స్నానం చేయడానికి కూడా పబ్లిసిటీ.. పోలీసులు ఎంట్రీతో కథ మొత్తం రివర్స్
మనిషి కోతి నుంచి వచ్చాడని మనం అందరూ చిన్నప్పుడే చదువుకున్నాం. అయితే ఈ కోతి చేష్టలు ఇంకా కొంత మందిలో అలాగే ఉన్నాయేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల వైరల్ అయిన ఒక వీడియోను చూస్తే తప్పకుండా అందరికి అదే అనిపిస్తుంది. ఇంతకీ దీని వెనుక వున్న అసలు కథ ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

నివేదికల ప్రకారం, కొల్లాం జిల్లాలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓకే వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మీరు గమయించినట్లయితే ఇద్దరు యువకులు బైకుపై అర్ద నగ్నంగా వెళ్తున్నారు, అంతే కాకుండా రైడింగ్ సమయంలోనే స్నానం చేయడం కూడా ఇక్కడ చూడవచ్చు.

ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తులు అజ్మల్, బదుషా అని తెలిసింది. ఈ ఇద్దరు యువకులు బైకుపై వెల్తూ సబ్బు రుద్దుకుంటూ మరీ స్నానం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది పోలీసులు దృష్టికి కూడా చేరింది. పోలీసులు ఆ ఇద్దరి యువకులపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన గత వారంలో జరిగినట్లు తెలిసింది. కొల్లం భర్నికావ్ జంక్షన్ మీదుగా వెల్తూ ఈ సంఘటనకు ఆయువకులు పాల్పడ్డారు.

నిజానికి మనం బైకులో ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా వర్షం పడితే ఎక్కడ తడచిపోతామో అని ఏదో ఒక నీడను వెతుక్కుంటాము. అయితే ఈ సంఘటనలో ఆ ఇద్దరు యువకులు మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించడం చూడవచ్చు. ఆ సమయంలో ఆ ఇద్దరు యువకులు ఏమైనా మద్యం సేవించారా..? లేదా..? అనేది కూడా తెలియాల్సి ఉంది. దీనిపైనా కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

భారతదేశంలో ప్రతి సంవత్సరం లెక్కకు మించిన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇందులో అనేకమంది ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరు అంగవికలాంగులు కావాల్సి వస్తోంది. దీనినిదృష్టిలో ఉంచుకుని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రోజురోజుకి ట్రాఫిక్ నియమాలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బైకుపై ప్రయాణించేవారు తప్పకుండా హెల్మెట్ ఉపయోగించాలనే నియమం కూడా పెట్టారు.

పబ్లిక్ రోడ్లమీద ఇలాంటి ఆకతాయి పనులు చేయడం వారికి మాత్రమే కాదు, తోటి ప్రయాణికులకు కూడా చాలా ప్రమాదాన్ని తీసుకువస్తుంది. గతంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అప్పుడు కూడా పోలీసులు వారిపైన చర్యలు తీసుకున్నారు.

ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనలో ఆ ఇద్దరి యువకులపైన కేసు నమోదు చేసి రూ. 5 వేలు జరిమానా విధించినట్లు తెలిసింది. పోలీసుల విచారణలో వాన పడుతుండటంతో సరదా కోసం ప్రాంక్ చేశామని చెప్పారు. అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదని పోలీసులు వారికి గట్టిగానే బుద్ది చెప్పారు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
ఇటీవల కాలంలో ప్రాంక్ వీడియోలో ఎక్కువైపోతున్నాయి. ఇవి కొన్ని సందర్భాల్లో బాగానే అనిపించినా.. మరికొన్ని సందర్భాల్లో చాలా ప్రమాదాలను తీసుకువస్తాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటన కూడా ఇలాంటి ప్రమాదాన్నే తీసుకువచ్చింది. స్నానం అంటే బాత్‌రూంలోనో, స్విమ్మింగ్ ఫూల్‌లోనే చేస్తారు. బైకుపై వెల్తూ స్నానం ఏంటని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడంతోపాటు, మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








