హెల్మెట్ ధరించలేదని నుదుటిపై బైక్ కీ తో పొడిచిన పోలీస్, తర్వాత ఏం జరిగిందంటే
భారతదేశంలో రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి. వాహనదారులు సరైన ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం వల్ల మాత్రమే కాకుండా హెల్మెట్స్ ధరించకపోవడం వల్ల సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరుగుతూ ఉంటాయి.

ట్రాఫిక్ నియమాలను సరిగ్గా పాటించని వాహనదారులపై పోలీసులు కఠినమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. కొన్ని సార్లు వాహనదారులపై పోలీసులు కొంత దురుసుగా కూడా ప్రవర్తిస్తారు.

ఇటీవల ఉత్తరాఖండ్ లో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. హెల్మెట్ ధరించనందుకు వాహనదారుని నుదిటిపై పోలీసులు కీని నెట్టారు. వాహనదారుని పట్ల ఈ విధంగా ప్రవర్తించినందుకు ఉత్తరాఖండ్ పోలీసుల సిటీ పెట్రోల్ యూనిట్ (సిపియు) లోని ముగ్గురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు.

ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లోని ఉదమ్ సింగ్ నగర్ జిల్లాలోని రుద్రపూర్ నగరంలో ఈ సంఘటన జరిగింది. సోమవారం సాయంత్రం 8 గంటలకు ట్రాఫిక్ నిబంధనలు పాటించనందుకు పోలీసు సిబ్బంది ఆ వ్యక్తిని రుద్రపూర్ ప్రాంతంలో ఆపారు. వారి మధ్య వాగ్వాదం చెలరేగడంతో, సిబ్బందిలో ఒకరు ఆ వ్యక్తి యొక్క బైక్ కీని తీసుకొని అతని నుదిటిపై పొడిచారు.

పోలీసు కీతో నుదుటిపై పొడిచినప్పుడు బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇక్కడ వీడియోలో బాధితుడి అతని నుదుటిపై రక్తం కారుతూ ఒక కీతో నిలబడి ఉన్నట్లు చూడవచ్చు. ఈ సంఘటనపై ఆగ్రహించిన స్థానికులు రుద్రపూర్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేసి రాళ్ళు రువ్వారు.
రుద్రాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్‌కుమార్ తుక్రాల్ సంఘటన స్థలానికి చేరుకుని తన నియోజకవర్గం నుంచి సిపియును తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు కనీస నియమాలను పాటించడం తప్పని సరి. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న సమయంలో వాహనదారులు కూడా హెల్మెట్ ధరించడం వంటివి పాటించాలి. అప్పుడే రోడ్డు ప్రమాదాల నుంచి కొంత వరకు బయటపడే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








