వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌ల్లో ఇన్ని సౌకర్యాలా.??.. ఫ్లైట్‌ జర్నీని తలపించే లగ్జరీ ఫీచర్లు.. మీరూ చూసేయండి.!!

దేశవ్యాప్తంగా త్వరలో వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఆ దిశగా స్లీపర్‌ క్లోచ్‌లను అభివృద్ధి చేసే ప్రక్రియలో భారతీయ రైల్వే శాఖ నిమగ్నమైంది. ఈ క్రమంలో వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌లు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి చాలా మందిలో ఉంది. వాటికి తెరదించుతూ సంబంధిత ఫొటోలు విడుదలై అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

వందే భారత్‌ రైళ్లు అమల్లోకి వచ్చాక.. సాధారణ రైళ్లతో పోలిస్తే అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. అధిక వేగంతో తక్కువ సమయంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంతో దేశవ్యాప్తంగా వందే భారత్‌ సేవలు అధికమ్యాయి. అంతర్జాతీయ(Vande Bharat Express) ప్రమాణాలతో అత్యాధునిక ఫీచర్లతో వీటిని రూపొందించారు.

Vande-Bharat-Sleeper

వందేభారత్ స్లీపర్: కాగా ఇప్పటి వరకు, వందే భారత్ రైళ్లలో సింగిల్-సీటర్ కోచ్‌లను మాత్రమే ఉండేవి. ఈ రైళ్లు కేవలం పగటిపూట మాత్రమే సర్వీస్‌ అందించేవి. ఈ క్రమంలో రాత్రిపూట కూడా ప్రయాణించేలా స్లీపర్‌ సౌకర్యంతో(Vande Bharat Sleeper Trains) భారతీయ రైల్వే ప్రస్తుతం వందే భారత్ రైలు కోచ్‌లను అభివృద్ధి చేస్తోంది.

ఈ కొత్త వందే భారత్ స్లీపర్ కంపార్ట్‌మెంట్ రైలు రూపకల్పనకు సంబంధించి ఆసక్తికర సమాచారం వెల్లడైంది. ఈ సమాచారం ఈ రైలు ముందు భాగం డేగ లాంటి డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉండనున్నాయి. వాటిలో 3 టైర్ ఏసీ, 2 టైర్ ఏసీ మరియు ఫస్ట్ క్లాస్ ఏసీ అనే మూడు రకాల కోచ్‌లు ఉంటాయి.

Vande-Bharat-Sleeper

అధునాతన సౌకర్యాలు: ఈ మొత్తం 16 కోచ్‌లలో 11.. 3 టైర్ ఏసీ కోచ్‌లు, నాలుగు 2 టైర్ ఏసీ కోచ్‌లు మరియు ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఈ రైలులో మొత్తం 823 మంది ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణించవచ్చు. 3-టైర్ ఏసీ కోచ్‌లలో 611 మంది, 2-టైర్ ఏసీ కోచ్‌లలో 188 మంది ప్రయాణికులు, 1st క్లాస్‌ కోచ్‌లో 24 మంది ప్రయాణికులు ప్రయాణించేలా తీర్చిదిద్దారు.

3 టైర్ ఏసీ కోచ్‌కు సంబంధించి ప్రస్తుతం ఉన్న రైలు కంటే ఎక్కువ సౌకర్యాలు ఉండేలా రూపొందిస్తున్నారు. ప్రధానంగా ఇందులో అదనపు కుషన్ బెడ్లను ప్రవేశపెట్టడాన్ని ఫొటోల్లో చూడవచ్చు. ఇది రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో సీటింగ్ సౌకర్యం కంటే మెరుగ్గా ఉంటుంది.

Vande-Bharat-Sleeper

ఆకర్షణీయమైన ఇంటీరియర్: కాగా వందే భారత్‌ స్లీపర్‌ రైలు లోపలి భాగం క్రీమ్, పసుపు మరియు కలప రంగులతో ఆకర్షణీయంగా రూపొందించారు. ఇక మిడిల్‌ మరియు అప్పర్‌ బెర్త్‌ల పైకి ఎక్కేందుకు.. సులభంగా నిచ్చెనను ఏర్పాటు చేశారు. ఇక రైలులో అన్నీ సెన్సార్‌ లైట్లనే ఉపయోగించారు.

ఆటోమేటిక్ LED లైట్లు: రాత్రి సమయంలో జర్నీ చేస్తున్నప్పుడు వారు నడుస్తున్న ప్రాంతంలో ఆటోమేటిక్‌గా లైట్లు వెలుగుతాయి. ప్రయాణికులు లేని సమయంలో లైట్లు ఆరిపోతాయి. దీని ద్వారా విద్యుత్ ఆదా అవుతుంది. ఇక రాత్రి వేళల్లో మెరుగైన వెలుతురును అందించడానికి అవసరమైన ప్రదేశాల్లో మాత్రమే లైట్లను అందించారు.

Vande-Bharat-Sleeper

వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లలో ప్రయాణీకులు ముఖ్యంగా రాత్రి సమయంలో టాయిలెట్‌ లేదా ఇతర అవసరాల కోసం బెర్త్‌ దిగినప్పుడు దారి కనిపించేందుకు వీలుగా.. దిగువన LED లైట్ స్ట్రిప్స్‌ను అందించారు. ప్రయాణికులు ఆ దారిలో నడుస్తున్నప్పుడు మాత్రమే ఇది పని చేస్తుంది. దీని ద్వారా రైల్లో నిద్రిస్తున్న ఇతర ప్రయాణికులకు ఏ మాత్రం ఇబ్బంది కలగించదు.

ఆటోమేటిక్ డోర్లు: వీటితో పాటు రైలు లోపల డోర్లు.. ఒక కంపార్ట్‌మెంట్ నుండి తదుపరి కంపార్ట్‌మెంట్‌కు వెళ్లే డోర్లు, టాయిలెట్ ప్రాంతంలోని డోర్లు అన్నిటిని ఆటోమేటిక్‌గా రూపొందించారు. ఇవి సెన్సార్‌ ఆధారంగా పనిచేస్తాయి. దీని ద్వారా రైలు లోపల కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. బయటి శబ్దాలు లోపలికి వినపడకుండా ఉంటాయి.

Vande-Bharat-Sleeper

బయో టాయిలెట్లు: వందే భారత్‌ స్లీపర్‌ రైలులో బయో టాయిలెట్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా దుర్వాసన బయటకు రాకుండా ఉంటుంది. అంతే కాకుండా వికలాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్ సౌకర్యాలు కూడా అందిస్తున్నారు. ఈ రైలు లావేటరీ లోపల ఉన్న అన్ని వాష్‌బేసిన్‌లు నీరు బయటకు పోకుండా రూపొందించారు.

ప్రధానంగా ఫస్ట్ క్లాస్ AC కంపార్ట్‌మెంట్‌లో, బాత్‌రూమ్‌ల్లో స్నానం చేయడానికి షవర్ మరియు హాట్‌ వాటర్‌ సౌకర్యాలు కూడా ఉండటం విశేషం. ఈ స్లీపర్ వందే భారత్ కోచ్‌లన్నీ ఇప్పటికే ఉన్న వందే భారత్ కోచ్‌ల మాదిరిగానే సెమీ-పర్మనెంట్ కప్లర్‌లతో అనుసంధానించబడి ఉంటాయి. ఇది ప్రయాణీకులకు కుదుపు లేని లగ్జరీ రైడ్‌ అనుభూతిని ఇస్తుంది.

Vande-Bharat-Sleeper

వందే భారత్ రైలులోని ఈ స్లీపర్‌ కోచ్‌లు ఎటువంటి సమస్యలు లేకుండా సురక్షితమైన కంపార్ట్‌మెంట్‌లకు పూర్తిగా చుట్టబడి ఉండటం ద్వారా.. ప్రయాణికులు ఒక కంపార్ట్ మెంట్ నుంచి మరో కంపార్ట్‌మెంట్‌కు సురక్షితంగా వెళ్లొచ్చు. ఈ రైలును గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణించగలిగేలా రూపొందించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, March 21, 2024, 13:45 [IST]
English summary
Vande bharat express sleeper coaches interior and exterior designs facilities photos
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+