చిరుతకు, వందే భారత్ రైలుకు పోటీ పెడితే ఏది గెలుస్తుందో తెలుసా.??
దేశంలో వందే భారత్ రైళ్లు అత్యంతగా ప్రజాదరణ పొందుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక ఫీచర్లు, అధిక వేగంతో ప్రయాణించేలా రూపొందించిన ఈ రైళ్లు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలను కలుపుతూ ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ రైలు అనుకున్నంత వేగంగా ప్రయాణించడం లేదని కొందరు భావిస్తున్నారు. అందుకు కారణాలేంటంటే..
విదేశాల్లో బుల్లెట్ రైలుకు పోటీగా దేశంలో వందేభారత్ రైలును ప్రారంభించి.. దీనిని మేడ్-ఇన్-ఇండియా రైలుగా ప్రవేశపెట్టారు. అయితే మరికొన్నేళ్లలో ముంబయి- అహ్మదాబాద్ మార్గంలో బుల్లెట్ రైలు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో వందే భారత్ రైలు రాకతో ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ప్రతి మార్గంలో ఈ సెమీ హై స్పీడ్ రైళ్లకు మంచి ఆదరణ లభించింది.

అత్యంత వేగవంతంగా ప్రయాణించే ఈ రైళ్లు.. అనుకున్నంత వేగంగా ప్రయాణించడం లేదని కొందరు ప్రయాణికులు అనుకుంటున్నారు. అయితే వందే భారత్ కంటే ముందు దురంతో మరియు తేజస్ భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైళ్లుగా ఉన్నాయి. ఈ రైళ్లన్నీ గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించబడ్డాయి. కానీ వందే భారత్ రైళ్లు గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణించేలా నిర్మించారు.
అయితే, అధిక వేగంతో ప్రయాణించడం లేదని ప్రయాణికులు భావించడం వెనుక కొన్ని సాంకేతిక మరియు శాస్త్రీయ సమస్యలు ఉన్నాయి. వందేభారత్ రైళ్లను పూర్తిగా అత్యాధునిక ఫీచర్లతో రూపొందించారు. ఆటోమేటిక్ డోర్లు, బయో టాయిలెట్లు, వృద్దుల కోసం ప్రత్యేక సీట్లు, ఇలా అనేకం ఉన్నాయి. రైలు ప్రయాణించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా డోర్లు తెరుచుకోవు.

కాబట్టి మీరు రైలు లోపల ఉన్నప్పుడు రైలు ఎంత వేగంగా ప్రయాణిస్తుందో మీరు చూడలేరు. రైలు అధిక వేగంతో కదులుతున్నప్పుడు ఊగిసలాడకుండా ఉండేందుకు దీని సస్పెన్షన్ సిస్టమ్ ఉంటుంది. కానీ అన్ని దురంతో మరియు తేజస్ రైళ్లలో డోర్లు తెరిచి ఉండటం ద్వారా రైలు వేగాన్ని మీరు ఆస్వాదించవచ్చు. కానీ వందే భారత్ రైళ్లలో ఈ అవకాశం లేకపోవడం ద్వారా ప్రజలు ఈ అనుభూతి చెందలేరు.
అందుకే వందేభారత్ రైలు వేగంగా ప్రయాణించడం లేదని ప్రజలు భావిస్తుంటారు. అయితే వాస్తవానికి ఈ రైలును గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించినా.. భద్రతా కారణాల దృష్ట్యా కేవలం 160 కి.మీ కి పరిమితం చేశారు. అయితే కొన్ని చోట్ల రైళ్లు 150 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి. దీనికి కారణం.. ఆ వేగాన్ని తట్టుకునేంత దృఢంగా ట్రాక్‌లు లేకపోవడం.

కాబట్టి పట్టాలు బలంగా లేని చోట వందే భారత్ర్ రైలు తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. ఇంకా గరిష్ఠ వేగంతో ప్రయాణించే అవకాశం ఉన్న కొన్ని ప్రదేశాల్లో ట్రాక్‌ను పటిష్ఠ చేశారు. ఇంకా మీరు వందేభారత్ రైలు వేగాన్ని తెలుసుకోవాలంటే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మృగం చిరుతపులి వేగం ఎంతో తెలుసుకోవాలి.
చిరుత మరియు వందే భారత్ రైలు మధ్య పోటీ పెడితే వందే భారత్ రైలు గెలుస్తుంది. ఎందుకంటే చిరుతపులి గంటకు 130 కి.మీ వేగంతో పరిగెత్తగలదు. కానీ ఈ రైలు దానికంటే వేగంగా పరుగులు తీస్తుంది. ఏదేమైనా చిరుత కంటే వేగంగా ప్రయాణించే ఈ వందే భారత్ రైలులో డోర్లు, విండోలు మూసి ఉంచడం ద్వారా ప్రయాణికులు దాని వేగాన్ని ఆస్వాదించలేరని గమనించాలి.


Click it and Unblock the Notifications








