స్కూటీపై జంట హల్‌చల్.. నడి రోడ్డుమీద హగ్ చేసుకుంటూ డ్రైవింగ్..
ఢిల్లీ మెట్రోలో కొన్ని డ్యాన్స్ సహా అసభ్యకరమైన వీడియోలు సోషల్ మీడియోలో ఈ మధ్య కాలంలో తెగవైరల్ అయ్యాయి. ఆ వీడియోలపై మెట్రో ప్రయాణికులు తీవ్ర అసహనం చేశారు. తాజాగా ఢిల్లీలో నడిరోడ్డుపై ఓ జంట చేసిన రచ్చ నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియోలో ఓ యువతి, యువకుడు రద్దీగా ఉన్న రోడ్డుపై ద్విచక్రవాహనంపై వెళ్తుండడం మనం గమనించవచ్చు. అయితే ఒకానొక సందర్భంలో స్కూటీ వెనుక సీట్లో కూర్చున్న యువతి.. డ్రైవింగ్ చేస్తున్న యువకుడిని కౌగిలించుకోవడానికి ప్రయత్నం చేయడాన్ని మనం గమనించవచ్చు. ప్రతిగా డ్రైవింగ్ చేస్తున్న సదరు యువకుడు ఆమెను హగ్ చేసుకొనేందుకు ప్రయత్నించడం ఈ వీడియోలో చూడొచ్చు.

ఈ వీడియోను వెనుక వస్తున్న వాహనదారులు షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను ఓ నెటిజన్ పోస్టు్ చేయగా.. బిజీ రోడ్లపై అసభ్యకరంగా మరియు ప్రమాదకరంగా ప్రయాణించడం పట్ల పలువురు నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.
ఈ వీడియోపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఈ వీడియోపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం రోడ్డపై వెళ్తున్నప్పుడు సేఫ్టీ ముఖ్యమని చెబుతున్నారు. యమరాజ్ వారి చుట్టు తిరుగుతున్నాడు. ఎప్పుడైనా తీసుకెళ్లవచ్చు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరు.. 'కొత్త జనరేషన్.. కొత్త సృష్టి' అంటూ కామెంట్ చేశారు. 'వాళ్లకు ఢిల్లీ మెట్రోలో చోటు దొరకలేదు' అంటూ సరదాగా మరొ నెటిజన్ కామెంట్ చేశారు.
అయితే ఇటువంటి ఘటనలు ఈ మధ్య తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే ఇద్దరు అమ్మాయిలు బైక్ స్టంట్ చేసేందుకు ప్రయత్నం చేసి చిక్కుకున్నారు. బైక్‌పై ఎదురెదురుగా కూర్చొని ఒకరినొకరు కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకున్న వీడియో బాగా వైరల్ అయింది. దీనిపైనా చాలామంది నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు వారిద్దరిపై జరిమానా విధించాలని కోరారు.
అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ మాత్రం తమిళనాడుకు చెందినదిగా గుర్తించారు. అయితే పోస్ట్ చేసిన వ్యక్తి జార్ఘండ్‌కు చెందినవారు. ఈ అమ్మాయిలు స్టంట్ చేస్తున్న సమయంలో బైక్ వేగం 30-40 మధ్యలో ఉంటుంది. అప్పట్లో ఈ వీడియో సంచలనంగా మారింది. ఈ అమ్మాయిల ప్రవర్తనపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
కొన్నిరోజుల క్రితం ఢిల్లీ మెట్రో కోచ్‌లో ఓ యువ జంట రొమాంటిక్ కిస్సింగ్ సీన్ వీడియో తెగ వైరల్ అయింది. ఈ వీడియోలో మెట్రో కోచ్ ప్లోర్‌పై యువకుడు కూర్చోగా.. యువతి అతని కాలుపై తలపెట్టి కూర్చొంది. మెట్రోలోని తోటి ప్రయాణికులే ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఈ ముద్దు సీన్‌పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు. అందులో కొన్ని సరదా వ్యాఖ్యలు, మరికొందరు సీరియస్‌గా కామెంట్లు చేశారు. ఈ వీడియోలో యువకుడు.. యువతికి సీపీఆర్ చేస్తున్నాడంటూ సరదాగా ఓ యూజర్ కామెంట్ చేశాడు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








