Valentines Day ఈ ప్రేమికుల రోజున బైక్ లేదా కారు జర్నీ ఇలా ప్లాన్ చేయండి.. అప్పుడే మీ లవ్‌కి అవధులు ఉండవు!
ఫిబ్రవరి 14th, వేలంటైన్స్ డే వచ్చేస్తోంది. యువత.. మరీ ముఖ్యంగా ప్రేమికులు ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఇప్పటికే తమ ప్లాన్స్ కూడా రెడీ చేసుకుని ఉంటారు. చాలా మంది ఆరోజున తమ ప్రేయసి లేదా ప్రేమికుడితో కలిసి సరదాగా గడపాలనుకుంటారు. మరికొంతమంది అదే రోజున తమ ప్రేమను అవతలి వ్యక్తితో చెబుతుంటారు. ఇందుకోసం మంచి ప్లేస్ చూసుకుని వెళ్లాలనుకుంటారు. కార్లలో లేదా బైకులపై జాలీగా వెళ్లి ఆరోజును హాయిగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. అక్కడే తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. మరి ఆరోజున లవర్స్ పాటించాల్సిన కొన్ని సేఫ్టీ టిప్స్ ఏంటో చూసేద్దాం.
ప్రేమించిన వ్యక్తితో బయటికి వెళ్లేటప్పుడు అన్నింటి కంటే ముందు అందమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. మంచు కురిసే అటవీ ప్రాంతాలు, బీచ్‌లు, నదీ వంతెనలు వంటి మనోహర ప్రాంతాలను ఎంచుకుని వెళ్లాలి. లేదా అందమైన కాఫీ షాపులు, పార్కులు ఉండే రూట్స్ కూడా ఎంచుకోవచ్చు. అయితే.. ఈ రూట్లలో రొమాంటిక్ స్టాప్స్ ఉండేలా మాత్రం తప్పక చూసుకోవాల్సిందే గురూ! లేదంటే మీ ప్రేమ విరబూసేందుకు ఉండే ఛాన్స్ మిస్ అవుతుంది.

ఈ లవ్ ట్రిప్‌లో ముఖ్యంగా పాటించాల్సిన మరో అంశం టైమింగ్. సాయంత్రాలు లేదా సూర్యోదయాలు అందంగా ఉంటాయి. అప్పుడయితే కాస్త బెటర్! అలాగే వాతావరణ హెచ్చరికలను కూడా చూసుకోవాలండోయ్! లేదంటే మీరు ప్రేయసితో సరదాగా గడుపుతున్న సమయంలో భారీ వర్షమో, పిడుగులో పడ్డాయో మీ ప్రేమ ఇరకాటంలో పడుతుంది. ఈ మధ్య కాలంలో కొండచరియలు విరగడం వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి.. అలాంటి ప్రమాదాల్ని కూడా ముందే చూసుకోవాలి.
నచ్చిన చోటుకు మీరు ప్రేమించిన వ్యక్తితో కలిసి వెళ్లి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీలవుతారు కాబట్టి.. ఇలాంటి కానుకలేమైనా ఉంటే మీరు ప్రయాణించే వాహనంలోనే వారికి తెలియకుండా దాచి పెట్టి ఉంచండి. మీరు ఆ ప్రాంతానికి వెళ్లాక వారికి బహుమతులు అందించి వారి మనసు గెలుచుకోండి. మరో విషయం ఏంటంటే బైకులపై వెళ్తున్నప్పుడు వాటి గేర్లు, బ్రేకులు, టైర్లు వంటివి సరిగా ఉన్నాయో లేదా ముందే చూసుకోవాలి.

ఏమైనా రిపేర్స్ అవసరం పడితే ముందే చేపించుకుంటే మీ ప్రేమ ప్రయాణం సాఫీగా సాగుతుంది. అలాగే మీరు వెళ్లిన చోట అన్నీ సదుపాయాలు దొరక్కపోవచ్చు. అందుకని ముందుగానే వాటర్, ఆహారం, చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ వంటివి తీసకుపోతే మంచిది. ఇక మరో ముఖ్య విషయం.. మీ క్లాతింగ్. రైడ్ చేసేటప్పుడు వాతావరణానికి అనువుగా ఉండే బట్టలు వేసుకోకపోతే చలి, చెమట వంటి వాటితో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
మోటార్‌సైకిల్ మీద లాంగ్ డిస్టేన్స్ వెళ్లాలనుకుంటే మాత్రం... చిన్న ఇంజిన్ కెపాసిటీతో అయితే మీరు 50 కి.మీ.లు లేదా గంట సేపు హాయిగా ప్రయాణించవచ్చు. ఆ తర్వాత ఐదు నిమిషాలసేపు మీ వాహనాన్ని ఆపి దాన్ని కూల్ డౌన్ చేయాలి. ఆ తర్వాత మీరు మళ్లీ మీ జర్నీ మొదలుపెట్టవచ్చు. అయితే ఈరోజుల్లో చాలా మంది 150 నుంచి 200 సీసీ బైకులు ఎక్కువగా వాడుతున్నారు.

చిన్న చిన్న బ్రేకులు తీసుకుంటూ మంచి అనుభూతిని పొందవచ్చు. కాబట్టి.. మీ కలల ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకుని, ఎక్కడెక్కడ ఆగాలో, ఎక్కడ ఓవర్‌నైట్ స్టే చేయాలో కూడా ముందే సిద్ధం చేసుకోండి. కపుల్సే కాదు గురూ సింగిల్స్ కూడా లాంగ్ డిస్టేన్స్ ట్రావెల్ చేయవచ్చు బాసూ! ఏమో ఈ ప్రయాణంలో మీ ప్రేమను మీరు కలుస్తారేమో! మీ సింగిల్ లైఫ్‌కి ఫుల్‌స్టాప్ దొరికి మింగిల్ అవుతారేమో!


Click it and Unblock the Notifications








