వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను లాగిన సాధారణ రైలు ఇంజిన్.. సోషల్ మీడియాలో వైరల్.. క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ
వందే భారత్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. అయితే ఈ సెమీ హై స్పీడ్ రైళ్ల సర్వీస్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రశంసలతో పాటు విమర్శలనూ ఎదుర్కొంటోంది. గతంలో వందే భారత్ రైలును సాధారణ రైలు ఇంజిన్ లాగిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.
ఇటీవల 20661 SBC ధర్వార్ (DWR) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఫెయిల్ అయిన సంఘటన చోటుచేసుకుంది. వందే భారత్ రైలును 100 kmph ఫిట్ WAG-7 కామన్ రైల్ ఇంజిన్ ద్వారా కర్ణాటకలోని తుమకూరు సమీపంలో లాగినట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా దీనిపై ఇప్పటికే ట్రోల్స్ ప్రారంభమయ్యాయి.

గతంలో కూడా వందేభారత్ రైలును సాధారణ రైలు ఇంజిన్‌తో లాగినప్పుడు విపరీతంగా ట్రోల్ జరిగింది. అప్పుడు దక్షిణ మధ్య రైల్వే శాఖ దీనిపై క్లారిటీ ఇచ్చి ట్రోల్స్‌కు బ్రేక్ వేసింది. ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటనే పునరావృతం కావటంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితేే వందే భారత్ రైలు ఫెయిల్ అవ్వడంపై కారణాలు తెలిసింది.
వందే భారత్ ట్రాక్షన్ కంట్రోల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో, స్టేషన్ నుంచి బయలుదేరే ముందు ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా సాధారణ రైలు ఇంజిన్ సహాయం తీసుకున్నట్లు సమాచారం. గమ్యస్థానానికి చేరేందుకు ప్రయాణికులకు ఆలస్యం కాకుండా ఉండేందుకు సమీపంలోని లోకోను ఏర్పాటు చేసి రైలును గమ్యస్థానానికి చేర్చినట్లు తెలిసింది.

సాధారణంగా సాంకేతిక సమస్య తలెత్తితే రైల్వే శాఖ మరమ్మతు పనులు చేసి ఉండొచ్చు. అయితే మరమ్మతులకు సమయం పట్టడంతో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఇలా చేసినట్లు సమాచారం. వందే భారత్‌ను సాధారణ రైలు ఇంజిన్ లాగడంతో ఇది కేవలం టెక్నికల్ ప్రాబ్లమ్ మాత్రమేనని, దీనిని సరిచేస్తే రైలు మునుపటిలా నడుస్తుందని చెబుతున్నారు.
గతంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును సాధారణ రైలు ఇంజిన్‌తో లాగుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ సెమీ హై స్పీడ్ రైలును మరో రైలు ఇంజిన్ ఈడ్చుకెళ్తుంటే చూసి నవ్వని వారుంటారా.? దీనిపై చాలా మంది జోకులేసుకుంటూ ఆ వీడియోను తమ సోషల్ నెట్‌వర్క్‌లలో షేర్ చేశారు.
ఎట్టకేలకు సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వారికి దక్షిణ మధ్య రైల్వే శాఖ ఓ క్లారిటీ ఇచ్చింది. దీనిపై రైల్వే శాఖ స్పష్టత ఇవ్వకముందే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మొదట ట్రాక్‌లపై అమలు చేసేటప్పుడు, దాని మార్గం నిర్ణయించే వరకు దానిని మరొక ఇంజిన్‌తో లాగుతారు. ట్రయల్స్ సమయంలో ఈ విధంగా రైలును నడపాలని అధికారులు స్పష్టం చేశారు.
వందే భారత్‌లోని ఇంజిన్ భాగం సాధారణ రైళ్ల కంటే తక్కువ గేజ్‌ని కలిగి ఉంటుంది. అలాగే, మెటల్ తగ్గడం వల్ల నాణ్యత కూడా తక్కువగా ఉంటుంది. వందే భారత్ రైలు ఒక నిర్దిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో సాధారణ రైళ్ల కంటే వేగం నియంత్రించడం సులువుగా ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








