రెండు మొబైల్స్ ఉపయోగిస్తూ బైక్ హ్యాండిల్ వదిలేసాడు.. చివరకు ఏం జరిగిందంటే?
భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చారలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే రద్దీగా ఉండే ప్రదేశాల్లో మరియు ట్రాఫిక్ సిగ్నెల్స్ వద్ద సిసిటీవీ కెమెరాలను అమర్చుతారు. ఈ కెమెరాల సాయంలో ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా నడచుకున్న వాహనదారులకు ఫైన్ వేయడమే కాకుండా కొన్ని రోజులు లైసెన్స్ రద్దు చేయడం వంటివి కూడా చేస్తూ ఉంటారు. పోలీసులు ఇలాంటి ఎన్ని కఠినమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఇలాంటి సంఘనటనలు నివారించలేకపోతున్నారు.
ఇటీవల ఇలాంటి ఒక సంఘటన మళ్ళీ ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి వివరంగా ఈ ఆర్థికల్ లో తెలుసుకుందాం.. రండి.

నివేదికల ప్రకారం, ఒక వ్యక్తి బైక్ నడుపుతూ మొబైల్ ఫోన్ లో మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటపడింది. ఈ విధమైన ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిచినందుకు గాను, వడోదర పోలీసులు జరిమానా విధించారు. దీనికి సంబంధిచిన వీడియోని వడోదర పోలీసులు తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు.

ఈ వీడియోలో బైక్ నడుపుతున్న వ్యక్తి ఒక మొబైల్ కాదు, రెండు మొబైల్స్ వాడుతున్నాడు, ఆ సమయంలో అతడు తన బైక్ యొక్క హ్యాండిల్ కూడా వదిలేసాడు. ఈ మొత్తం సంఘటన సిసి కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వడోదర పోలీసులు రైడర్‌కు ఈ-చలాన్ జారీ చేశారు. అయితే, బైక్ రైడర్‌కి ఎంత మొత్తంలో చలాన్ జారీ చేశారనే విషయం మాత్రం స్పష్టంగా తెలియదు.

భారతదేశంలో, మోటారు వాహన చట్టం ప్రకారం వాహనాలు నడుపుతున్నప్పుడు ఫోన్ ఉపయోగించడం చట్టవిరుద్ధం. బైక్ నడుపుతున్నప్పుడు ఇయర్‌ఫోన్‌లు ఉపయోగించడం కూడా చట్టవిరుద్ధమే. డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా రైడింగ్ చేస్తున్నప్పుడు ఫోన్‌ని ఉపయోగించడం భారతీయ మోటారు వాహనాల చట్టం ప్రకారం ఖచ్చితంగా నేరం. ఇలాంటి సంఘనటనలకు పాల్పడితే వారికి కఠినమైన శిక్షలు విధించే అవకాశం ఉంటుంది.

డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా రైడింగ్ చేసేటప్పుడు హెడ్‌ఫోన్‌లను ఉపయోగించడం చట్టవిరుద్ధం. హెల్మెట్ కింద ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం కూడా నిషేధమే, కానీ చలామంది బైక్ రైడర్ హెల్మెట్ కింద ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. ఈ ఇయర్ ఫోన్స్ ఉపయోగించడం వల్ల వెనుక వచ్చే వాహనాలు చేసే హారన్స్ వంటివి వినిపించవు, ఈ కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.
అయితే కొంతమంది ప్రయాణంలో పాటలు వినడానికి ఈ ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తారు. కార్లలో ప్రయాణించే వ్యక్తులు తమ కారులోని మ్యూజిక్ సిస్టమ్ ద్వారా మ్యూజిక్ వినవచ్చు. కానీ కారు డ్రైవర్ మరియు ద్విచక్ర వాహనదారుడు ఇద్దరూ కూడా ఇయర్ ఫోన్స్ ఉపయోగించడం చట్ట విరుద్ధం.

ఇది వరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్‌లో సమర్పించిన నివేదికలో రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మద్యం తాగి వాహనాలు నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వంటి కారణాలని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం, 2020లో భారతదేశంలో మొత్తం 3,66,138 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలను నివారించడానికి తగిన సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ప్రమాదాలు జరగటానికి ట్రాఫిక్ రూల్స్ పాటించలేకపోవడం ఒక కారణం అయితే, సరైన రోడ్లు లేకపోవడం కూడా ఒక ఒక కారణమే, దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు విస్తరణ పనులను ముమ్మరంగా చేస్తున్నాయి. కావున రానున్న రోజుల్లో రోడ్డు ప్రమాదాలను తక్కువ చేయడానికి ఇవన్నీ ప్రయత్నాలే. కానీ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కేవలం ప్రభుత్వాలు అనుకుంటే సరిపోదు, వాహన వినియోగదారులు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది.


Click it and Unblock the Notifications








