Vande Bharat స్లీపర్ రైళ్ల లోపలి ఫోటోలు చూశారా.. తక్కువ ధరలోనే విలాసవంతమైన ప్రయాణం!!
ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గుడ్‌న్యూస్ చెప్పారు. వందే భారత్ స్లీపర్ వెర్షన్‌ను (Vande bharat sleeper version) ఫోటోలను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. రైలు లోపలి భాగం ఫోటోలు ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. ఈ రైలు ప్రయాణికులకు 2024 నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (railway minister ashwini vaishnaw) విడుదల చేసిన ఫోటోలు ఆధారంగా రైలు ఇంటీరియర్ అత్యంత శుభ్రంగా, సౌకర్యవంతంగా, విలాసవంతంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. లైటింగ్ వ్యవస్థ కూడా చాలా అధునాతనంగా ఉంది. బెర్త్‌ల మధ్య ఖాళీ కూడా సౌకర్యవంతమైన స్థాయిలో ఉంది. మొత్తంగా ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే.. మెరుగైన అనుభూతిని పొందుతారు.

ప్రస్తుతం ఉన్న సాధారణ రైళ్లకు ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్లు అదనంగా నడవనున్నాయి. రాత్రిపూట, దూర ప్రాంత ప్రయాణాలకు ఇవి ఈ హైస్పీడ్ రైళ్లు అనుకూలంగా ఉండనున్నాయి. ఈ రైళ్లు 16 బోగీలను కలిగి ఉంటాయి. గరిష్ఠంగా గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించేలా వీటిని రూపొందిస్తున్నారు.
వందేభారత్ స్లీపర్ రైళ్లలో గరిష్ఠంగా 887 మంది ప్రయాణం చేయవచ్చు. మొత్తం 75 వందే భారత్ ర్యాక్‌లు చైర్ కార్ వెర్షన్‌గా మిగిలినవి స్లీపర్ వెర్షన్‌గా ఉండనున్నాయి. మొత్తం మూడు టెక్నాలజీల్లో 400 వందే భారత్ స్లీపర్ వెర్షన్‌లను తయారు చేసేందుకు భారీతీయ రైల్వే శాఖ ప్రణాళికలు వేస్తోంది. ఇందుకు టెండర్లను పిలిచినట్లు తెలుస్తోంది. దీనికి అదనంగా 2023-24 బడ్జెట్‌లో 8000 వందే భారత్ కోచ్‌లకు ప్రాతిపాదనలున్నాయి.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అధునాతన సెమీ లైట్ స్పీడ్ రైళ్లు ద్వారా ప్రయాణికులకు కొత్త ప్రయాణ అనుభూతిని అందించడమే లక్ష్యంగా రైల్వే శాఖ నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. వేగం సహా భద్రతా ఈ రైళ్ల ప్రధానంగా కలిగి ఉంటాయి. ప్రపంచస్థాయి ఫీచర్లతో మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే ఈ రైళ్ల ముఖ్య ఉద్దేశం.
తొలిసారిగా ఢిల్లీ- కాన్పూర్- అలహాబాద్- వారణాసి మార్గంలో 2019 ఫిబ్రవరి 15న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ రైళ్లను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోనే అనేక మార్గాల్లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు.

చెన్నైలోని పెరంబలూరు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ -ICFలో వందే భారత్ రైళ్లను తయారు చేస్తున్నారు. ఇక్కడ ఈ రైళ్ల కోసం ప్రత్యేక విభాగం ఉంది. ప్రస్తుతం వందే భారత్ రైలు ఇంజిన్ నుంచి కోచ్ వరకు పూర్తి చేసేందుకు 2 నెలల సమయం పడుతుందని తెలుస్తోంది.
సాధారణ రైళ్లలో 24 కోచ్‌లు ఉంటాయి. అదే వందే భారత్‌లో కేవలం 16 బోగీలు మాత్రమే ఉంటాయి. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో అనేక అధునాతన సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. వందే భారత్ ఆటోమేటిక్ డోర్ల నియంత్రణ పూర్తిగా డ్రైవర్ వద్దనే ఉంటుంది. ప్లాట్‌ఫారమ్ ఉన్న చోట మాత్రమే తలుపులు తెరుచుకుంటాయి. మరియు తలుపులు మూసిన అనంతరమే రైలు ప్రారంభం అవుతుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








