గోపాల గోపాల చిత్రంలో పవన్ కళ్యాన్ బైక్‌ని డిజైన్ చేసింది ఎవరు?

By Super

బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్, పరేష్ రావల్ ప్రధాన పాత్రలలో నటించిన 'ఓ మై గాడ్' చిత్రాన్ని తెలుగులోకి 'గోపాలా గోపాలా' అనే పేరుతో రీమేక్ చేసి, ఈనెల 10వ తేదీన విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ (శ్రీకృష్టుడి) పాత్రను పవన్ కళ్యాన్ పోషించగా, పరేష్ రావల్ (దుకాణదారు) పాత్రను వెంకటేష్ పోషిస్తున్నారు.

ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో పవన్ కళ్యాన్ ఉపయోగించిన కస్టమైజ్డ్ మోటార్‌సైకిల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఓ మై గాడ్ చిత్రంలో అక్షయ్ కుమార్ కోసం ఓ బైక్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. అలాగే, గోపాలా గోపాల చిత్రంలో కూడా పవన్ కళ్యాన్ కోసం ఓ బైక్‌ను డిజైన్ చేయించారు. మరి ఈ బైక్‌ను డిజైన్ చేసింది ఎవరో తెలుసా..? అది ఎవరో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

పవన్ కళ్యాన్ బైక్ డిజైనర్ ఎవరు?

గోపాల గోపాల చిత్రంలో పవన్ కళ్యాన్ ఉపయోగించిన చోపర్ స్టయిల్ బైక్‌ను ముంబైకి చెందిన కస్టమ్ బైక్ మేకర్ వర్డెంచి (Vardenchi) డిజైన్ చేసింది.

పవన్ కళ్యాన్ బైక్ డిజైనర్ ఎవరు?

ప్రముఖ నటి సమీరా రెడ్డి భర్త ఆకాషి వర్డెకి చెందినదే ఈ 'వర్డెంచి మోటార్‌సైకిల్స్' సంస్థ. వర్డెంచి ఇప్పటికే అనేక రకాల కస్టమైజ్డ్ మోటార్‌సైకిళ్లను తయారు చేసింది.

పవన్ కళ్యాన్ బైక్ డిజైనర్ ఎవరు?

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కృష్ణుడి పాత్ర పోషించిన నేపథ్యంలో, ఆ థీమ్‌కు మ్యాచ్ అయ్యేలా ఈ బైక్‌ను నీలిరంగులో పెయింట్ చేశారు. ఫ్యూయెల్ ట్యాంక్‌పై నెమలి పించాన్ని డిజైన్ చేశారు.

పవన్ కళ్యాన్ బైక్ డిజైనర్ ఎవరు?

ఈ బైక్‌లోని ప్రతి భాగాన్ని ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు. ఈ బైక్‌ను కేవలం ఒక్క నెలలోనే తయారు చేశామని, తాము అత్యంత వేగంగా తయారు చేసిన మోటార్‌సైకిళ్లలో ఇది కూడా ఒకటి ఆకాషి వర్డె తెలిపారు.

లెజెండ్ బైక్

లెజెండ్ బైక్

ఇదివరకు నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా, బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన 'లెజండ్' చిత్రంలో బాలయ్య బాబు ఉపయోగించిన లెజెండ్ బైక్‌ను కూడా వర్డెంచి మోటార్‌సైకిల్ కంపెనీనే డిజైన్ చేసింది.. లెజెండ్ చిత్రంలోని ఆ బైక్ మంచి పాపులరాటీని దక్కించుకుంది.

More from DriveSpark

Article Published On: Monday, January 12, 2015, 16:28 [IST]
English summary
Actress Sameera Reddy’s husband and the owner of the custom bike company Vardenchi Mr. Akshai Varde has been in the news recently for the custom made chopper in the Pawan Kalyan - Venkatesh starrer, Gopala Gopala.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+