వందే భారత్ రైళ్లను ఎలా శుభ్రం చేస్తారో తెలుసా??.. ఈ ఇంట్రెస్టింగ్ వీడియోను చూసేయండి.!!
దేశంలో అతి పెద్ద రవాణా రంగం రైల్వే రంగం. ప్రతి రోజూ లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. అయితే నిత్యం రద్దీగా ఉండే అతి పొడవైన ఈ రైళ్లను ఎలా శుభ్రం చేస్తారు అనే డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా.. వారికోసమే రైల్వే మంత్రిత్వ శాఖ ఓ వీడియో విడుదల చేసింది. ఆ ఆసక్తికర వీడియో ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి..
ప్రతి రోజూ ఒక్కో రైలు వేల మంది ప్రయాణికులను మోసుకెళ్తుంది. గంటల తరబడి ప్రయాణం ఉండటంతో దుమ్ము, ధూళి కూడా ఎక్కువగా చేరుతుంది. అందుకే బైక్, కారు, బస్సు మాదిరిగానే రైళ్లను కూడా నిత్యం శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే మరి ఈ రైళ్లను ఎలా శుభ్రం చేస్తారు.. ఎంత సమయం తీసుకుంటుంది. అని ఎప్పుడైనా ఆలోచించారా.??

ఇటీవల ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్ల(Automatic Coach Washing Plants)లో వందేభారత్ రైళ్లను శుభ్రపరిచే వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వందే భారత్ రైళ్లు అత్యధిక ప్రజాదరణ పొందుతున్నాయి.
భారతీయ రైల్వే శాఖ నిర్వహిస్తున్న ఈ వందేభారత్ రైళ్లలో(Vande Bharat)ఎన్నో అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. బయో టాయిలెట్లు, సౌకర్యవంతమైన సీట్లు, ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్, ఏసీ, నాన్ ఏసీ ఇంకా అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ క్రమంలో రైల్వే శాఖలో వస్తున్న విస్తృతమైన మార్పుల కారణంగా.. అందుకు సంబంధించిన ఆసక్తికర సమాచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటోంది.

ఈ క్రమంలో అత్యాధునిక వసతులతో సౌకర్యవంతంగా ఉండే ఈ వందే భారత్ రైళ్ల నిర్వహణ ఎలా ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు. ఈ క్రమంలో వందే భారత్ రైల్ కోచ్‌ల మెయింటెనెన్స్‌కు సంబంధించి రైల్వే శాఖ (Ministry of Railways) ఓ ఆసక్తికర వీడియోను పంచుకుంది. ఇందులో వందే భారత్ రైలు కోచ్‌లను ఎలా శుభ్రం చేస్తారో ప్రదర్శించింది.
రైల్వే శాఖ విడుదల చేసిన వీడియోను పరిశీలించినట్లయితే వందేభారత్ రైళ్లను శుభ్రపరిచేందుకు దేశవ్యాప్తంగా 73 చోట్ల అత్యాధునిక ఆటోమేటిక్ క్లీనింగ్ ప్లాంట్లను (Automatic Cleaning plants) ఏర్పాటు చేశారు. అతి తక్కువ ఖర్చుతో పాటు అతి తక్కువ నీటి వినియోగంతో రైళ్లను శుభ్రపరచడం ఈ క్లీనింగ్ ప్లాట్ల ప్రత్యేకతగా రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇందులోని మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్.. కేవలం 20 నిమిషాల్లోనే 24 కోచ్‌లు ఉన్న రైలును శుభ్రం చేయగలదు. గతేడాది అక్టోబర్‌లో ఈ క్లీనింగ్ ప్లాంట్‌లు దేశంలో అందుబాటులోకి వచ్చాయని రైల్వే శాఖ తెలిపింది. హై ప్రెజర్‌తో నీటిని చిమ్ముతూ ఈ ప్లాంట్‌లు రైళ్లను శుభ్రపరుస్తాయి.
ఈ ఆటోమేటిక్ క్లీనింగ్ ప్లాంట్లలోని నిలువుగా, అడ్డంగా ఉండే పలు ఆటోమేటిక్ బ్రష్‌లు రైళ్లను పూర్తిగా శుభ్రపరుస్తాయి. అంతేకాకుండా ఇవి పర్యావరణ హితంగా పనిచేస్తాయి. అందుకు సంబంధించిన పద్ధతులను ఈ ప్లాంట్లు అవలంబిస్తాయి. వందే భారత్ రైళ్లు సమయపాలన పాటిస్తాయనే విషయం తెలిసిందే.

ఆ షెడ్యూల్ ప్రకారం ఈ మోడరన్ క్లీనింగ్ సిస్టమ్‌ను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. బుల్లెట్ రైళ్లను శుభ్రపరిచేందుకు జపాన్‌లో ఉపయోగించే టెక్నాలజీ ఆధారంగా దీన్ని భారత్‌లో ప్రవేశపెట్టినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. కాగా కొన్ని చోట్ల సాధారణ రైళ్లను మ్యాన్యువల్‌గానే శుభ్రం చేస్తున్నారు. దీనికి చాలా సమయం తీసుకోవడంతో పాటు నీరు, శ్రమ కూడా వృథా అవుతోంది.
భారతీయ రైల్వే రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో రైల్వే శాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ రైళ్లకు సంబంధించి 40 వేల కోచ్‌లను వందేభారత్ స్థాయి ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇంకా వందేభారత్ నుంచి మెట్రో, స్లీపర్, సాధారణ్ రైళ్లు అభివృద్ధి చెందుతున్నాయి.


Click it and Unblock the Notifications








