి వస్తున్న నానుడి.

ఒక్క వీడియోతో 12 మంది యువకులు బుక్కయ్యారు.. ఇంతకు వీరు ఏంచేశారో తెలుసా?

అయితే చాలా మంది యువకులు ఇలాంటి రోడ్లపైన ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాటి వాటికి సంబంధించిన చాలా సంఘటనలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి చర్యలపై పోలీసులు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పయికి వీటిని పూర్తిగా నిలువరించలేకపోతున్నారు. ప్రతి రోజూ ఏదో ఒక మూల ఇలాంటి సంఘటనలు బయటపడుతున్నాయి.

ఒక్క వీడియోతో 12 మంది యువకులు బుక్కయ్యారు.. ఇంతకు వీరు ఏంచేశారో తెలుసా?

ఇటీవల కూడా ఇలాంటి ఒక సంఘటన బయటపడింది. నివేదికల ప్రకారం ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ఎటాలో జరిగినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా బయటపడింది. ఈ వీడియోలో ఖాళీ రహదారిపై మూడు కార్లలో వెళ్తున్న యువకులు సెల్ఫీలు తీసుకుంటూ, కార్లపైన కూర్చుని ఉండటం కూడా ఇక్కడ చూడవచ్చు.

ఒక్క వీడియోతో 12 మంది యువకులు బుక్కయ్యారు.. ఇంతకు వీరు ఏంచేశారో తెలుసా?

రహదారిపై మూడు కార్లలో 12 మంది యువకులు ఉన్నట్లు సమాచారం. ఇక్కడ ఉన్న 24 సెకన్ల వీడియోలో మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్, స్థానిక మరియు జాతీయ వార్తా ఛానెళ్లలో వైరల్ అయిన తరువాత స్థానిక పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సంఘటన హైవేపై జరగలేదని. రోడ్లపై రైలింగ్ లేదని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఒక్క వీడియోతో 12 మంది యువకులు బుక్కయ్యారు.. ఇంతకు వీరు ఏంచేశారో తెలుసా?

అయితే ఈ సంఘటన హైవేపై జరిగిందని పలు నివేదికలు పేర్కొనడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ రకమైన సంఘటనలలో, పోలీసులు కార్లను గుర్తించి, వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ల ద్వారా యువకులను అరెస్ట్ చేస్తారు.

ఒక్క వీడియోతో 12 మంది యువకులు బుక్కయ్యారు.. ఇంతకు వీరు ఏంచేశారో తెలుసా?

కానీ కార్ల రిజిస్ట్రేషన్ సంఖ్య ఈ వీడియోలో కనిపించలేదు, రిజిస్ట్రేషన్ ప్లేట్‌ను పోలీసులు గుర్తించలేకపోతే ఈ సంఘటనకు పాల్పడిన యువకులను అరెస్ట్ చేయడం గాని వారిపై చర్య తీసుకోవడానికి గాను అవకాశం ఉండదు. ప్రజా రహదారులపై ఇలాంటి సంఘటనలకు పాల్పడం చట్ట రీత్యా నేరం, అంతే కాదు ప్రమాదం మరియు ప్రాణాంతకం కూడా.

వాహనదారులు అంతగా వాహనంపై స్టంట్ చేయవలసి వస్తే, ఖాళీ ప్రదేశంలో లేదా మైదానంలో చేయడం మంచిది. ఈ రోజుల్లో ఈ చర్యలను నివారించడానికి పోలీసులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల ద్వారా వాహన ఉల్లంఘనలు జరిగితే వారికి ఈ-చలాన్లు విధించడం జరుగుతుంది.

ఒక్క వీడియోతో 12 మంది యువకులు బుక్కయ్యారు.. ఇంతకు వీరు ఏంచేశారో తెలుసా?

ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఇలాంటి అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ సంఘటనల్లో వాహనం నెంబర్ ప్లేట్స్ ఆధారంగా వారిపై చర్య తీసుకోవడమే కాకుండా అరెస్ట్ కూడా చేయడం జరిగింది.

Most Read Articles

English summary
Video Of Youth Stunting On Cars Goes Viral. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X