ప్రకాష్ రాజ్ కొనుగోలు చేసిన కొత్త కార్ ఇదే.. చూసారా..!!

ప్రకాష్ రాజ్ అంటే దాదాపు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమకు చెందిన ప్రకాష్ రాజ్ నటుడు, దర్శకుడు మరియు నిర్మాత. రంగస్థల నటుడిగా ప్రారంభమై ఆరు భాషల్లో దాదాపు రెండు వందల సినిమాలకు పైగా నటించిన విలక్షణ నటుడు. ఇటీవల ప్రకాష్ రాజ్ మహీంద్రా (Mahindra) కంపెనీకి చెందిన మహీంద్రా థార్ (Mahindra Thar) ఎస్‌యూవీ కొనుగోలు చేశారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ప్రకాష్ రాజ్ కొనుగోలు చేసిన కొత్త కార్ ఇదే.. చూసారా..!!

ప్రకాష్ రాజ్ కొత్త మహీంద్రా థార్ ఎస్‌యూవీని హైదరాబాద్‌లోని డీలర్‌షిప్‌లో తన కుటుంబంతో కలిసి కారును డెలివరీ చేసుకున్నారు. ప్రకాష్ రాజ్ మహీంద్రా థార్ యొక్క టాప్-ఎండ్ ఎల్ఎక్స్ ట్రిమ్‌ యొక్క ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్సన్ ఎంచుకున్నారు. ప్రకాష్ రాజ్ కొనుగోలు చేసిన ఈ ఎస్‌యూవీ నాపోలి బ్లాక్ కలర్‌లో అందించబడుతుంది.

ప్రకాష్ రాజ్ కొనుగోలు చేసిన కొత్త కార్ ఇదే.. చూసారా..!!

మహీంద్రా (Mahindra) గత ఏడాది అక్టోబర్‌లో థార్ (Thar) ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. మహీంద్రా థార్ ప్రారంభ ధర రూ. 12.79 లక్షల నుండి రూ. 15.09 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. భారతీయ SUV తయారీదారు మహీంద్రా నుండి విజయవంతమైన కొన్ని SUVలలో ఇది ఒకటి. ఇది గ్లోబల్ NCAPలో 4-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్‌ను కైవసం చేసుకుంది.

ప్రకాష్ రాజ్ కొనుగోలు చేసిన కొత్త కార్ ఇదే.. చూసారా..!!

భారతీయ మార్కెట్లో ఇప్పటికి కూడా ఎక్కువ డిమాండ్ ఉన్న ఎస్‌యూవీలలో మహీధ్ర థార్ కూడా ఒకటి. ఈ ఎస్‌యూవీ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. మహీంద్రా థార్ ప్రత్యేకంగా ఆఫ్-రోడింగ్ కోసం రూపొందించబడింది. ఇది షిఫ్ట్-ఆన్-ఫ్లై ట్రాన్స్‌ఫర్ కేస్‌తో 4x4 డ్రైవ్ ట్రైన్ మరియు మూడు మోడ్‌లను కలిగి ఉంది. అవి 2H, 4H మరియు 4L. ఈ SUV కి మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్, ఫ్రంట్ యాక్సిల్ కోసం ఎలక్ట్రిక్ డ్రైవ్‌లైన్ డిస్‌కనెక్ట్ మరియు బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్ కూడా ఉన్నాయి.

ప్రకాష్ రాజ్ కొనుగోలు చేసిన కొత్త కార్ ఇదే.. చూసారా..!!

కొత్త మహీంద్రా థార్ పాతదాని కంటే మరింత శక్తివంతమైనది, మెరుగైన రూపకల్పన మరియు మరిన్ని ఫీచర్లను కలిగి ఉంది. గ్లోబల్ NCAP ద్వారా 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇవ్వబడినందున, కొత్త థార్ ఇప్పుడు మునుపటి మోడల్ కంటే కూడా చాలా సురక్షితంగా ఉంది. ఇది LED DRLలు, అల్లాయ్ వీల్స్, హార్డ్ రూఫ్‌టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ISOFIX మౌంట్‌లతో ఫార్వర్డ్-ఫేసింగ్ రియర్ సీట్లను పొందుతుంది. మరియు Apple CarPlay మరియు Android Autoతో టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే వంటి లక్షణాలను పొందుతుంది.

ప్రకాష్ రాజ్ కొనుగోలు చేసిన కొత్త కార్ ఇదే.. చూసారా..!!

మహీంద్రా థార్‌ రెండు ఇంజిన్ ఆప్సన్లను కలియు ఉంటుంది. ఇందులో ఒకటి 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కాగా, మరొకటి 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

ప్రకాష్ రాజ్ కొనుగోలు చేసిన కొత్త కార్ ఇదే.. చూసారా..!!

2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 130 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్‌లు 6 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తాయి. రెండు ఇంజిన్లలో కూడా 4x4 ఎంపిక అందుబాటులో ఉంది.

ప్రకాష్ రాజ్ కొనుగోలు చేసిన కొత్త కార్ ఇదే.. చూసారా..!!

Mahindra Thar యొక్క 5-డోర్ల మోడల్ కూడా త్వరలో దేశీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని గురించి కంపెనీ ఇప్పటికే కొంత సమాచారం వెల్లడించింది. Mahindra Thar యొక్క 5-డోర్ల మోడల్ 2023-2026 మధ్య భారతదేశంలో ప్రారంభించబడుతుందని కంపెనీ తెలిపింది. ఇది థార్ యొక్క ప్రస్తుత మోడల్ కంటే పెద్దది మరియు ఎక్కువ ప్రీమియం ఫీచర్లతో ఉంటుంది.

ప్రకాష్ రాజ్ కొనుగోలు చేసిన కొత్త కార్ ఇదే.. చూసారా..!!

మహీంద్రా & మహీంద్రా భారతదేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్పేస్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకునే ప్రణాళికలను వెల్లడించింది. ఇందులో భాగంగానే కంపెనీ 2027 నాటికి 16 ఎలక్ట్రిక్ వాహనాలను (EVలు) విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. నివేదికల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఎలక్ట్రిక్ SUV మరియు తేలికపాటి వాణిజ్య వాహనాల విభాగాల్లో ఉంటాయి. కొత్తగా ప్రకటించిన ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎనిమిది బ్యాటరీతో నడిచే ఎస్‌యూవీలు ఉంటాయని మహీంద్రా తెలిపింది.

ప్రకాష్ రాజ్ కొనుగోలు చేసిన కొత్త కార్ ఇదే.. చూసారా..!!

వర్చువల్ కాన్ఫరెన్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజురికర్ మాట్లాడుతూ, 2027 నాటికి 13 కొత్త వాహనాలను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోందని, వాటిలో 8 ఎలక్ట్రిక్ SUVలు ఉంటాయని చెప్పారు. 2027 నాటికి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీల నుంచి 20 శాతం విక్రయాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మొత్తానికి మహీంద్రా తన ఉనికిని మరింత విస్తరించడానికి అన్ని సన్నాహాలు సిద్ధం చేస్తుంది.

Most Read Articles

English summary
Veteran actor prakash raj buys mahindra thar suv details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X