ఇకపై రైళ్లలో వేడినీళ్లు... తొలిసారిగా వందే మెట్రోలో అమలుకు శ్రీకారం..!!
పంజాబ్‌లోని కపుర్తలా వద్ద ఉన్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సీఎఫ్)లో సరికొత్త వందే మెట్రో కోచ్‌లు తయారు చేయబడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలి ఇంటర్‌సిటీ ట్రైన్ పట్టాలు ఎక్కనుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెండు ప్రధాన నగరాలను కలిపే ఈ వందే మెట్రో సర్వీసులను ప్రవేశపెట్టనున్నారు.
వందే భారత్ కాన్సెప్ట్ పై రూపొందించిన ఈ వందే మెట్రో 250 కిలోమీటర్ల దూరం వరకు కీలక ప్రాంతాలను కలుపుతుంది. ఇది కేవలం ఇంటర్ సిటీ ప్రయాణీకులకు సేవలు అందిస్తుంది. త్వరలోనే రానున్న ఈ వందే మెట్రో రైలులో 16 ఎయిర్ కండిషన్డ్ బోగీలు ఉండనున్నాయి. ఇది గంటకు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తం 16 కోచ్‌లు సిద్ధం అవుతాయని రైల్ కోచ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ వివరించారు. ఇంటర్ సిటీ ట్రాఫిక్ ఫ్రీ కోసం ఉద్దేశించిన ఈ రైలు ఏప్రిల్ నాటికి తొలి ట్రయల్ పూర్తి చేయాలని సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ట్రయల్స్ అనంతరం ఈ ట్రైన్‌ని పూర్తి స్థాయిలో రైల్వే శాఖ ప్రారంభించనుంది.
ప్రతి కోచ్ 280 మంది ప్రయాణీకులను తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో 100 సీటింగ్ సామర్థ్యం మరియు 180 స్టాండింగ్ కెపాసిటీని గమనించవచ్చు. 3×3 బెంచ్ టైప్ సీటింగ్ ఆరేంజ్ మెంట్ ప్రయాణీకుల సామర్థ్యాన్ని పెంచుతుందని ఆర్‌సీఎఫ్ శ్రీనివాస్ తెలిపారు. వందే మెట్రో బోగీల్లో అత్యవసర పరిస్థితుల్లో రైలు డ్రైవర్ తో కమ్యూనికేట్ చేయడానికి ప్యాసింజర్ టాక్ బ్యాక్ సిస్టమ్ ఉంటుంది.

ప్రతి బోగీలో మంటలను లేదా పొగను గుర్తించేందుకు 14 సెన్సార్లు అమర్చుతున్నట్లు చెప్పుకొచ్చారు. వీటితో పాటు గీల్లో వీల్ చైర్ సదుపాయంతో ఉండే మరుగుదొడ్డిని కూడా తీసుకువస్తున్నట్లు ఆయన వెళ్లడించారు. ఈ రైలులో కవచ్ వ్యవస్థను అమర్చనున్నట్లు, ఇది ప్రమాద సమయంలో కీలకంగా వ్యవహరిస్తుందని ఆయన చెప్పారు.
రెండు బోగీలను కలిపే గ్యాంగ్ వే కారిడార్లు కూడా విశాలంగా ఉంటాయని ఆయన చెప్పారు ఎక్కువ స్థలం విడిచి పెట్టడం వల్ల రైలులో సాఫీగా నడవడానికి వీలుంటుందని శ్రీనివాస్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో త్వరగా తెరుచుకునేలా కిటికీలు మరియు తలుపులను రూపొందించారు. ప్రయాణీకుల సౌకర్యార్థం ప్రవేశద్వారం వద్ద ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, కంపార్ట్ మెంట్ ప్రాంతంలో టచ్ ఫ్రీ డోర్లు ఏర్పాటు చేయనున్నారు.
శీతాకాలంలో మరుగుదొడ్లలో వేడినీటిని అందించేందుకు ఈ బోగీల్లో ప్రత్యేక ఫీచర్ ఏర్పాటుకు ఇంజినీర్లు పనిచేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో 24 బోగీలు అందుబాటులోకి వస్తాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రెండు రైళ్లకు సరిపడా బోగీలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మొదటగా హెరిటేజ్ కల్కా-సిమ్లా మార్గంలో విస్టాడోమ్ కోచ్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసింది.
అయితే పూర్తి స్థాయిలో టెస్ట్‌రన్ నిర్వహించేందుకు రైల్వే సేఫ్టీ కమిషనర్ నుంచి క్లియరెన్స్ కోసం అధికారులు ఎందురు చూస్తున్నారు. అది వచ్చిన తర్వాత అధికారికంగా ట్రైన్‌ని నడపనున్నారు. క్లియరెన్స్ అనంతరం నారో గేజ్ సెక్షన్ లో ఈ కోచ్ లు నడవనున్నాయి.సేఫ్టీ క్లియరెన్స్ తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 30 విస్టాడోమ్ కోచ్లను RCF తయారు చేయనుంది.
2023 బడ్జెట్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రాజెక్ట్‌పై ప్రసంగించారు. EMUకి ప్రత్యామ్నాయంగా వందే మెట్రో మెయిన్‌లైన్‌ని తీసుకువస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఆర్సీఎఫ్‌లో భారతీయ రైల్వే కోసం ఇప్పటి వరకు 43,000 కోచ్లను తయారు చేసింది. ప్రస్తుతం టెక్నాలజీకి అనుగుణంగా దీనిని తయారు చేస్తుంది.


Click it and Unblock the Notifications








