Vande sadharan Trains వందే సాధారణ్ రైళ్ల ఫస్ట్ లుక్.. 1800 ప్రయాణం చేసేలా సౌకర్యాలు..!
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విజయవంతంగా నడుస్తున్నాయి. త్వరలో వందే భారత్ స్లీపర్, వందే భారత్ మెట్రో రైళ్లు కూడా పట్టాలు ఎక్కనున్నాయి. వందే భారత్ సాధారణ రైళ్లు కూడా త్వరలో అందుబాటులో రానున్నాయి. ఈ రైలు తొలి ర్యాక్ ICF- ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతుంది. ఈ అక్టోబర్ చివరి నాటికి ఆవిష్కరించాలని భావిస్తోంది.
ఈ వందే సాధారణ్ రైళ్లను (Vande sadharan Trains) తయారుచేసేందుకు రూ.65 కోట్లు వ్యయం అవుతుందని తెలుస్తోంది. ఈ రైళ్లు 22 కోచ్‌లను కలిగి ఉంటాయి. సెకండ్ క్లాస్, అన్‌రిజర్వడ్ కోచ్‌లు ఉంటాయి. ఇందులో 1800 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు ఉంటాయని తెలుస్తోంది. ఈ రైళ్లు గరిష్ట వేగం గంటకు 130 కి.మీలకు పరిమితం చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ వందే సాధారణ్ రైళ్లు.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) తరహా సదుపాయాలు కలిగి ఉంటాయి. నాన్ ఏసీ, అన్ రిజర్వడ్ ప్రయాణికులకు ఈ రైళ్లు సౌకర్యంగా ఉంటాయి. మరియు బయో టాయిలెట్లు, ఛార్జింగ్ పాయింట్లు, సీసీ టీవీ కెమెరాలు, అధునాతన లైటింగ్ వ్యవస్థ, ఆటోమేటిక్ డోర్లు వంటి సౌకర్యాలు ఉంటాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో పోలిస్తే తక్కువ ధరకే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.
ఈ వందే సాధారణ్ రైళ్లు రెండు వైపులా రెండు ఇంజిన్‌లను కలిగి ఉంటాయి. ఫలితంగా గమ్యస్థానాలకు చేరుకున్న అనంతరం రైళ్లను రివర్స్ చేయాల్సిన అవసరం లేదు. పుల్ అండ్ పుష్ ప్రాతిపదికన పనిచేస్తాయి. రైళ్లు ప్రయాణంలో కుదుపులు నివారించేందుకు శాశ్వత కప్లర్స్‌ను వినియోగిస్తారు. ఫలితంగా సౌకర్యవంతమైన ప్రయాణం సొంతమవుతుంది.

ఈ వందే సాధారణ్ రైళ్లలో నాన్ ఏసీ సెకండ్ క్లాస్ కోచ్‌లు, నాన్ ఏసీ స్లీపర్ కార్లు, లగేజ్ వ్యాన్లు సహా మరెన్నో ఉంటాయి. ఈ రైలు టెస్టింగ్ ఈ నెల చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
* కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవలే వందే భారత్ స్లీపర్ వెర్షన్‌ను ఫొటోలను కూడా విడుదల చేశారు. ఫోటోలు ఆధారంగా రైలు ఇంటీరియర్ అత్యంత శుభ్రంగా, సౌకర్యవంతంగా, విలాసవంతంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. లైటింగ్ వ్యవస్థ కూడా చాలా అధునాతనంగా ఉంది. బెర్త్‌ల మధ్య ఖాళీ కూడా సౌకర్యవంతమైన స్థాయిలో ఉంది. మొత్తంగా ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే.. మెరుగైన అనుభూతిని పొందుతారు.

ప్రస్తుతం ఉన్న సాధారణ రైళ్లకు ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్లు అదనంగా నడవనున్నాయి. రాత్రిపూట, దూర ప్రాంత ప్రయాణాలకు ఇవి ఈ హైస్పీడ్ రైళ్లు అనుకూలంగా ఉండనున్నాయి. ఈ రైళ్లు 16 బోగీలను కలిగి ఉంటాయి. గరిష్ఠంగా గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించేలా వీటిని రూపొందిస్తున్నారు.
వందేభారత్ స్లీపర్ రైళ్లలో గరిష్ఠంగా 887 మంది ప్రయాణం చేయవచ్చు. మొత్తం 75 వందే భారత్ ర్యాక్‌లు చైర్ కార్ వెర్షన్‌గా మిగిలినవి స్లీపర్ వెర్షన్‌గా ఉండనున్నాయి. మొత్తం మూడు టెక్నాలజీల్లో 400 వందే భారత్ స్లీపర్ వెర్షన్‌లను తయారు చేసేందుకు భారీతీయ రైల్వే శాఖ ప్రణాళికలు వేస్తోంది. ఇందుకు టెండర్లను పిలిచినట్లు తెలుస్తోంది. దీనికి అదనంగా 2023-24 బడ్జెట్‌లో 8000 వందే భారత్ కోచ్‌లకు ప్రాతిపాదనలున్నాయి.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అధునాత సెమీ లైట్ స్పీడ్ రైళ్లు ద్వారా ప్రయాణికులకు కొత్త ప్రయాణ అనుభూతిని అందించడమే లక్ష్యంగా రైల్వే శాఖ నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. వేగం సహా భద్రతా ఈ రైళ్ల ప్రధానంగా కలిగి ఉంటాయి. ప్రపంచస్థాయి ఫీచర్లతో మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే ఈ రైళ్ల ముఖ్య ఉద్దేశం.


Click it and Unblock the Notifications








