Valentines Day: ప్రేమికుల రోజున బైక్ లేదా కారు జర్నీ ప్లాన్ చేస్తున్నారా? ఇవి తెలియకపోతే రిస్క్ మీకే!
ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు... ప్రేమికుల మనసుల్లో ప్రయాణాల ఆలోచనలు మొదలవుతాయి. వాలెంటైన్స్ డేను గుర్తుండిపోయేలా చేసుకోవాలంటే, కేవలం గిఫ్ట్‌లు లేదా డిన్నర్లే కాదు,, ఇద్దరూ కలిసి చేసే ఒక సుదీర్ఘ ప్రయాణం కూడా మధురమైన అనుభవంగా మారుతుంది. కారులోనైనా, బైక్‌పై అయినా... ఓపెన్ రోడ్డు, చల్లని గాలిలో, కలిసి మాట్లాడుకుంటూ సాగించే ప్రయాణం ప్రేమను మరింత బలపరుస్తుంది. కానీ ఈ ఆనందం మధ్యలో చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారకూడదంటే, కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా సుదూర ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే జంటల కోసం కొన్ని ముఖ్యమైన చిట్కాలను ఈ కింది కథణంలో వివరంగా అందించడం జరిగింది.
ముందుగా, ప్రయాణానికి బయలుదేరే ముందు సరైన ప్రణాళిక చాలా అవసరం. గమ్యస్థానం ఎంత దూరంలో ఉందో, రోడ్డు పరిస్థితులు ఎలా ఉన్నాయో, మధ్యలో విశ్రాంతి తీసుకునే చోట్లేమిటో ముందుగానే తెలుసుకుంటే ప్రయాణం మరింత హాయిగా సాగుతుంది. చివరి నిమిషంలో తొందరపడి ప్లాన్ చేస్తే, ఒత్తిడి పెరిగి ప్రయాణం ఆస్వాదించే అవకాశం తగ్గిపోతుంది. వాహన స్థితి కూడా అత్యంత కీలకం.

కారులో ప్రయాణిస్తున్నట్లయితే బ్రేకులు, టైర్లు, ఇంజిన్ ఆయిల్, కూలెంట్ వంటి ప్రాథమిక విషయాలను ముందే చెక్ చేసుకోవాలి. బైక్‌పై వెళ్తుంటే హెల్మెట్‌లు, బ్రేక్‌లు, లైట్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా చూసుకోవడం చాలా ముఖ్యం. చిన్న చెక్ లిస్ట్ ఒక పెద్ద ఇబ్బందిని తప్పించగలదని గుర్తుంచుకోవాలి. ప్రయాణంలో భద్రతకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రేమలో ఉన్నామన్న ఉత్సాహంలో వేగం పెంచడం లేదా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం ప్రమాదాలకు దారి తీస్తుంది.
ముఖ్యంగా బైక్‌పై ప్రయాణిస్తున్నప్పుడు, దుస్తుల ఎంపిక విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్త అవసరం. స్టైల్ కోసం లేదా ఫొటోలు బాగుండాలని భావించి వేసుకునే కొన్ని దుస్తులు, అనుకోకుండా ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, దుపట్టాలు, చీరలు లేదా చాలా వదులుగా ఉండే డ్రెస్సులు బైక్ చక్రాలు, చైన్ లేదా సైలెన్సర్ దగ్గర చిక్కుకుంటే తీవ్ర ప్రమాదం జరిగే అవకాశముంది.

ఇలాంటి సంఘటనలు గతంలో చాలాసార్లు జరిగాయి కూడా. క్షణాల్లో జరిగే ఈ ప్రమాదాలు ప్రయాణాన్ని భయానక అనుభవంగా మార్చేస్తాయి. అందుకే, బైక్‌పై ప్రయాణించే సమయంలో సౌకర్యవంతంగా ఉండే, శరీరానికి బాగా ఫిట్ అయ్యే దుస్తులను ఎంచుకోవడం మంచిది. దుపట్టా అవసరమైతే దాన్ని సరిగా పిన్‌తో బిగించడం లేదా పూర్తిగా తప్పించుకోవడం ఉత్తమం. చీర వేసుకున్నప్పుడు కూడా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి లేదా వీలైతే సురక్షితమైన ప్రత్యామ్నాయ దుస్తులను ఎంచుకోవడం మంచిది.
స్పీడ్ లిమిట్స్ పాటించడం, సీట్‌బెల్ట్ లేదా హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించడం ద్వారా మీరు మీ ప్రయాణాన్ని సురక్షితంగా మార్చుకోవచ్చు. మీతో ఉన్న వ్యక్తి భద్రత మీ చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోవడం అవసరం. దూర ప్రయాణాల్లో శరీరం త్వరగా అలసిపోతుంది. అందుకే మధ్య మధ్యలో విరామాలు తీసుకోవడం మంచిది. కాఫీ తాగడం, కొంచెం నడక చేయడం, ఫొటోలు దిగడం లాంటి చిన్న విరామాలు ప్రయాణాన్ని మరింత రిఫ్రెషింగ్‌గా మారుస్తాయి.

అలాగే, సరిపడా నీరు, తేలికపాటి ఆహారం వెంట ఉంచుకోవడం వల్ల ప్రయాణం అంతా ఎనర్జీగా ఉంటుంది. వాతావరణ పరిస్థితులపై కూడా ఒక కన్ను ఉంచాలి. అకస్మాత్తుగా వర్షం పడే అవకాశముంటే లేదా చల్లగా ఉండే ప్రాంతానికి వెళ్తుంటే, తగిన దుస్తులు ముందే సిద్ధం చేసుకోవాలి. అలాగే, మొబైల్ ఫోన్‌లో నావిగేషన్ యాప్‌లు, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ సిద్ధంగా ఉండేలా చూసుకోవడం మంచిది. ఈ వివరాలపై శ్రద్ధ చూపడం చింత లేకుండా ప్రయాణించవచ్చు.


Click it and Unblock the Notifications