ఆర్మీలో ఉపయోగించే ఈ వాహనాన్ని చూశారా..? దీని మైలేజీ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

భారత ఆర్మీలో అప్పుడప్పుడు విభిన్న‌మైన వాహనాలను మనం చూస్తూ ఉంటాం. వాటిని చూసి.. 'అరే ఇదేదో భలే ఉందే' అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇలాంటివి 'ఎక్కడైనా కొనేందుకు దొరుకుతాయా' అని వెతికే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు అలాంటి ఒక ప్రత్యేక వాహనం భారత ఆర్మీ కోసం సిద్ధమైంది. అదే VFJ ట్రక్కు. VFJ అంటే.. వెహికల్ ఫ్యాక్టరీ జబల్‌పుర్ అని అర్థం. ఇక ఈ ట్రక్కు పూర్తి పేరు VFJ MPV 6X6. పేరులో ఎంపీవి అని చూసి ఇదేదో మనం రెగ్యులర్‌గా వాడే కారు అనుకుంటే పొరపడినట్టే! మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వాహనం విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

VFJ MPV 6X6 పేరులో ఎంపీవీ అంటే Mine Protected Vehicle అని అర్థం. తెలుగులో చెప్పాలంటే ఇది పేలుడు పదార్థాల నుంచి రక్షించే ఒక వాహనం. అందువల్ల యుద్ధాల్లో ఇది ధీటుగా ఎదుర్కొంటుంది. ఈ గ్రాండ్-లుకింగ్ వాహనాన్ని కఠినమైన రోడ్లపై, యుద్ధ వాతావరణాల్లో ఉపయోగించేందుకు తయారు చేశారు.

VFJ MPV 6X6 Truck in Indian Army

ఈ వాహనం సైనికులను వివిధ ప్రాంతాల్లోకి సురక్షితంగా ఇది తరలించగలుగుతుంది. గన్ ఫైర్, ల్యాండ్‌మైన్స్ నుంచి ఇది సైనికులను రక్షిస్తుంది. ఈ వాహనంలో 6 చక్రాలు ఉన్నాయి. వీటి ద్వారా ఇది అటవీ ప్రాంతాలు, పర్వతాలు, కఠినమైన ప్రాంతాల్లో ప్రయాణించడానికి వీలు పడుతుంది. కదనరంగంలోకి సైనికులను సురక్షితంగా తరలించే ఉద్దేశంతో దీన్ని తయారు చేశారు.

ఈ వాహనం టాప్‌పైన ఉన్న మెటల్ ప్యానెల్స్, విండోస్ బుల్లెట్ ప్రూఫ్‌గా ఉంటాయి. వీటి ద్వారా రక్షణ అందించే విషయంలో ఇది చక్కగా పనిచేస్తుంది. ఈ వాహనం అన్ని విషయాల్లోనూ మెరుగ్గానే ఉన్నట్లుగా చెప్పొచ్చు. అయితే ఒక్క విషయంలో మాత్రం కానే కాదు. అదే మైలేజీ. ఈ వాహనం లీటర్‌కు 1.6 కిలోమీటర్ల నుంచి 2.5 కిలోమీటర్ల వరకు మైలేజ్ మాత్రమే అందించగలదు.

ఇంతటి తక్కువ మైలేజ్ కారణంగా ఇది పర్వతప్రాంతాల్లో తప్ప సాధారణ రోడ్లపై నడపడానికి ఏమాత్రం ఉపయోగపడదు అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇదే వాహనాన్ని భారత ఆర్మీలో వినియోగిస్తున్నారు. దీని బరువు ఎంతుంటుందంటే‌.. 21.2 టన్నులుగా ఉంటుందని చెప్పవచ్చు. ఇది 1,500 టన్నుల వరకు బరువును మోసుకెళ్లగలదు. అందుకే ఇది ఇంత తక్కువ మైలేజీ అందిస్తోంది.

ఈ వాహనంలో లౌడ్ స్పీకర్స్, శత్రువులను గుర్తుపట్టేందుకు లైట్స్, బరువులు లాగేందుకు towing hooks, auxiliary lights, అనేక సంఖ్యలో అద్దాలు వంటివి ఉన్నాయి. అందువల్ల ఈ వాహనం సైనికులను తరలించడమే కాకుండా వివిధ రకాల పరిస్థితుల్లో కూడా ఉపయోగించడానికి అనువుగా ఉంటుంది. ఈ ట్రక్కు టైర్లు పంక్చర్ ‌ అయినా కూడా ప్రయాణిస్తాయి. దీని డోర్స్ అంత సులభంగా తెరుచుకోవు. వీటిని తెరిచేందుకు ఇందులో హైడ్రాలిక్ సిస్టం ఉంటుంది.

ఇందులో 10 మంది వరకు ప్రయాణించవచ్చు. అలాగే డ్రైవర్‌తో పాటు మరొక వ్యక్తి కూడా ఇందులో ప్రయాణించవచ్చు. దీంతో ఇందులో 10+2 సీట్స్ ఉంటాయి. అలాగే సైనికుల కోసం ఇందులో 3 tons of AC, రీడింగ్ లైట్, ట్యూబ్‌లైట్, ఆయుధాలు దాచుకునేందుకు గది కూడా ఉంటుంది. అలాగే ఈ VFJ MPV 6X6 ట్రక్కులో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ వ్యూ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఉంటాయి.

ఈ ట్రక్కు 7.9 లీటర్, 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్‌తో ఉంటుంది. ఇది 320 bhp పవర్, 1100 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. చాలామంది రోల్స్-రాయిస్ వంటి బ్రాండ్ల లగ్జరీ వాహనాలు తక్కువ మైలేజీ ఇస్తాయని అనుకుంటూ ఉంటారు. కానీ సైన్యంలో ఉపయోగించే వాహనాలు అంతకంటే తక్కువ మైలేజీని అందిస్తాయి. కానీ ఫర్పామెన్స్‌లో ఇవి అదరగొడుతాయి. అందుకు చక్కటి ఉదాహరణే ఈ VFJ MPV 6X6 ట్రక్కు.

More from DriveSpark

Article Published On: Monday, February 10, 2025, 13:55 [IST]
English summary
Vfj mpv 6x6 truck in indian army vehicle check interesting features and safety details here
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+