లక్కీ డ్రాలో లాంబోర్గినీ కారు గెలుచుకున్న వ్యాన్ డ్రైవర్
కేరళ రాష్ట్రానికి చెందిన సౌపీ అబ్దుల్లా (44 ఏళ్లు) అబుదాబిలో వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ నిర్వహించిన లాటరీలో ఇతను లాంబోర్గినీ గల్లార్డో కారును సొంతం చేసుకున్నాడు. ఓ షాపింగ్ మాల్‌లో 250 దినార్‌లు (68 డాలర్లు లేదా సుమారు రూ.3,800) పెట్టి షాపింగ్ చేస్తే, లక్కీ డ్రా కూపన్‌ను ఇస్తారు. ఈ లక్కీ డ్రాలో గెలిచిన వారికి వి10 ఇంజన్ కలిగిన ఈ సూపర్ కారును కానుకగా అందిస్తారు.
ఈ లక్కీ డ్రాలో అబ్దుల్లా అదృష్టం బావుండి 7,50,000 దినార్‌ల (2,04,189 డాలర్లు లేదా సుమారు రూ.1.13 కోట్లు) విలువైన లాంబోర్గినీ అవెంటేడర్ సూపర్ కారును గెలుచుకున్నాడు. మనదేశంలో ఇంపోర్ట్ డ్యూటీలతో కలిపి చూసుకుంటే ఈ కారు ధర సుమారు రెండు కోట్ల రూపాయలకు పైమాటే. అబ్దుల్లా వద్ద పాత స్కూటర్ తప్ప మరేమీ లేదు. నిజానికి అతనికి ఆదాయ స్థాయికి ఈ కారును మెయింటైన్ చేయటం చాలా కష్టం.
అబుదాబిలో ఓ టొయోటా వ్యాన్‌కు డ్రైవర్‌గా పనిచేస్తున్న అబ్దుల్లా ఈ లాంబోర్గినీ గల్లార్డో 500 కారును అమ్మేసి దాని ద్వారా వచ్చే డబ్బును తాను కేరళలో స్వంత ఇళ్లు కట్టుకోవటం కోసం తీసుకున్న అప్పును చెల్లించేందుకు ఉపయోగించుకుంటానని చెప్పుకొచ్చాడు. ఇలా రుణాన్ని చెల్లించిగా మిగిలి మొత్తంలో కొంత భాగాన్ని తన వద్ద ఉంచుకొని, తన ఊరిలో స్థానికంగా నిర్మిస్తున్న మసీదుకు పెద్ద మొత్తంలో విరాళాన్ని అందజేస్తానని చెప్పాడు.


Click it and Unblock the Notifications









