ఈ వాలంటైన్స్ డే రోజు మీ భార్యకు ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి చూడండి.. కచ్చితంగా ఫ్లాట్ అవ్వాల్సిందే
మరో రెండు రోజుల్లో ప్రేమికుల దినోత్సవం రాబోతుంది. ప్రతి ఏడాది లాగే ఈ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేను తమకు ఇష్టమైన వారితో ఎంతో సంతోషంగా జరుపుకోడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు ఈ రోజు కోసం ఏడాది పాటు వేచి ఉంటారు. తమ ప్రేమను అవతలి వారికి వ్యక్తం చేయడానికి వాలెంటైన్స్ డేను పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమికులు ప్రేమగా ఒకరికొకరు బహుమతులను ఇచ్చుపుచ్చుకుంటారు. అవతలి వారిని ఆకట్టుకునే విధంగా గిఫ్ట్‌లను ఎంచుకోవాలని చూస్తారు. స్నేహితురాలు లేదా మీ భార్యకు పెద్ద బహుమతి ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి మార్కెట్లో చాలా రకాల బహుమతులు అందుబాటులో ఉన్నాయి. వారిని పెద్ద సర్‌ప్రైస్ విధంగా గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్న వారికి స్కూటర్ సరైన బహుమతి అవుతుంది.
ప్రస్తుతం మార్కెట్లో చాలా స్కూటర్లు మహిళల కోసం కోనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చాలా వరకు తక్కువ సీటు ఎత్తుతో ప్రత్యేకంగా అమ్మకానికి లభిస్తున్నాయి. ఎత్తు తక్కువగా ఉన్న మహిళలకు ఇవి చాలా అనువుగా ఉంటాయి. ఇలాంటి ఒక స్కూటర్‌ను కొని స్నేహితురాలు లేదా మీ భార్యకు బహుమతిగా ఇచ్చి పెద్ద సర్‌ప్రైజ్ చేసిన వారు అవుతారు. గిఫ్ట్‌గా ఇవ్వడానికి ప్రస్తుతం మార్కెట్లోని టాప్ 5 స్కూటర్లను ఒకసారి చూద్దాం.

Hero Xoom 110: ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హీరో స్కూటర్ జూమ్ 110 మహిళలకు అత్యంత అనువుగా ఉంటుంది. దీని ధర రూ.72 వేల నుంచి మొదలవుతుంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ మరింత ఎక్కువగా ఉంది. ఈ స్కూటర్ రైడర్ సీటు ఎత్తు 770 మిమీగా ఉంది. ఎత్తు తక్కువ ఉన్న వారికి దీన్ని రైడింగ్ చేయడం చాలా సులువుగా ఉంటుంది.
TVS Jupiter: టీవీఎస్ మోటార్స్‌కు చెందిన జూపిటర్ స్కూటర్ ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న మోడల్. దేశంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇది కనిపిస్తుంది. తక్కువ ఎత్తు ఉన్నవారికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. పురుషులతో పాటు, ముఖ్యంగా మహిళలకు కూడా అనుకూలంగా ఉంటుంది. దీని సీటు నేల నుంచి 765mm ఎత్తును కలిగి ఉంది. మార్కెట్లో దీని ధర రూ.75,000 నుంచి ఉంటుంది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర.

Bajaj Chetak: బజాజ్ చేతక్ భారతదేశంలో భారీ డిమాండ్ ఉన్న మోడల్. దీని సీటు ఎత్తు నేల నుంచి 760mmగా ఉంది. వాలెంటైన్స్ డే నాడు ఈ స్కూటర్‌ను మీకు ఇష్టమైన వారికి బహుమతిగా ఇచ్చి వారి ప్రేమను పొందవచ్చు. ఇక దీనిలో మహిళలకు అవసరమయ్యే అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. దీని ధర రూ.1.15 లక్షల నుంచి మొదలవుతుంది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. ఆన్‌రోడ్ మరింత ఎక్కువగా ఉంది.
TVS Zest 110: టీవీఎస్ స్కూటీ జెస్ట్ మహిళలకు అత్యంత అనువైన మోడల్. దీని బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ ఎత్తు ఉన్న మహిళలకు అనుగుణంగా రైడర్ సీటు ఎత్తు నేల నుండి కేవలం 760 మి.మీగా ఉంది. దాని బాడీ కూడా తక్కువ బరువు ఉండేలా రూపొందించారు. ఇది చూడటానికి స్టైలిష్ డిజైన్‌తొ కినిపిస్తుంది.

Honda Dio 110: హోండా డియో 110 ఇండియన్ మార్కెట్లో స్టైలిష్ మోడల్. దీని రైడర్ సీటు ఎత్తు 765 మి.మీగా ఉంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఈ మోడల్ ధర రూ.75,000 నుంచి మొదలవుతుంది. తక్కువ ఎత్తు ఉన్న మహిళలకు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.


Click it and Unblock the Notifications








