వీడియో: చావు తప్పి కన్ను లొట్ట పోవటం అంటే ఇదే..
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు రావటం అంటే ఇదేనేమో..! కారు బర్నవుట్ (ఓ రకమైన డ్రిఫ్టింగ్ లాంటి స్టంట్)ను చిత్రీకరించేందుకు వచ్చిన ఓ కెమెరామెన్ దాదాపు చావును సెంటీమీటర్ దూరంలో చూసొచ్చాడు. అసలేం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం రండి.
ఫెరారీ ఎఫ్430 స్పైడర్ 16ఎమ్ లిమిటెడ్ ఎడిషన్ సూపర్ కారు బర్నవుట్ దృశ్యాలను దగ్గర నుంచి కెమెరాలో బందించేందుకు ఓ కెమెరామెన్ ప్రయత్నించాడు. అయితే, బర్నవుట్ చేసే సదరు డ్రైవర్ ఎలాంటి కెమెరామెన్‌కు ఎలాంటి సిగ్నల్ చేయకుండానే తన బర్నవుట్ ప్రక్రియ స్టార్ట్ చేయటంతో కమెరామెన్ పడిన పాట్లను మీరే ఈ వీడియోలో చూడండి.
ఇందులో ఫెరారీ కారును నడుపుతున్న డ్రైవర్ ఓ చేతిని గాలిలోకి లేపి మరో చేతితో కారును నడుపుతూ ఈ స్టంట్ చేశాడు. పైకి లేపిన చేతి వేళ్ల మధ్యలో ఓ సిగరెట్ కూడా ఉంది. రేస్ ట్రాక్‌పై కాకుండా పబ్లిక్ రోడ్డుపై ఈ స్టంట్ చేయటం, కెమరామెన్‌కు చెప్పకుండా స్టంట్ ప్రారంభించడం ఇవన్నీ రిస్కీ అంశాలు. అదృష్టం బాగున్న కెమరామెన్ చివరి నిమిషంలో అడుగు వెనక్కు వేయటంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/YyE1Qh1enZQ?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








