Just In
- 7 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 18 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 20 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 21 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
బెజవాడలో చంద్రబాబు: నివురుగప్పిన నిప్పే..అధినేతకు అగ్నిపరీక్ష: కేశినేని కుటుంబం కోసం
- Movies
చిలికి చిలికి గాలివానలా.. సారంగ దరియాపై సుద్దాల అలా.. కోమలి ఇలా!
- Finance
బ్యాంకుల హోంలోన్ వడ్డీ రేటు తగ్గింపు: వారికి ఇలా ప్రయోజనం
- Sports
దిగ్గజాలా మజాకా.. మొన్న సెహ్వాగ్.. నిన్న లారా, తరంగా.. ఆ జోరు ఏ మాత్రం తగ్గలేదు.!
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]
సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక వీడియోలు చూస్తూ ఉంటాము. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఇలాంటివి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతాయి. ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

బాహుబలి సినిమాలో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తడం అందరికి తెలుసు, ఇప్పుడు నిజ జీవితంలో మనం మాట్లాడుకోబోయే బాహుబలి బైకునే తలపై పెట్టుకున్నాడు.

ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూసిన వారిలో చాలామంది వీడియోలో ఉన్న వ్యక్తిని ప్రశంసిస్తున్నారు. ఈ 9 సెకన్ల వీడియోను డాక్టర్ అజైత అనే ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశారు. ఈ వీడియోలో, ఒక కార్మికుడు బస్సుపైకి బైక్ ను ఎక్కించడానికి బస్సు వెనుక ఉన్న నిచ్చెన సహాయంతో బైకుని ఏకంగా తలపై పెట్టుకుని బస్సు ఎక్కడం ఇక్కడ చూడవచ్చు.
MOST READ:ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివరాలు

ఈ వీడియోలో, భారతదేశం నిజంగా నమ్మశక్యం కాదు, ఈ వ్యక్తి ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం, అని టైటిల్ పెట్టాడు. ఈ వీడియోకు ఇప్పటివరకు ట్విట్టర్లో 2.50 లక్షల వ్యూస్ వచ్చాయి. అయితే, బైక్ ఎత్తిన ఓ వ్యక్తిని ప్రశంసిస్తూ కొంతమంది అలసిపోరు, కొంతమంది ఈ వ్యక్తిని అద్దెకు తీసుకున్న యజమానిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలు బైక్ ఎత్తే ఈ పనిలో, ఈ వ్యక్తి రోజూ నిస్సహాయ స్థితిలో చాలా నొప్పితో బాధపడాల్సి వస్తుందని అంటున్నారు. కానీ ఈ వ్యక్తి తనను మరియు తన కుటుంబాన్ని పోషించడానికి ఇలా చేస్తున్నాడు. ఈ కార్మికుడు ఈ పని చేయకూడదని చాలామంది తెలిపారు, ఈ విధంగా చేస్తే తన మీద భాగం చాలా నొప్పికి గురై తరువాత కాలంలో ఇబ్బందిపడాల్సి వస్తుందన్నారు.
MOST READ:ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే

ఈ కార్మికు ఇలాంటి పనిని కొనసాగిస్తే, అతని మెడ చాలా భాధను భరించాల్సి వస్తుంది. చాలా మంది ట్విట్టర్ యూజర్లు ఈ వీడియోలో ఉపయోగించిన క్యాప్షన్ ఆ కార్మికుడిని ఎగతాళి చేస్తోందని అంటున్నారు. ఈ విధంగా సమాజంలో చాలామంది కార్మికులు కూటి కోసం చాల పనులు చేస్తుంటారు.
సోషల్ మీడియాలో ఈ వీడియోపై ప్రజలు ఇప్పటికీ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. గతంలో ఇలాంటి ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఏదిఏమైనా ఈ విధంగా, బైక్‌ను తలపై ఎత్తడం చాలా ప్రమాదకరం.
MOST READ:కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి

100 సిసి బైక్ సాధారణంగా 130 నుంచి 150 కిలోల బరువు ఉంటుంది. అటువంటి పూర్తి బైక్‌ను ఎత్తడం అనేది సాధారణంగా ఒకరి వల్ల సాధ్యమయ్యేపనికాదు. కానీ గ్రామీణ ప్రాంతాలకు చెందిన చాలామంది బలిష్టంగా ఉండటం వల్ల, చాలా బరువున్న వాటిని కూడా అవలీలగా తీసుకెళ్లగలరు. ఇలాంటి కార్మికులు బస్ స్టాండ్స్ వద్ద మరియు రైల్వే స్టేసన్స్ వద్ద ఉంటారు. నిజంగా పొట్ట కూటికి మనిషి పడుతున్న పాట్లు ఎన్నెన్నో..