ట్రక్కుపై హైదరాబాద్ వెళ్తున్న భారీ విమానం.. ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్: వీడియో చూడండి
సాధారణంగా మనం నిత్య జీవితంలో భారీ పరికరాలను భారీ ట్రక్కులు రవాణా చేసిన సంఘటనలు చాలానే చూసాము, అలాంటి సంఘంటనే మళ్ళీ ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.
ఒక భారీ ట్రక్కు పెద్ద పెద్ద వాహనాలను, పెద్ద పెద్ద పరికరాలను తీసుకెళ్లడం చూసి ఉంటాము, అయితే ఏకంగా పెద్ద విమానాన్ని తరలించడం బహుశా చాలా తక్కువ సార్లు మాత్రమే మనకు కనిపించి ఉంటాయి.

ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక వీడియోలో ఒక పెద్ద ట్రక్కు అంతకంటే పెద్దగా ఉన్న ఒక విమానాన్ని తరలిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎయిర్ ఇండియాకు చెందిన పాత 'ఎయిర్ బస్ ఎ320' విమానాన్ని ట్రక్కు తరలిస్తోంది.
ఈ పాత విమానాన్ని హైదరాబాద్ నగరానికి చెందిన ఒక రెస్టారెంట్ యజమాని వేలంలో కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఈ విమానం సర్వీసులో లేదు. కావున రెస్టారెంట్ యజమాని కొనుగోలు చేయగలిగాడు. అయితే ఈ విమానాన్ని ఆ వ్యక్తి కేరళలోని త్రివేండ్రం నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ కి తరలిస్తున్నారు.
అతి పెద్ద విమానాన్ని రోడ్డు మార్గం ద్వారా తరలించడం చూసిన చాలా మంది జనం ఎంతో ఆశ్చర్యంతో చూడటానికి తండోపతండాలుగా రోడ్డుపైకి వచ్చారు. రోడ్డు పైన గుమికూడిన జనం మరియు పోలీసులను మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న ఈ విమానాన్ని రెస్టారెంట్ గా మార్చడానికి హైదరాబాద్ వ్యక్తి దీనిని కొనుగోలు చేసినట్లు తెలిసింది, కానీ కొనుగోలు చేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉన్నాయి.
ఇది భారీగా ఉన్న పెద్ద విమానం కాబట్టి మెల్లగా ట్రక్కు సహాయంతో రోడ్డు మార్గంలోనే మెల్లగా తీసుకెళ్తున్నారు. విమానాన్ని తీసుకెళ్తున్న ట్రక్కు కేరళలోని కొల్లాం జిల్లా వద్దకు చేరుకొని బ్రిడ్జ్ దాటే సమయంలో హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ సమయంలోనే రోడ్డు పక్కన ఉన్న చాలామంది జనం ఈ భారీ విమానాన్ని చూడటానికి కదిలి వచ్చారు. చాలామంది స్థానిక ప్రజలు ఇంతపెద్ద విమానాన్ని ఎప్పుడూ ఇంత దగ్గరా చూడలేదని ఆశ్చర్యపోయారు.

సాధారణంగా పెద్ద వస్తువులను రోడ్డుపైన రవాణా చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రవాణా చేసే వాహనం అది తరలించే వాహనం కంటే కూడా పరిమాణంలో చిన్నగా ఉన్నప్పుడు ఆ ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్న పని అవుతుంది. కావున రోడ్డుపైన ప్రయాణించేటప్పుడు చాలా భద్రతను కల్పించాల్సి ఉంటుంది. దీనికోసం 10 నుంచి 20 మంది పోలీసులు ట్రాఫిక్ నియంత్రిస్తూ ఉంటారు.
వేలంలో హైదరాబద్ రెస్టారెంట్ యజమాని ఈ ఎయిర్ బస్ విమానానికి ఎంత చెల్లించారు అనేది కూడా స్పష్టంగా వెలుగులోకి రాలేదు. అయితే ఈ విమానాన్ని రోడ్డు మార్గంలో తీసుకెళ్లడానికి అనుకూలంగా దానికి రెక్కలు, తోక భాగం మరియు ముందు భాగం తొలగించారు. ఇవన్నీ తొలగించడం వల్ల రవాణా చేయడానికి కొంత సులభం అయింది. ఈ విమానాన్ని కేరళ నుంచి హైదరాబాద్ కి చేర్చడానికి కనీసం నెలరోజులు సమయం పడుతుందని చెబుతున్నారు.
భారీ విమానాన్ని తరలించే సమయలో అటు ఇటు కదలకుండా పటిష్టంగా ఉంచడానికి కావాల్సిన భద్రతలు తీసుకున్నారు. అంతే కాకుండా ఇటువంటి పెద్ద వస్తువులను తరలించడానికి చాలా లాజిస్టిక్స్ కంపెనీలు ఉన్నాయి. ఇలాంటి కంపెనీలలో అనుభవం ఉన్న డ్రైవర్లు ఇలాంటి సాహసాలకు ముందుకు వస్తారు.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
పెద్ద పెద్ద ట్రక్కుల సాయంతో పెద్ద ట్రాన్స్ ఫార్మర్స్, పవర్ ప్లాంట్స్ మరియు కొని పరిశ్రమల కోసం పెద్ద బాయిలర్ వంటి వాటిని తీసుకెళ్లడం చూసే ఉంటారు. ఇలాంటి పెద్ద విమానాలు తీసుకెళ్లే సంఘటనలు చాలా అరుదు, అంతే కాకుండా.. ఇలాంటి పెద్ద వస్తువులను తరలించడం చాలా కష్టం కూడా. గతంలో ఢిల్లీ గురుగ్రామ్ హైవేలో ఒక బ్రిడ్జ్ కింద స్క్రాప్ చేయబడిన ఎయిరిండియా విమానం వేరొక ప్రదేశానికి తరలిస్తున్న సమయంలో ఇరుక్కుపోయింది.


Click it and Unblock the Notifications








