డ్రైవింగ్ లైసెన్స్ రకాలు.. ఏ లైసెన్స్‌తో ఏ వాహనాన్ని నడపవచ్చు.. ఇప్పుడే తెలుసుకోండి

భారతదేశంలో ప్రజా రహదారులపై వాహనాన్ని నడపాలంటే తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలి. ఈ లైసెన్స్ పొందాలంటే ఉండాల్సిన నిర్దిష్ట వయసు 18 సంవత్సరాలు. దాదాపు ఈ విషయాలు గురించి అందరికి తెలిసే ఉంటాయి. కానీ దేశంలోని వివిధ రకాల వాహనాలను నడపడానికి వివిధ రకాల డ్రైవింగ్ లైసెన్సులు అవసరం.

డ్రైవింగ్ లైసెన్స్ ఎన్ని రకాలు.. ఏ లైసెన్స్‌తో ఏ వాహనాన్ని నడపవచ్చు.. ఇప్పుడే తెలుసుకోండి

సాధారణంగా కార్లు లేదా బైక్‌ల వంటి వాటి కోసం డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇవ్వబడతాయి. కానీ ఈ డ్రైవింగ్ లైసెన్సులుతో హెవీ వాహనాలను అంటే ట్రక్కులు లేదా ట్రాలీలు వంటి వాహనాలను నడపడానికి ఉపయోగించబడవు. వాణిజ్య వాహనాన్ని నడపడానికి ప్రైవేట్ వాహనం కోసం జారీ చేసిన లైసెన్స్‌ను ఉపయోగించడం చట్టవిరుద్ధం.

అయితే ఇలాంటి వాహనాలను నడపడానికి ఎలాంటి లైసెన్సులు పొందాలి, అనే విషయాన్ని గురించి క్లుప్తంగా ఈ వారికి లో తెలుసుకుందాం.. రండి.

డ్రైవింగ్ లైసెన్స్ ఎన్ని రకాలు.. ఏ లైసెన్స్‌తో ఏ వాహనాన్ని నడపవచ్చు.. ఇప్పుడే తెలుసుకోండి

సాధారణంగా వివిధ రకాల వాహనాలను నడపడానికి 7 రకాల డ్రైవింగ్ లైసెన్స్‌లు జరీ చేయబడతాయి. ఈ 7 రకాల డ్రైవింగ్ లైసెన్సుల విషయానికి వస్తే,

ఎంసి 50 సిసి:

ఈ డ్రైవింగ్ లైసెన్స్ తక్కువ ఇంజిన్ పవర్ ఉన్న వాహనాలను నడపడానికి జారీ చేయబడింది. వీటిలో స్కూటర్, బైక్ లేదా 50 సిసి లేదా అంతకంటే తక్కువ సామర్థ్యం గల మోపెడ్ బైక్ లను నడపడానికి పొందే డ్రైవింగ్ లైసెన్స్. మీరు 16 సంవత్సరాల వయస్సు తర్వాత ఈ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

డ్రైవింగ్ లైసెన్స్ ఎన్ని రకాలు.. ఏ లైసెన్స్‌తో ఏ వాహనాన్ని నడపవచ్చు.. ఇప్పుడే తెలుసుకోండి

ఎల్ఎంవి-ఎన్‌టి:

లైట్ మోటార్ వెహికల్(ఎన్‌టి) డ్రైవింగ్ లైసెన్స్‌తో ఏ రకమైన జీప్ లేదా మోటార్ కారునైనా నడపవచ్చు. కానీ ఈ లైసెన్స్ ద్వారా వాణిజ్య వాహనాలను నడపడం సాధ్యం కాదు. ఈ లైసెన్స్ వ్యక్తిగత వాహనాలకు మాత్రమే ఉపయోగించబడుతుంది.

టాక్సీ లేదా ఆటోలు వంటి వాహనాలు ఈ లైసెన్స్ ద్వారా నడపబడవు. ఎల్ఎంవి-ఎన్‌టి లైసెన్స్‌కు బైక్ లేదా స్కూటర్ కోసం ప్రత్యేక లైసెన్స్ అవసరం లేదు. మీకు ఈ లైసెన్స్ ఉంటే మీరు కారు, స్కూటర్ లేదా బైక్ కూడా నడపవచ్చు.

డ్రైవింగ్ లైసెన్స్ ఎన్ని రకాలు.. ఏ లైసెన్స్‌తో ఏ వాహనాన్ని నడపవచ్చు.. ఇప్పుడే తెలుసుకోండి

ఎఫ్‌విజి:

గేర్ లేకుండా ఉండే స్కూటర్ లేదా మోపెడ్ నడపడానికి ఈ లైసెన్స్ జారీ చేయబడుతుంది. ఈ వాహనాల ఇంజిన్ సామర్థ్యంతో సంబంధం లేకుండా దీనిని జారీ చేయడం జరుగుతుంది. ఈ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత మీరు గేర్ లేని ఎలక్ట్రిక్ మోపెడ్ లేదా స్కూటర్‌ను కూడా డ్రైవ్ చేయవచ్చు.

డ్రైవింగ్ లైసెన్స్ ఎన్ని రకాలు.. ఏ లైసెన్స్‌తో ఏ వాహనాన్ని నడపవచ్చు.. ఇప్పుడే తెలుసుకోండి

ఎంసి ఈఎక్స్ 50సిసి:

ఈ లైసెన్స్ బైక్, స్కూటర్ లేదా 50 సిసి లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల మోపెడ్‌ను నడపడానికి పొందే డ్రైవింగ్ లైసెన్స్. ఈ లైసెన్స్ ఎంసి 50సిసి లైసెన్స్‌కు భిన్నంగా ఉంటుంది. గేర్‌తో 50 సిసి కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌లకు ఈ లైసెన్స్ మంజూరు చేయబడింది.

డ్రైవింగ్ లైసెన్స్ ఎన్ని రకాలు.. ఏ లైసెన్స్‌తో ఏ వాహనాన్ని నడపవచ్చు.. ఇప్పుడే తెలుసుకోండి

ఎంసిడబ్ల్యుజి:

ఈ లైసెన్స్ పొందిన తర్వాత మీరు బైక్, స్కూటర్ లేదా మోపెడ్‌ని గేర్‌తో లేదా లేకుండా డ్రైవ్ చేయవచ్చు. ఈ లైసెన్స్ జారీ చేసినప్పుడు ఇందులో ఇంజిన్ సామర్థ్య పరిమితి ఉండదు. ఈ లైసెన్స్ పొందిన తరువాత మీరు ఏదైనా సామర్థ్యం గల ఇంజిన్‌తో బైక్‌ను రైడ్ చేయవచ్చు.

డ్రైవింగ్ లైసెన్స్ ఎన్ని రకాలు.. ఏ లైసెన్స్‌తో ఏ వాహనాన్ని నడపవచ్చు.. ఇప్పుడే తెలుసుకోండి

హెచ్‌జిఎంవి:

హెచ్‌జిఎంవి అంటే హెవీ గూడ్స్ మోటార్ వెహికల్ లైసెన్స్ లారీలు మరియు ట్రాన్స్‌పోర్టర్స్ వంటి భారీ వాహనాలను నడపడానికి జారీ చేయబడుతుంది. ఈ లైసెన్స్ వాణిజ్యపరమైన ఉపయోగం కోసం మాత్రమే ఉపయోగించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇవి హెవీ వెహికల్స్ నడపడానికి ఉపయోగించబడే లైసెన్సులు.

డ్రైవింగ్ లైసెన్స్ ఎన్ని రకాలు.. ఏ లైసెన్స్‌తో ఏ వాహనాన్ని నడపవచ్చు.. ఇప్పుడే తెలుసుకోండి

హెచ్‌పిఎంవి:

ఈ లైసెన్స్ వాణిజ్య వాహనాలను నడపడానికి మరియు భారతదేశమంతటా లైసెన్స్ పొందిన ప్యాసింజర్ వాహనాలకు అవసరం. ఈ లైసెన్స్ పొందడానికి మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. కానీ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వయో పరిమితి 20 సంవత్సరాలుగా నిర్ణయించబడింది.

డ్రైవింగ్ లైసెన్స్ ఎన్ని రకాలు.. ఏ లైసెన్స్‌తో ఏ వాహనాన్ని నడపవచ్చు.. ఇప్పుడే తెలుసుకోండి

వాహనాలను నడిపే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పైన తెలిపిన డ్రైవిం లైసెన్సుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకునప్పుడే ఎవరు ఏ వాహనాన్ని డ్రైవింగ్ చేయడానికి ఎలాంటి లైసెన్స్ పొందాలి అనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు.

NOTE: ఇక్కడ ఉపయోగించిన ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే

Most Read Articles

English summary
Various Kinds Of Driving Licenses In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X