జేమ్స్ బాండ్ నో టైమ్ టు డై చిత్రంలో ఉపయోగించిన 60 కార్లకు వేలం.. మైండ్ బ్లాంక్ అయ్యే ధరలు..

జేమ్స్ బాండ్ (James Bond) అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరేమో. హాలీవుడ్ చిత్రాలలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గా ఎన్నో సాహసాలు చేసే జేమ్స్ బాండ్ అంటే, చిన్నారుల నుండి పెద్ద వాళ్ల వరకూ అందరికీ ఇష్టమే. జేమ్స్ బాండ్ చిత్రాలలో ఆ పాత్రధారి ఉపయోగించే కార్లు మరియు గ్యాడ్జెట్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి వాహనాలు మనకి కూడా లభిస్తే బాగుంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వారి కోసం సినీ నిర్మాతలు బాండ్ చిత్రాలలో ఉపయోగించిన వాహనాలను ప్రత్యేకంగా వేలం వేస్తుంటారు.

జేమ్స్ బాండ్ నో టైమ్ టు డై చిత్రంలో ఉపయోగించిన 60 కార్లకు వేలం.. మైండ్ బ్లాంక్ అయ్యే ధరలు..

అరుదైన వాహనాలు అందులోనూ జేమ్స్ బాండ్ వాహనాలు కావడంతో ఇవి వేలంలో కోట్లాది రూపాయల వెల పలుకుతాయి. జేమ్స్ బాండ్ తాజా చిత్రమైన నో టైమ్ టు డై (No Time To Die) లో ఉపయోగించిన స్టంట్ కార్లు యూకేలో వేలం వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఈ చిత్రంలో ఉపయోగించిన దాదాపు 60 కార్లను వేలం వేయనున్నారు. వీటిలో కొన్ని అసాధారణమైన అధిక ధరలకు అమ్ముడయ్యే అవకాశం ఉంది. ఈ కార్లలో ల్యాండ్ రోవర్ డిఫెండర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్ మరియు జాగ్వార్ ఎక్స్ఎఫ్ మోడళ్లు కూడా ఉన్నాయి.

జేమ్స్ బాండ్ నో టైమ్ టు డై చిత్రంలో ఉపయోగించిన 60 కార్లకు వేలం.. మైండ్ బ్లాంక్ అయ్యే ధరలు..

చలనచిత్ర నిర్మాణ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన మూవీ ఫ్రాంచైజీలలో జేమ్స్ బాండ్ కూడా ఒకటి. ఈ చిత్రాలు పూర్తిగా యాక్షన్ తో నిండిన సన్నివేశాలకు ప్రసిద్ధి చెందడమే కాకుండా, జేమ్స్ బాండ్ చలనచిత్రాలు కొన్ని అత్యంత సున్నితమైన కార్లను మరియు కొన్నిసార్లు మోటార్‌సైకిళ్లను కూడా ఉపయోగించడంలో బాగా ప్రసిద్ధి చెందాయి. గతంలో జేమ్స్ బాండ్ ఉపయోగించిన కార్లలో కొన్ని ఇప్పటికీ ఖరీదైన మ్యూజియంలో అరుదైన ఆటోమోటివ్ కళాఖండాలుగా ప్రదర్శించబడుతున్నాయి.

జేమ్స్ బాండ్ నో టైమ్ టు డై చిత్రంలో ఉపయోగించిన 60 కార్లకు వేలం.. మైండ్ బ్లాంక్ అయ్యే ధరలు..

గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'నో టైమ్ టు డై' అనే జేమ్స్ బాండ్ చిత్రంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లు కీలక పాత్ర పోషించాయి. ఈ చిత్రంలోని అనేక యాక్షన్ సీక్వెన్స్ లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లు ఉపయోగించబడ్డాయి. వీటిలో అతిపెద్దవి బ్లాక్ కలర్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీలు. ఈ ఎస్‌యూవీలు జంప్‌లు, రోలింగ్ ఓవర్, క్రాష్ మరియు హై-స్పీడ్ చేజ్ సీక్వెన్స్‌లను రోడ్డుపై మరియు ఆఫ్-రోడ్‌లో ప్రదర్శించడం వంటివి కనిపించాయి.

జేమ్స్ బాండ్ నో టైమ్ టు డై చిత్రంలో ఉపయోగించిన 60 కార్లకు వేలం.. మైండ్ బ్లాంక్ అయ్యే ధరలు..

నిజానికి, నో టైమ్ టు డైలో ఉపయోగించిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీలు చాలా ప్రత్యేకమైనవి, ఎందుకంటే అవి ఫ్యాక్టరీ నుండి నేరుగా చిత్రీకరణ సెట్‌లకు వెళ్లాయి. వాటిపై ప్రత్యేకమైన 007 ఛాస్సిస్ సిరీస్‌ కూడా ఉంటుంది. కాబట్టి, ఇవి చాలా విలువైనవిగా పరిగణించబడుతాయి. ఈ ఎస్‌యూవీలు వేలంలో సుమారు 5,00,000 పౌండ్ల (రూ. 4.81 కోట్లు) వరకు ధర పలుకుతాయని అంచనా.

జేమ్స్ బాండ్ నో టైమ్ టు డై చిత్రంలో ఉపయోగించిన 60 కార్లకు వేలం.. మైండ్ బ్లాంక్ అయ్యే ధరలు..

నో టైమ్ టు డై చిత్రీకరణలో ల్యాండ్ రోవర్ సిరీస్ నుండి మరో ఐకానిక్ వాహనం కూడా ఉపయోగించబడింది. అదే రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌విఆర్. ఇందులో శక్తివంతమైన వి8 సూపర్‌ఛార్జ్డ్ ఇంజన్ ఉంటుంది. స్టాండర్డ్ వెర్షన్ ఎస్‌విఆర్ ధర దాదాపు 1,20,000 పౌండ్లు (రూ. 1.15 కోట్లు) వరకు ఉండవచ్చని అంచనా. ఈ చిత్రంలోని కొన్ని యాక్షన్-ప్యాక్డ్ చేజ్ సీక్వెన్స్‌లలో కొన్ని జాగ్వార్ ఎక్స్ఎఫ్ సెడాన్‌లు కూడా కనిపిస్తాయి. ఈ సెడాన్‌లు 70,000 పౌండ్ల (రూ. 67 లక్షలు) వరకు వేలం వేయవచ్చని భావిస్తున్నారు.

జేమ్స్ బాండ్ నో టైమ్ టు డై చిత్రంలో ఉపయోగించిన 60 కార్లకు వేలం.. మైండ్ బ్లాంక్ అయ్యే ధరలు..

బాండ్ కార్లతో పాటు మరో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 వి8 బాండ్ ఎడిషన్ కూడా వేలం వేయబడుతుంది. అయితే దీన్ని సినిమాలో ఉపయోగించలేదు. కాకపోతే, ఈ కారును ప్రత్యేకంగా జేమ్స్ బాండ్ థీమ్ తో తయారు చేశారు. వేలంలో ఈ కారు ధర సుమారు 3,00,000 పౌండ్ల (రూ. 2.88 కోట్లు) వరకు వెళ్లవచ్చని అంచనా. ఈ వేలాన్ని లండన్‌లోని క్రిస్టీస్‌ సంస్థ నిర్వహిస్తుంది. ఈ వేలంలో విక్రయించబడే డిఫెండర్ యొక్క మొదటి కొన్ని యూనిట్ల నుండి వచ్చే ఆదాయాన్ని రెడ్‌క్రాస్‌కు ఛారిటీగా ఇవ్వబడుతుందని సమాచారం.

జేమ్స్ బాండ్ నో టైమ్ టు డై చిత్రంలో ఉపయోగించిన 60 కార్లకు వేలం.. మైండ్ బ్లాంక్ అయ్యే ధరలు..

ఈ విషయం గురించి జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లోని వెహికల్ ప్రోగ్రామ్‌ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిక్ కాలిన్స్ మాట్లాడుతూ "నో టైమ్ టు డైలో డిఫెండర్, రేంజ్ రోవర్ మరియు జాగ్వార్ కార్లు యాక్షన్‌ సీక్వెన్స్ లో తమ సత్తా చాటాయి. ప్రతి కారు జేమ్స్ బాండ్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన భాగాన్ని సూచిస్తుంది. కార్ కలెక్టర్లు వీటిని స్వంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతారని మరియు వారి విక్రయం ద్వారా మా స్వచ్ఛంద భాగస్వాములకు మద్దతు ఇవ్వగలిగినందుకు మేము సంతోషిస్తున్నామని ఆయన అన్నారు.

జేమ్స్ బాండ్ నో టైమ్ టు డై చిత్రంలో ఉపయోగించిన 60 కార్లకు వేలం.. మైండ్ బ్లాంక్ అయ్యే ధరలు..

జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, టాటా మోటార్స్ అధీనంలో ఉన్న ఈ బ్రిటిష్ లగ్జరీ కార్ బ్రాండ్ ఇటీవలే భారత మార్కెట్లో తమ కొత్త 2022 మోడల్ రేంజ్ రోవర్ స్పోర్ట్‌ (2022 Range Rover Sport) ఎస్‌యూవీ విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ లగ్జరీ ఎస్‌యూవీ ధర రూ.1.64 కోట్లు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. - ఈ ఎస్‌యూవీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Vehicles used in no time to die movie to be sold in auction
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X