ప్రపంచంలోనే ఇలాంటి ఎలక్ట్రిక్‌ బస్‌ లేదు.. హైదరాబాద్‌-బెంగళూరు రూట్‌లోనే తొలి సర్వీస్‌!

గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌, ఎలక్ట్రిక్ కార్లను విరివిగా వినియోగిస్తున్నారు. ఎలక్ట్రిక్‌ బస్సుల వినియోగం కూడా ఊపందుకుంటోంది. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రజా రవాణాలో ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులను ఎక్కువగా ప్రవేశపెడుతున్నాయి. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ విభాగంలో ఫస్ట్‌ ప్లేస్‌లో టూ-వీలర్స్‌ ఉండగా.. రెండో స్థానంలో కార్లు, ఆ తర్వాత ఎలక్ట్రిక్‌ బస్సులే ఎక్కువగా సేల్‌ అవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రేదశ్‌ల లోనూ సుదూర ప్రయాణాల కోసం వివిధ ఫేమస్‌ నగరాలకు ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నారు. కానీ ఎలక్ట్రిక్ బస్సుల్లో ఎక్కువ దూరం ప్రయాణించడానికి ప్రయాణికులు కాస్త విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే వీటిలో ప్రయాణం ఎంచుకోవడం వల్ల సమయం వృధా అవుతుందని భావిస్తున్నారు. ఛార్జింగ్ పెట్టడానికి ఆగిన బస్సులు దాదాపు గంటకు పైనే బ్యాటరీ ఫుల్‌ అయ్యే వరకు ఆగిపోవడమే ఇందుకు కారణమని తెలిసింది. అయితే మరికొందరు సాంప్రదాయ బస్సుల వలె ఎక్స్‌పీరియన్స్‌ని అందించడం లేదని మరికొందరి వాదన. అయితే ఛార్జింగ్‌ సమస్యను పరిష్కరించేందుకు బెంగళూరులో సరికొత్త అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సును ప్రవేశపెట్టారు. ఈ ఎలక్ట్రిక్ బస్సు విశేషాలు మీకోసం..

World s Fastest Charging Veera Mahasamrat Electric Bus

వీర మహాసామ్రాట్ (Veera Samrat) పేరుతో ఈ ఎలక్ట్రిక్ బస్సును లాంచ్ చేశారు. వీర వాహన, ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ (Exponent Energy) సంయుక్తంగా వీర మహాసామ్రాట్ ఎలక్ట్రిక్ బస్సును బెంగళూరులో ప్రారంభించాయి. ఈ బస్సులో ప్రయాణించడం వల్ల రెగ్యూలర్ బస్సుల కంటే మీరు ముందుగానే గమ్యాన్ని చేరుకుంటారు. అది దీని స్పెషాలిటీ. ఎందుకంటే ఈ బస్సులు ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో రానున్నాయి.

ఈ ఎలక్ట్రిక్ బస్సు 320 కిలోవాట్ల బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకసారి బ్యాటరీని పూర్తిగా నింపడానికి కేవలం 15 నిమిషాలు పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ బస్సు ఇదే కావడం గమనార్హం. ఈ ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీని ఛార్జ్ చేయడానికి పట్టే సమయం రెగ్యూలర్‌ బస్సుల్లో డీజీల్‌ నింపే సమయంతో సమానంగా ఉంటుంది. అంతరాయం లేని ప్రయాణాన్ని అందించేందుకు ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సును ప్రవేశపెట్టింది.

World s Fastest Charging Veera Mahasamrat Electric Bus

వీర మహాసామ్రాట్ ఎలక్ట్రిక్ బస్సు సాధారణ ఐసీఈ బస్సు కంటే ఖర్చులోనూ 30 శాతం తక్కువగా ఉంటుంది. తొలుత వీర మహాసామ్రాట్ ఎలక్ట్రిక్ బస్సును హైదరాబాద్-బెంగళూరు మార్గంలో మాత్రమే నడపనున్నారు. అతి త్వరలోనే ఈ సర్వీసులను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టనున్నట్లు వీర మహాసామ్రాట్ బస్సు యాజమాన్యం తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ బస్సును భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో క్విక్ ఛార్జింగ్ కోసం ఉపయోగించాలని నిర్ణయించారు. ఇదే జరిగితే ప్రయాణికులకు ఎంతో మేలు జరగనుంది.

డ్రైవ్స్‌పార్క్ కాన్సెప్ట్: వీర మహాసామ్రాట్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఛార్జింగ్ అయ్యే ఎలక్ట్రిక్ బస్సుగా ప్రత్యేకత సాధించింది. దీనిని మోడల్‌గా చేసుకుని ఇతర కంపెనీలు సైతం ఇలాంటి ఉత్పత్తులను త్వరలోనే తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ బస్సును భారతదేశంలో లాంచ్ చేయడం నిజంగా శుభవార్తే అని చెప్పాలి. జనాలకు ఎలక్ట్రిక్‌ బస్సులపై ఉన్న అపోహను ఈ వీర మహాసామ్రాట్ చెరిపివేసింది. జనాల్లో ఈ బస్సుకి ఆదరణ లభించాలని కోరుకుంటున్నాం.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, September 5, 2024, 19:12 [IST]
English summary
Veera mahasamrat worlds fastest charging ev bus details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+