తిరుపతి నుంచి చెన్నై మీదుగా పుదుచ్చేరికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఎప్పటి నుంచి అంటే.!!

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులను ఆకట్టుకోవడానికి అత్యాధునిక సౌకర్యాలతో భారతీయ రైల్వే రైళ్లను తయారుచేస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే దూరాన్ని తగ్గించడంతో పాటు సమయాన్ని ఆదా చేసేందుకు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. తాజాగా మరో కొత్త మార్గంలో ఈ సెమీ హై స్పీడ్ రైలు నడవనుంది.

దేశంలో వందేభారత్ రైళ్లను దశలవారీగా ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా ఈ రైళ్లను దేశంలో ప్రతి ప్రధాన నగరాన్ని కలుపుతూ ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. ఈ క్రమంలో పుదుచ్చేరి నుంచి చెన్నై మీదుగా తిరుపతికి వందే భారత్ రైలును నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. చెన్నై నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Vande-Bharat-Train

చెన్నై నుంచి తిరుచ్చి, మధురై మీదుగా తిరునల్వేలికి, చెన్నై నుంచి విజయవాడకు రెండు వందే భారత్ రైలు ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. మూడవది, పుదుచ్చేరి నుంచి చెన్నై మీదుగా తిరుపతికి వందే భారత్ రైలును నడపడానికి దక్షిణ రైల్వే సంప్రదింపులు జరుపుతోంది.

పుదువై వందే భారత్ పేరుతో ఈ రైలును ప్రారంభించనున్నారు. ఈ రైలు పుదుచ్చేరి నుంచి బయలుదేరి మధురాండకం, విల్లుపురం మీదుగా చెన్నై చేరుకుని చెన్నై నుంచి అరక్కోణం మీదుగా తిరుపతికి చేరుకుంటుంది. ఈ వందే భారత్ రైలును రైల్వేలో చిన్న రైలుగా నడిపేందుకు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది.

సాధారణంగా పుదుచ్చేరి నుంచి తిరుపతికి వెళ్లాలంటే తిరువణ్ణామలై, వెల్లూరు ప్రాంతం మీదుగా వెళ్లాలి. అయితే చెన్నై - తిరుపతి మార్గంలో ప్రయాణించాల్సి ఉన్నందున ఈ రైలును చెన్నై మీదుగా నడపనున్నారు. ప్రస్తుతం ఈ రైలు ప్రాజెక్టు దశలో మాత్రమే ఉంది. ఇది ఫిబ్రవరి 2024లో అమలులోకి వస్తుందని అంచనా.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రత్యేకతల గురించి చెప్పాలంటే, ఇది గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అయితే, భద్రత దృష్ట్యా 160 కి.మీకి పరిమితం చేశారు. ఈ రైలులో ఒక్క ఇంజిన్ కూడా లేదు. పూర్తిగా ఎయిర్ కండిషన్ చేయబడిన ఈ రైలు సీట్లు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా బయో టాయిలెట్ వ్యవస్థను కలిగి ఉన్నాయి.

ఇతర సాధారణ రైళ్లలా కాకుండా ఈ రైలులో ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. ఇందులో అధిక నాణ్యత గల టాయిలెట్ మరియు సీటింగ్ సౌకర్యాలను భారతీయ రైల్వే కల్పించింది. ఇది AC కోచ్‌లతో పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ రైలుగా రూపొందించారు. ఈ రైలులో ప్రయాణికులకు భోజన సదుపాయం కూడా ఉంది. విదేశాల్లో బుల్లెట్ రైలు మాదిరి వందేభారత్ రైలు ప్రసిద్ధి చెందింది.

వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇందులో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మొదట్లో వందే భారత్ రైలు వేగం నెమ్మదిగా ఉన్నా.. ప్రయాణించేకొద్దీ వేగం నిరంతరం పెరుగుతూ ఉంటుంది. దీంతో రైలు వేగంగా గమ్యస్థానానికి చేరుకుంటుంది. పరిమిత స్టాపులను కలిగి ఉండటంతో నిర్దిష్ట సమయంలో మాత్రమే వందే భారత్ రైళ్లు స్టేషన్లో ఆగుతాయి.

కాగా ఇప్పటికే తెలంగాణలోని మొదటి రెండు రైళ్లు సికింద్రాబాద్- విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడుస్తున్నాయి. త్వరలో మరో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు బెంగళూరులోని యశ్వంత్‌పూర్ స్టేషన్ మరియు హైదరాబాద్‌లోని కాచిగూడ స్టేషన్ మధ్య నడవనుంది. చెన్నై - విజయవాడ మార్గంలో మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Saturday, August 19, 2023, 14:57 [IST]
English summary
Vande bharat express train from puducherry to tirupati via chennai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+