Vande Bharat sadharan రైళ్ల ట్రయల్‌రన్ కోసం సర్వం సిద్ధం.. ఒకేసారి 1800 మంది ప్రయాణం చేసేలా సౌకర్యాలు!
వందే భారత్ సాధారణ్ రైళ్లు (Vande Bharat sadharan) త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ రైళ్ల పనితీరును టెస్టింగ్ చేసేందుకు ముంబయిలోని వాడి బండార్ యార్డ్‌కు సాధారణ్ రైళ్లను తీసుకొచ్చారు. ముంబై- నాసిక్ కారిడార్‌లో ఈ రైళ్ల ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
వందే భారత్ సాధారణ రైళ్లు 22 LHB నాన్ ఏసీ 3 టైర్ స్లీపర్ కోచ్‌లను కలిగి ఉంటాయి. తక్కువ ధరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ రైళ్లలో 1800 మంది ప్రయాణించేందుకు సౌకర్యాలున్నట్లు సమాచారం. ఈ రైళ్లు పుష్ అండ్ పుల్ చేసేందుకు రెండు వైపులా ఇంజిన్లను కలిగి ఉంటాయి.

ఈ రైళ్లు గంటకు 130 కి.మీ వేగంతో ప్రయాణం చేయగలవని తెలుస్తోంది. వందే సాధారణ్ రైళ్ల ట్రయల్స్ ముంబై- నాసిక్ కారిడార్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వందే భారత్ సాధారణ్ రైళ్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయో వెల్లడి కాలేదు. తొలుత ఏయే ప్రాంతాల మధ్య అందుబాటులోకి రానున్నాయో తెలియలేదు. తక్కువ ధరలో సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణానికి ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ రైళ్లతోపాటు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ స్లీపర్ రైలుకు సంబంధించిన ఫొటోలను గతనెలలో రైల్యే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విడుదల చేశారు. ఈ రైళ్లను గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణం చేసేలా రూపొందించారు. ఈ స్లీపర్ రైళ్లు 16 కోచ్‌లను కలిగి ఉంటాయి. 887 మంది ప్రయాణం చేసేలా ఇందులో సౌకర్యాలున్నాయి.

ఈ రైలు ప్రయాణికులకు 2024 నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. రైలు ఇంటీరియర్ అత్యంత శుభ్రంగా, సౌకర్యవంతంగా, విలాసవంతంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. లైటింగ్ వ్యవస్థ కూడా చాలా అధునాతనంగా ఉంది. బెర్త్‌ల మధ్య ఖాళీ కూడా సౌకర్యవంతమైన స్థాయిలో ఉంది. మూడు టెక్నాలజీల్లో 400 వందే భారత్ స్లీపర్ వెర్షన్‌లను తయారు చేసేందుకు భారతీయ రైల్వే శాఖ ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది.
తొలిసారిగా ఢిల్లీ- కాన్పూర్- అలహాబాద్- వారణాసి మార్గంలో 2019 ఫిబ్రవరి 15న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించారు. ఈ రైళ్లను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేస్తున్నారు. చెన్నైలోని పెరంబలూరు ఐసీఎఫ్ ఫ్యాక్టరీలో వందే భారత్ రైళ్లను తయారు చేస్తున్నారు. ఇక్కడ ఈ రైళ్ల కోసం ప్రత్యేక విభాగం ఉంది.

ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న వందే భారత్ రైళ్లలో అనేక అధునాతన సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. వందే భారత్ ఆటోమేటిక్ డోర్ల నియంత్రణ పూర్తిగా డ్రైవర్ వద్దనే ఉంటుంది. ప్లాట్‌ఫారమ్ ఉన్న చోట మాత్రమే తలుపులు తెరుచుకుంటాయి. మరియు తలుపులు మూసిన అనంతరమే రైలు ప్రారంభం అవుతుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








