ఘన వీడ్కోలు అందుకున్న 'మారుతి జిప్సీ'.. పూర్తి వివరాలు

'రిటైర్మెంట్' అనే మాట వినగానే ఏదైనా సంస్థలో చాలా రోజులు పాటు సేవలందించిన ఒక వ్యక్తి పొందే పదవి విరమణ అని గుర్తొస్తుంది. ఒక వ్యక్తి సంస్థలో పని చేసి రిటైర్మెంట్ అయ్యే రోజు కూడా సాధారంగా గౌరవించి పంపడం ఆనవాయితీ. ఈ రిటైర్మెంట్ పదం ఒక్క మనుషులకు మాత్రమే కాదు ఒక కారుకు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇది వినడానికి కొంత కొత్తగా ఉన్నప్పటికీ నిజమే. ఇంతకీ దీని సంగతేంటో ఈ ఆర్టికల్ లో చూద్దాం రండి.

ఘన వీడ్కోలు అందుకున్న 'మారుతి జిప్సీ'.. పూర్తి వివరాలు

నివేదికల ప్రకారం తమిళనాడు రాష్ట్రానికి చెందిన వేలూరులోని ఒక పోస్టాఫీసులో దాదాపు 22 సంవత్సరాలు సేవలందించిన మారుతి కంపెనీ యొక్క జిప్సీ కారుకి అక్కడ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ మారుతి జిప్సీ రెండు దశాబ్దాలుగా పోస్ట్ఆఫీస్ సూపరింటెండెంట్ తనిఖీ వాహనంగా ఉపయోగిస్తున్నారు.

ఘన వీడ్కోలు అందుకున్న 'మారుతి జిప్సీ'.. పూర్తి వివరాలు

ఈ మారుతి జిప్సీని 1999 మార్చి 24 న ఈ విభాగం కొనుగోలు చేసింది. కొనుగోలు చేసినప్పటి నుంచి కూడా దాదాపు 25 మంది పోస్టాఫీస్ సూపరింటెండెంట్లు ఉపయోగించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కారుకి ఎటువంగతి ప్రమాదం జరగలేదు. ఈ కారణంగా పోస్టాఫీస్ సిబ్బంది ఇది మా విభాగానికి చాలా అనువైన వాహనం అని కొనియాడారు.

ఘన వీడ్కోలు అందుకున్న 'మారుతి జిప్సీ'.. పూర్తి వివరాలు

ఈ జిప్సీ కారుని ప్రధానంగా జిల్లాలోని కొండ ప్రాంతాల్లోని పోస్టాఫీసులను సందర్శించడానికి ఉపయోగించారు. జిప్సీ వీడ్కోలు కార్యక్రమంలో వెల్లూరు పోస్టాఫీసు అధికారులు హాజరయ్యారు. వీడ్కోలు కార్యక్రమంలో వాహనానికి పూల మాలలు వేశారు. అంతే కాకుండా ఈ సందర్భంగా అందరికీ స్వీట్లు కూడా పంచారు. దీనికి సంబంధించి ఫోటోలు మీరు ఇక్కడ గమనించవచ్చు.

ఘన వీడ్కోలు అందుకున్న 'మారుతి జిప్సీ'.. పూర్తి వివరాలు

ప్రభుత్వం ఇటీవల తెలిపిన మోటార్ వాహన చట్టం ప్రకారం వాహనాలు 15 కంటే ఎక్కువ వయసు ఉన్నట్లయితే వాటిని వినియోగించకూడదు. కావున ఇప్పుడు ఈ మారుతి జిప్సీ వినియోగం నుంచి తీసివేస్తారు.

ఘన వీడ్కోలు అందుకున్న 'మారుతి జిప్సీ'.. పూర్తి వివరాలు

మారుతి సుజుకి కంపెనీ యొక్క ఈ జిప్సీ నిజంగా ఎంతోమంది వాహన ప్రియులను ఆకట్టుకున్న మంచి వాహనం. ఇది ఏకంగా 34 సంవత్సరాలుగా దేశంలో ఎంత ఆదరణ పొందింది. అయితే ఈ మారుతి సుజుకి జిప్సీ 2019 మార్చిలో నిలిపివేయబడింది. మారుతి సుజుకి నుండి వచ్చిన ఈ జిప్సీ ఆఫ్ రోడ్ ప్రేమికులకు ఇష్టమైన మినీ ఎస్‌యూవీ.

ఘన వీడ్కోలు అందుకున్న 'మారుతి జిప్సీ'.. పూర్తి వివరాలు

మారుతి జిప్సీని మొట్టమొదట భారత మార్కెట్లో 1985 లో ప్రారంభించారు. మారుతి సుజుకి జిప్సీ విడుదలైనప్పటి నుండి 34 సంవత్సరాలుగా భారత మార్కెట్లో అందుబాటులో ఉంది. చాలా సందర్భాల్లో ఘోర ప్రమాదం జరిగినప్పుడు, అన్ని వాహనాలకు కనీస భద్రతా ప్రమాణాన్ని పాటించాలని కార్ల తయారీదారులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

ఘన వీడ్కోలు అందుకున్న 'మారుతి జిప్సీ'.. పూర్తి వివరాలు

కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన కొత్త నియమాల ప్రకారం మారుతి సుజుకి కనీస భద్రతా ప్రమాణం తప్పనిసరి అయినప్పటి నుండి దీనిలో కొన్ని మార్పులు చేసింది. కానీ భద్రతా ప్రమాణాల దృష్ట్యా క్రాష్ టెస్ట్ లో విఫలమైన కారణంగా ఈ జిప్సీ కారు ఉత్పత్తి నిలిపివేయాల్సి వచ్చింది.

ఘన వీడ్కోలు అందుకున్న 'మారుతి జిప్సీ'.. పూర్తి వివరాలు

మారుతి సుజుకి జిప్సీకి, బదులుగా మారుతి సుజుకి కంపెనీ జిమ్నీ ఎస్‌యూవీ భారతదేశంలో ప్రారంభించాలని యోచిస్తోంది. 2020 ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి జిమ్మీ మినీ-ఎస్‌యూవీ ప్రతిష్టాత్మక 2019 వరల్డ్ అర్బన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. దీని కోసం ఎంతోమంది కస్టమర్లు వేచి చూస్తున్నారు. ఇది కూడా ఆఫ్ రోడ్ ప్రేమికులకు ఇష్టమైన వాహనం.

Source: The Hindu

Most Read Articles

English summary
Vellore Postal Staff Bids Farewell To Maruti Gypsy. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X