ఫేస్‌బుక్ వీడియో: ఖరీదైన కార్లను వాలెట్ పార్కింగ్ ఇస్తే..
ఈ వీడియో చూసిన తర్వాత, మీరు మీ కారును వాలెట్ పార్కింగ్‌కు ఇవ్వటానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. వాలెట్ పార్కింగ్ అంటే, ఏదైనా హోటళ్లు, షాపింగ్ మాల్స్ వద్ద మన కారును పార్క్ చేయటం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన డెస్క్‌ను వాలెట్ అంటారు. ఆ డెస్క్ వద్ద ఉండే సిబ్బంది/డ్రైవర్లు మన కార్లను ఉచితంగా పార్క్ చేస్తారు. దీనినే వాలెట్ పార్కింగ్ అంటారు.
కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వారు, ఇరుకు ప్రదేశాల్లో కారును పార్క్ చేయటం రాని వారు, ధనవంతులు వాలెట్ పార్కింగ్‌ను ఆశ్రయిస్తుంటారు. కారు తాళం చెవులను వాలెట్ వద్ద ఇస్తే, వాలెట్ డ్రైవర్లు కారును పార్క్ చేసి మనం తిరిగి వెళ్లేటప్పుడు కారును మన వద్దకు తెచ్చిస్తారు. వాలెట్ పార్కింగ్ సిస్టమ్‌లో జరిగే విధానం ఇలా ఉంటుంది.
సాధారణంగా, వాలెట్ పార్కింగ్ వద్ద ఉండే డ్రైవర్లు డ్రైవింగ్‌లో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు. కానీ, వీరికి అన్ని రకాల కార్లను నడిపిన అనుభం ఉండకపోవచ్చు. ఈ వీడియోలోని వాలెట్ డ్రైవర్ చూడండి, ఖరీదైన మరియు శక్తివంతమైన లాంబోర్గనీ కారును వాలెట్ పార్కింగ్ చేయబోయి ఏంచేశాడో. ఈ పవర్‌ఫుల్ కారును కంట్రోల్ చేయలేని సదరు డ్రైవర్, నేరుగా ముందున్న కారును గుద్దేశాడు.
దీంతో లాంబోర్గినీ అవెంటేడర్ కారు ముందు బంపర్ ముక్కలైంది. మరి ఈ వీడియో చూసిన తర్వాత, ఈసారి మీరెప్పుడైనా హోటల్‌కో షాపింగ్ మాల్‌కో వెళ్లినప్పుడు మీ ఖరీదైన కారును వాలెట్ పార్కింగ్ కోసం ఇస్తారా..?


Click it and Unblock the Notifications








