మార్చి నుంచి పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్.. మొదటి సర్వీస్ ఈ రూట్లోనే.!!
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్(Vande Bharat Sleeper) రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు వందే భారత్ స్లీపర్ రైళ్ల ట్రయల్ రన్ మార్చి నెలలో చేపట్టనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ట్రయల్ రన్ అనంతరం ఏప్రిల్ నుంచి సర్వీసులు అందుబాటులోకి వస్తాయని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. పూర్తి సమాచారం ఈ కథనంలో..
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express) సర్సీస్‌ను ప్రవేశపెట్టింది. సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోలిస్తే వందే భారత్ రైళ్లు అత్యంత వేగంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. గంటకు 180 కి.మీ వేగంతో ఈ రైళ్లు ప్రయాణిస్తాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలను కలుపుతూ ఈ సెమీ హై స్పీడ్ రైళ్లు సేవలందిస్తూ ప్రజాదరణ పొందుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇటీవల వందే భారత్ సాధారణ్(అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్)ను ప్రారంభించిన సంగతి(Amrit Bharat Express) తెలిసిందే. ఇక త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా పరుగులు పెట్టనున్నాయి. ఇప్పటివరకూ వందే భారత్ రైళ్లు పగటి సమయంలో మాత్రమే నడుస్తుండగా.. త్వరలో రాత్రిళ్లు కూడా ప్రయాణించనున్నాయి.
కాగా వందే భారత్ స్లీపర్ రైలు(Vande Bharat Express Sleeper).. ఇప్పటివరకు ఉన్న రైళ్ల సర్వీసులతో పోలిస్తే మరింత వేగంగా ప్రయాణిస్తుందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. వందే భారత్ స్లీపర్ మొదటి రైలును దేశ రాజధాని ఢిల్లీ- ముంబయి మధ్య ప్రారంభించనున్నట్లు వెల్లడించాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే వేగంగా ప్రయాణించే ఈ వందే భారత్ స్లీపర్ రైలు ప్రత్యేకతలను ఇక్కడ తెలుసుకోండి.

మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న వందే భారత్ స్లీపర్(Vande Bharat Sleeper Trial Run) రైళ్లతో ప్రయాణికులకు లగ్జరీ సౌకర్యాలతో రాత్రి జర్నీలు చేయవచ్చు. ఈ రైలులో 16 నుంచి 20 ఏసీ, నాన్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. వీటి ద్వారా దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.

అంతే కాకుండా రాత్రి వేళల్లో ఎక్కువ దూరం ప్రయాణం ఉండే రూట్లలో ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు భారతీయ రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైళ్లను డిజైన్ చేసినట్లు పేర్కొన్నారు. వీటి ప్రత్యేకత ఏంటంటే.. ఇప్పటివరకు ఉన్న భారతీయ రైళ్ల సర్వీసులతో పోలిస్తే ఇవి అధిక వేగంతో ప్రయాణిస్తాయని చెప్పారు.

వందేభారత్ స్లీపర్ రైలు వేగం పెంచడం ద్వారా.. ప్రయాణికులకు 2 గంటల సమయం ఆదా అవుతుందని రైల్వే వర్గాలు వెల్లడించాయి. కాగా తొలి దశలో భాగంగా పది రూట్లలో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సమాచారం. వందే భారత్ స్లీపర్ కోచ్‌లను అత్యాధునిక ఫీచర్లు, సౌకర్యాలతో లగ్జరీ అనుభూతి కలిగిలా తీర్చిదిద్దారు.
ఇక వందే భారత్ స్లీపర్ అనంతరం త్వరలోనే వందే మెట్రో రైలు కూడా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కాగా ఇటీవల ప్రవేశపెట్టిన బడ్డెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు. భారతీయ రైల్వేలోని దాదాపు 40 వేల సాధారణ కోచ్‌లను వందేభారత్ ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వ్యాఖ్య: సాధారణ రైలు కోచ్‌లను వందే భారత్ స్థాయి అత్యాధునిక సౌకర్యాలతో డెవలప్ చేయడం ద్వారా ప్రయాణికులకు భద్రతతో పాటు సౌకర్యాలు మెరుగుపడతాయని కేంద్ర మంత్రి నిర్మలా ప్రకటించడం శుభ పరిణామం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రైల్వే రంగంలో ఆధునిక మార్పులు రావడం నిజంగా అభినందనీయం. దీని ద్వారా రైల్వేలో ప్రయాణించే వారి సంఖ్య కూడా మరింత పెరుగుతుంది.


Click it and Unblock the Notifications








