హోండా యాక్టివాలో చేరిన కోబ్రా, చివరికి ఏమైందంటే.. ?

సాధారణంగా వాహనాలలో అప్పుడప్పుడు కొన్ని విషపూరితమైన తేళ్లు , పాములు చేరతాయి. వాహనదారులు దీనిని గమనించకుండా ప్రమాద భారిన పడే అవకాశం ఉంది. హెల్మెట్ ఉన్న పాముతో ప్రయాణించిన ఒక వ్యక్తి గురించి మనం ఇది వరకే తెలుసుకున్నాం. ఇప్పుడు ఏకంగా ఒక పాము హోండా యాక్టివాలో చేరింది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

హోండా యాక్టివాలో చేరిన కోబ్రా, చివరికి ఏమైందంటే.. ?

భారతదేశం లాక్ డౌన్ లో ఉన్న కారణంగా చాలా రోజులు ఒక హోండా యాక్టివా ఉపయోగంలో లేకుండా ఉంది. ఒక కోబ్రా ఈ హోండా హెడ్‌ల్యాంప్ కౌల్‌లోకి ప్రవేశించింది. హోండా యాక్టివా యొక్క హెడ్‌ల్యాంప్ కౌల్ లోపల చేరిన పాము చివరికి ఎలా రక్షించబడిందో మనం ఇక్కడ వీడియోలో చూడవచ్చు.

హోండా యాక్టివాలో చేరిన కోబ్రా, చివరికి ఏమైందంటే.. ?

అదృష్టవశాత్తు ఈ వాహనాన్ని వినియోగించకముందే ఆ పాము కనుగొనబడింది. వీడియోలో కనిపించే విధంగా మిర్రర్స్ అమర్చే చోట ఈ పాము గుర్తించబడింది. గుర్తించిన తరువాత ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి ఆ పాముని చాలా జాగ్రత్తగా ఇతరులకు హాని కలగనీయకుండా రియర్ వ్యూ మిర్రర్ మౌంట్ దగ్గర ఒక పెద్ద ప్లాస్టిక్ డబ్బా తెచ్చి దానిని ఓపెన్ చేసి పాము ముందర పెట్టడం ఇక్కడ మనం చూడవచ్చు. ఆ పాము నెమ్మదిగా ఆ ప్లాస్టిక్ డబ్బాలో చేరుతుంది. తరువాత ఆ అనుభవజ్ఞుడైన వ్యక్తి ప్లాస్టిక్ డబ్బా మూత బిగిస్తాడు.

MOST READ: శానిటైజేషన్ యూనిట్లుగా మారిన ముంబై పోలీస్ వ్యాన్లు

ఆ తరువాత పాముని దాని సహజ వాతావరణానికి తీసుకువెళ్లారు. అక్కడ వాటర్ బాటిల్ మూత ఓపెన్ చేశారు. పాము తలకు ఒక ప్లాస్టిక్ చుట్టుకుంది. ఏది ఏమైనా ఆ పాముకు ఉన్న ఆ ప్లాస్టిక్ ని ఎంతో నేర్పుగా తొలగించారు.

హోండా యాక్టివాలో చేరిన కోబ్రా, చివరికి ఏమైందంటే.. ?

పాము తల చుట్టూ చిక్కుకున్న ప్లాస్టిక్‌ను తొలగించడానికి వారు ఎంతో అపారమైన ధైర్యాన్ని చూపించారనేది నిజం అయితే, పాము కాటుకు గురికాకుండా ఉండటానికి వారు మాత్రమే అదృష్టవంతులు అని చెప్పాలి.

MOST READ: కరోనా ఎఫెక్ట్ : మే 3 వరకు రద్దు చేయబడిన ట్రైన్ సర్వీసులు

హోండా యాక్టివాలో చేరిన కోబ్రా, చివరికి ఏమైందంటే.. ?

సాధారణంగా పాములు వంటి విష పూరితమైన సరీసృపాలు వెచ్చని కంపైన్లు మరియు వెచ్చని ప్రదేశాలలో ఎక్కువగా చేరే అవకాశం ఉంది. లాక్ డౌన్ వ్యవధి ముగిసిన తర్వాత డ్రైవింగ్ తిరిగి ప్రారంభించే ముందు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండటానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. కాబట్టి వాహనదారులందరూ తమ వాహనాలను జాగ్రత్తగా పరిశీలించి తరువాత ఉపయోగించాలి.

Most Read Articles

English summary
Here’s How Cobra Was Rescued From Honda Activa. Read in Telugu.
Story first published: Wednesday, April 15, 2020, 13:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X