ఢిల్లీ: లాంబోర్గినీ కారును క్రాష్ చేసిన వాలెట్ డ్రైవర్

By Ravi

చాలా మందికి కార్లను వాలెట్ పార్కింగ్ కోసం వాలెట్‌కు అప్పగించడం అలవాటు. తమ కారును తామే స్వయంగా పార్క్ చేసుకోవటం మానేసి, పార్కింగ్ ప్లేస్ వరకు వెళ్లి ఎవరి తిరిగి వస్తారులే అనే ఉద్దేశ్యంతోనో లేక కొత్తవాళ్లు కొత్త ప్రదేశంలో పార్కింగ్ చేయటానికి ఇబ్బంది పడో వాలెట్ పార్కింగ్‌ను ఆశ్రయిస్తుంటారు. కారణం ఏదేమైనప్పటికీ, ఖరీదైన కార్లను వాలెట్‌కు అప్పగిస్తే, ఇదిగో ఇలానే జరుగుతుంది.

ఈ సంఘటన ఎక్కడో జరిగింది కాదు, మనదేశంలో జరిగినదే. న్యూఢిల్లీలోని హోటల్ లీ మెరీడియన్‌లో వాలెట్ పార్కింగ్ కోసం ఓ వాలెట్ (కారును పార్క్ చేసే డ్రైవర్) చేతికి అత్యంత పవర్‌ఫుల్ లాంబోర్గినీ గల్లార్డో స్పైడర్ సూపర్‌కారును పార్క్ చేయమని ఇస్తే, ఇదిగో అతను ఇలా పా(డు)ర్క్ చేసిచ్చాడు. పవర్‌ఫుల్ కారును అదుపు చేయలేని సదరు వాలెట్ ఇలా యాక్సిడెంట్ చేసిపారేశాడు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

లాంబోర్గినీ కారును క్రాష్ చేసిన వాలెట్ డ్రైవర్

న్యూఢిల్లీలోని లగ్జరీ హోటల్ లీ మెరీడియన్‌లో వాలెట్ పార్కింగ్ కోసం ఓ తెలుపు రంగు లాంబోర్గినీ గల్లార్డో స్పైడర్ సూపర్ కారును వాలెట్ పార్కింగ్ కోసం తీసుకువెళ్తుండగా ఆ కారు యాక్సిడెంట్‌కు గురైంది.

లాంబోర్గినీ కారును క్రాష్ చేసిన వాలెట్ డ్రైవర్

పార్కింగ్ తీసుకువెళ్లే సమయంలో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న సిమెంట్ రెయిలింగ్‌ను ఎదురుగా ఢీకొన్నట్లు ఈ ఫొటోలను బట్టి చూస్తుంటే తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం రిపేరు చేయటానికి వీలు లేనంతగా పాడైపోయింది.

లాంబోర్గినీ కారును క్రాష్ చేసిన వాలెట్ డ్రైవర్

కారు ముందు భాగంలో మాత్రమే కాకుండా, సైడ్ మిర్రర్ విరిగిపడి ఉండటం, కారు సైడ్స్‌పై గీతలు పడి ఉండటం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలియాలంటే, సదరు హోటల్ యాజమాన్యం సిసిటివి ఫుటేజ్‌ను విడుదల చేయాల్సి ఉంది.

లాంబోర్గినీ కారును క్రాష్ చేసిన వాలెట్ డ్రైవర్

కారు వేగాన్ని అదుపు చేయలేక ప్రమాదం జరిగిందా లేక వేరే ఏ వాహన్నైనా ఢీకొట్టడం వలన యాక్సిడెంట్ జరిగిందా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ, ఈ ప్రమాదంలో వాలెట్ డ్రైవర్‌కు కానీ అక్కడున్న వారికి కానీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.

లాంబోర్గినీ కారును క్రాష్ చేసిన వాలెట్ డ్రైవర్

వాలెట్ పార్కింగ్ అంటే, ఏదైనా హోటళ్లు, షాపింగ్ మాల్స్ వద్ద మన కారును పార్క్ చేయటం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన డెస్క్‌ను వాలెట్ అంటారు. ఆ డెస్క్ వద్ద ఉండే సిబ్బంది/డ్రైవర్లు మన కార్లను ఉచితంగా పార్క్ చేస్తారు. దీనినే వాలెట్ పార్కింగ్ అంటారు.


Photos: BigBoyToyz

More from DriveSpark

Article Published On: Wednesday, July 9, 2014, 10:15 [IST]
English summary
The valet of Hotel Le Meridien in New Delhi has crashed white colour Lamborghini Gallardo Spyder while parking. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+