హైదరాబాద్‌- బెంగళూరు మధ్య వందే భారత్‌ రైలు .. 8 గంటల్లోనే.. !

హైదరాబాద్- బెంగళూరు మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను త్వరలో నడపనున్నారు. ఆగస్టు 25న ప్రారంభం కానుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి కాకుండా కాచిగూడ నుంచి సేవలు అందించే అవకాశం ఉంది. ఈ రైలు నిర్వహణ బాధ్యతలు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం చూసే అవకాశం ఉంది. ఈ రైలు ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌- బెంగళూరు మధ్య నడిచే సాధారణ రైళ్లతో పోలిస్తే వందే భారత్‌ రైలు త్వరగా గమ్యస్థానానికి చేరుతుంది. ఈ రెండు నగరాల మధ్య దూరం 618 కి.మీ ఉండగా.. కేవలం 7-8 గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది. అదే సాధారణ ఎక్స్‌ప్రెస్‌లు 11-12 గంటల సమయం తీసుకుంటాయి.

vande bharat express

హైదరాబాద్‌- బెంగళూరు రైలు ఆంధ్రప్రదేశ్‌లని గుంతకల్లు జంక్షన్‌ మీదుగా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అలాగే కర్ణాటకలో సేడం, రాయచూర్‌ స్టేషన్లలో స్టాప్‌లు కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. వీటిలో రెండు ఎగ్జిక్యూటివ్‌, మిగిలిన 14 సాధారణ కోచ్‌లు ఉంటాయి. అయితే ఈ రైలు టిక్కెట్‌ ధర, ప్రారంభ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.

హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వరకు జనవరి 15, 2023న తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం అయింది. ఏపీలోని సామర్లకోట జంక్షన్‌, రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌ వంటి స్టేషన్లలోనే ఆగుతుంది. అనంతరం ఏప్రిల్‌ 8, 2023న తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్‌ రైలును మోడీ ప్రారంభించారు. ఈ రైలు హైదరాబాద్- తిరుపతి మధ్య ప్రయాణం చేస్తుంది. కేవలం 8 గంటల్లో హైదరాబాద్‌ నుంచి తిరుపతి చేరుకుంటుంది.

vande bharat express

హైదరాబాద్‌- బెంగళూరు మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు అందుబాటులోకి రానుండడంతో ప్రజలు, ఉద్యోగాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక, వాణిజ్య కార్యకలాపాలు సహా వివిధ రంగాల అభివృద్ధికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. అయితే రైలు గురించి మరిన్ని వివిరాలు వెల్లడి కావాల్సి ఉంది.
తొలిసారిగా ఢిల్లీ- కాన్పూర్- అలహాబాద్‌- వారణాసి మార్గంలో 2019 ఫిబ్రవరి 15న వందే భారత్‌ రైలును ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించారు.

చెన్నైలోని పెరంబలూరు ఐసీఎఫ్‌ ఫ్యాక్టరీలో వందే భారత్‌ రైళ్లను తయారు చేస్తున్నారు. ఇక్కడ ఈ రైళ్ల కోసం ప్రత్యక విభాగం ఉంది. ప్రస్తుతం వందే భారత్‌ రైలు ఇంజిన్‌ నుంచి కోచ్ వరకు పూర్తి చేసేందుకు 2 నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ రైళ్లను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్నారు.

సాధారణ రైళ్లలో 24 కోచ్‌లు ఉంటాయి. అదే వందేభారత్‌లో కేవలం 16 బోగీలు మాత్రమే ఉంటాయి. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న వందే భారత్‌ అనేక అధునాతన సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. వందే భారత్‌ ఆటోమేటిక్ డోర్ల నియంత్రణ పూర్తిగా డ్రైవర్‌ వద్దనే ఉంటుంది. ప్లాట్‌ఫారమ్‌ ఉన్న చోట మాత్రమే తలుపులు తెరుచుకుంటాయి. మరియు తలుపులు మూసిన అనంతరమే రైలు ప్రారంభం అవుతుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, August 22, 2023, 19:12 [IST]
English summary
Vande bharat express to start between hyderabad and bangalore soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+