వీడియో: అత్త మీద కోపం దుత్త మీద చూపితే ఇలానే జరుగుతుంది
తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష.. ఈ హితబోధని మనం చిన్నప్పుడే చదువుకొని ఉంటాం. మన జీవన ప్రయాణంలో అనేక సందర్భాల్లో దీన్ని విని ఉంటాం. కోపం వచ్చినప్పుడు మనిషి ఇంగితం కోల్పోయి ప్రవర్తిస్తుంటాడు. కోపంలో తీసుకునే నిర్ణయాలు, ఆవేశంతో చేసే పనులు అనర్థాలకు దారితీస్తుంటాయి. అలాంటి ఓ సందర్భాన్నే ఈ వీడియోలో చూద్దాం రండి.
రోడ్డుపై వెళ్లేటప్పుడు ఎంతో శాంతంగా వ్యవహరించాలి. పక్కవారు కవ్వింపు చర్యలకు పాల్పడినప్పటికీ, మనం మాత్రం ఇంగితం కోల్పోకుండా వ్యవహరించాలి. అలా కాకుండా, మూర్ఖంగా విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తే ఇలానే భంగపాటుకు గురికావల్సి వస్తుంది.
రోడ్డుపై వెళ్తున్న కారు డ్రైవర్‌తో రోడ్ రేజ్ (గొడవ)కు దిగిన ఓ బైకర్ తన బైక్‌పై వేగంగా బైక్‌పై వచ్చి కాలితో కారు డోరును తన్ని తన కోపాన్ని ప్రదర్శించాడు. కానీ, ఇక్కడ అతని కోపమే అతనికి శత్రువుగా మారింది. చలనంలో ఉన్న కారును బైక్‌పై నుంచి తన్నడంతో బైక్ అదుపు రోడ్డుకు పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టడం జరిగింది. దీంతో సదరు బైకర్ బైక్‌పై నుంచి క్రిందకు పడిపోయాడు.
ఈ విషయంలో తప్పు ఎవరిదైనప్పటికీ, దానిని నెమ్మదిగా మాట్లాడుకొని పరిష్కరించుకొని ఉంటే పోయిండేది. అవేశాలకు పోయి ఇలాంటి అనర్థాలు తెచ్చుకోవటం అవసరమా చెప్పండి..? సరే ఆ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/UpjZNUWNaww?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








