ప్రహరీని ఢీ కొట్టి లోపలికి చొచ్చుకెళ్లిన మహీంద్రా ఇ2ఒ - బెంగళూరులో వైరల్

Written By:

మహీంద్రా ఎలక్ట్రిక్ కారు ఇ2ఒ, బెంగళూరులోని ఓ బిల్డింగ్‌లో దుసుకెళ్లింది, కంచెగా ఏర్పాటు చేసిన ఇనుప కేజ్‌ను కూడా ధ్వంసం చేసుకుంటూ బిల్డింగ్ అండర్ గ్రౌండ్‌లోకి చొచ్చుకెళ్లింది. అయితే అత్యంత బలమైన ఇనుప కంచెను ఢీకొట్టి లోపలికి వెళ్లిన సంగతి ఆ చుట్టు ప్రక్కల వైరల్‌గా మారింది.

బెంగళూరులో మహీంద్రా ఇ2ఒ యాక్సిడెంట్ వైరల్

బెంగళూరు, జయనగర్‌లోని వన్ ఇండియా నార్త్ బ్లాక్ ఆఫీస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మా ఆఫీసుకు సమీపంలో ఉన్న హాస్పిటల్‌ వద్దకు ఓ మహిళ వచ్చింది. ఆమెకు చెందిన ఈ కారు సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఆఫీసు ప్రహారీని ఢీ కొట్టింది.

బెంగళూరులో మహీంద్రా ఇ2ఒ యాక్సిడెంట్ వైరల్

మా ఆఫీస్‌కు సమీపంలో హాస్పిటల్‌కు పార్కింగ్ సౌకర్యం కలదు. డ్రైవర్ అంతకుమునుపే వచ్చి కారును పార్క్ చేసాడు. తిరిగి వెనక్కి తీసుకువెళ్లేటప్పుడు ఇలా ప్రమాదానికి గురి చేసాడు.

బెంగళూరులో మహీంద్రా ఇ2ఒ యాక్సిడెంట్ వైరల్

కారును తీసుకెళ్లే సమయంలో అదుపుతప్పి ఆఫీస్ పార్కింగ్ బే లోకి చొచ్చుకెళ్లింది. నిజానికి ప్రహరీ స్థానంలో ఇనుప కాంపౌండ్ వాల్ ఉంది. దానిని సైతం ఎలక్ట్రిక్ కారు ధ్వంసం చేసి క్రిందకు పడిపోయింది. అయితే ఫ్రంట్ బంపర్ గ్రౌండును తాకి అక్కడితో ఆగిపోయింది.

బెంగళూరులో మహీంద్రా ఇ2ఒ యాక్సిడెంట్ వైరల్

అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ కారును తీసుకెళ్లడానికి వచ్చిన హాస్పిటల్ ఉద్యోగి ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుండి పరారైపోయాడు.

బెంగళూరులో మహీంద్రా ఇ2ఒ యాక్సిడెంట్ వైరల్

మహీంద్రా ఇ2ఒ కారు చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది. కాని ఎంతటి దృడమైనదో ఈ ప్రమాదానంతరం తెలిసింది. పాక్షికంగా జరిగిన డ్యామేజ్ మినహాయిస్తే, పెద్దగా ఎలాంటి నష్టం వాటిల్లలేదు. తరువాత హాస్పిటల్ వాలెట్ సిబ్బంది వచ్చి కారును తొలగించడం జరిగింది.

బెంగళూరులో మహీంద్రా ఇ2ఒ యాక్సిడెంట్ వైరల్

చాలా మంది హోటల్స్, గోల్డ్ షాప్స్, పార్టీ హాల్స్, హాస్పిటల్స్ మరియు ఇతర ప్రదేశాల్లో కార్లను పార్క్ చేయడానికి వాలెట్ సిబ్బందికి ఇస్తుంటారు. అయితే వీరిలో చాలా వరకు కొత్త కార్లను హ్యాండిల్ చేయడం తెలియదు. కాబట్టి మీరు మీ కారును మీ సొంత ఆసక్తితో పార్క్ చేసుకోవడం బెస్ట్...

బెంగళూరులో మహీంద్రా ఇ2ఒ యాక్సిడెంట్ వైరల్

మారుతి బాలెనో ఆర్ఎస్ విడుదల: ధర రూ. 8.69 లక్షలు

మహీంద్రా వారి ధృడమైన మరియు శక్తివంతమైన ఎస్‌యూవీ టియువి300 కు చెందిన ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి....

 
English summary
Valet Crashes Mahindra E2O Car Bangalore
Please Wait while comments are loading...

Latest Photos